Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అలర్ట్: గర్భిణీ మహిళలు మామిడిపండ్లు తినడం సురక్షితమేనా...
సహజంగా మహిళలు గర్భవతులు అయ్యారంటే మరో జీవికి ప్రాణం పోస్తున్నట్లే. గర్భం దాల్చిన స్త్రీలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మార్పులతో పాటు ఆహారనియ మాల్లోనూ మార్పులు పాటించాల్సి వస్తుంది. కడుపులో ఎదుగుతున్న బిడ్డకు పోషకాహారం అందాలంటే గర్భిణి స్త్రీలు మంచి విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. అప్పుడే బిడ్డతో పాటు తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
చాలామంది గర్భిణీలకు గర్భం ధరించిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తినకూడదు అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి . అవి తింటే ఏం జరుగుతుందో, ఇవి తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో. అలాంటి అపోహాలు తొలగిపోవాలంటే. ఈ చిట్కాలను తప్పని సరిగా పాటించాలి.
గర్భిణీ స్త్రీలు అన్ని రకాల ఆహార పదార్ధాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్ధాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి. తల్లికి ఎక్కువగా శక్తి లభించే ఆహార పదార్ధాలు ఇవ్వడం వలన తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాగే కాన్పు సమయంలో, ప్రసవానంతర అత్యవసర పరిస్ధితులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాలి.
రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ తినాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి.
పండ్లు తప్పనిసరి.... గర్భిణి స్త్రీలు ఎక్కువగా తీసుకో వలసినవి పళ్లు. అన్ని రకాల పళ్ళను ఆహారంగా తీసుకో వడం అవసరం. చీనీపండ్లు, ద్రాక్ష, అరటిపండ్లు, ఆపిల్స్ వంటివి ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు పప్పుదినుసులు, బీన్స్, పాలు, పెరుగు వంటి పదార్థాలు ఎక్కువగా తీసు కోవాలి. ఎండుద్రాక్ష, అక్రూట్, బాదంపప్పు వంటివి తీసుకోవడం చేయాలి. వీటిద్వారా శరీరానికి కావలసిన ఖనిజపదార్థాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
పండ్లల్లో ఘుమఘలాడుతూ నోరూరించే...జ్యూస్ మ్యాంగో(మామిడిపండ్ల)ను గర్భిణీలు తివనవచ్చా లేదా అనేది చాలా మందికి అపోహలుంటాయి . మామిడిపండ్లు సీజనల్ ఫ్రూట్ ఇందులో విటమిన్ సి, ఎ మరియు బి6, పొటాషియం మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ రెండూ గర్భిణి స్త్రీకి మరియు బేబీకి ఇద్దరికి అత్యంత ముఖ్యమైనవి. వీటితో పాటు మరికొన్ని ప్రయోనాలను తెలుసుకుందాం..

ఎనర్జి పెరుగుతుంది
ఇంకా మామిడి పండ్లల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీ ఎనర్జిటిక్ గా ఉంటుంది . అలాగే ఆమెలో ఇమ్యూనిటి పెరుగుతుంది .

జీర్ణశక్తి
మామిడిపండ్లు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, మామిడి పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అధికబరువు, ఓబేసిటి తగ్గించుకోవచ్చు
స్వీట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారు కూడా నేచురల్ స్వీట్ నెస్ ను ఉండే మామిడి పండ్లను తీసుకోవచ్చు. దాంతో అజీర్తి మరియు ఓబేసిటి సమస్యలను తగ్గించుకొనవచ్చు.

మజిల్ పెయిన్ మరియు స్ట్రెస్ ను తగ్గిస్తుంది
మామిడిపండ్లలో ఉండే క్యాల్షియం కంటెంట్ మజిల్ పెయిన్ మరియు స్ట్రెస్ ను తగ్గిస్తుంది

అనీమియాను నివారిస్తుంది
మామిడిపండ్లలో ఉండే ఐరన్ గర్భిణీలు అనీమియాను నివారిస్తుంది ,

కంటి చూపు మెరుగ్గా ఉంటుంది
బాగా పండిన ఎల్లో కలర్ మామిడి పండ్లలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది అప్పుడే పుట్టిన బేబీకి మంచి కంటి చూపును అందిస్తుంది .

కంటెంట్ అధికంగా ఉంటుంది
డయాబెటిక్ ఉన్న గర్భిణీ స్త్రీలు మామిడిపండ్లను ఎక్కువగా తీసుకోకూడదు. మామిండిపండ్లలో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

కెమికల్ తో పండించిన వాటికి దూరంగా
అలాగే రసాయనాలతో పండించి, రసాయనాలతో మాగినవి తల్లి ఆరోగ్యానికి మాత్రమే కాదు, బేబీ హెల్త్ కు కూడా హానికరమే...

జెస్టేషనల్ డయాబెటిస్
మామిడిపండ్లతో తయారుచేసిన మిల్క్ షేక్స్ లేదా ఫ్రూట్ జ్యూస్ లను త్రాగడం వల్ల ఎక్కువ క్యాలరీలు శరీరానికి అందుతాయి దాంతో జెస్టేషనల్ డయాబెటిస్ కు కారణం అవుతుంది.



Click it and Unblock the Notifications