గర్భిణీలు తీసుకోవాల్సిన 14 రకాల డ్రింక్స్ ఇవే!

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

మహిళలు గర్భంతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్యంతో పాటు కడుపులో ఉండే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. గర్భిణీలు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో వైద్యుల సలహాల మేరకు ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తేనే కాబోయే అమ్మ తనతో పాటు తన గర్భస్థ శిశువును ఆరోగ్యంగా ఉంచుకోగలదు. ఇతర సమయాల్లో ఎలా ఉన్నా ఫర్వాలేదు గానీ గర్భిణిగా ఉన్నప్పుడు మాత్రం ఆహారాల్లో చాలా మార్పులు చేసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే గర్భిణీలు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడంతో పాటు కొన్ని రకాల జ్యూస్ లు కూడా తీసుకోవాలి. మరి గర్భిణీలు తీసుకోవాల్సిన 14 డ్రింక్స్ గురించి మీరు తెలుసుకోండి. గర్భిణీలు వీటిని తాగితే చాలా ప్రయోజనాలుంటాయి.

1. నిమ్మరసం

1. నిమ్మరసం

నిమ్మకాయ రసం గర్భిణీలకు చాలా మంచిది. నిమ్మలో విటమిన్ - సి పుష్కలంగా ఉంటుంది. అలాగే శరీరంలో ఐరన్ లెవెల్స్ పెంచడానికి ఇది బాగా దోహదపడుతుంది. నిమ్మరసం మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇక మీరు రోజులో ఎప్పుడైనా సరే నిమ్మరసాన్ని తీసుకోవొచ్చు. లేదంటే మధ్యాహ్నం భోజనం అయ్యాక కూడా నిమ్మరసాన్ని తీసుకోవొచ్చు. ఇక మీరు ఉదయం పూట కాస్త నీరసంగా ఉన్నా కూడా నిమ్మరసాన్ని తీసుకోవొచ్చు. దీంతో ఫుల్ ఎనర్జిటిక్ గా మారుతారు. నిమ్మరసంలో కొంచెం అల్లం (తురిమినది), కొన్ని పుదీనా ఆకులు, చాట్ మసాలా వేసుకుని కూడా తాగొచ్చు. ఇది ఇంకా మంచిది.

2. కొబ్బరి నీళ్లు

2. కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీరు గర్భిణీలకు చాలామంచిది. గర్భధారణ సమయంలో శరీరం హైడ్రేటెడ్ ఉండడానికి ఇది బాగా పని చేస్తుంది. శరీరం నుంచి చెమటరూపంలో పోయిన సహజ లవణాలను పునరుద్ధరించడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. అలసటకు ఇది మంచి ఉపశమనం పని చేస్తుంది. కాబట్టి, గర్భిణీలకు దాహంగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగించడం మంచింది.

3. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్

3. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్

గర్భిణీలకు తాజా పండ్ల రసాలు చాలా అవసరం. ముఖ్యంగా వేసవిలో వారు ఎలాంటి ఇబ్బందులుకు గురికాకుండా ఉండేందుకు ఇవి చాలా మేలు చేస్తాయి. నిమ్మ, ఆరెంజ్, పుచ్చకాయ, స్వీట్ లైమ్, మస్క్ మిలాన్స్ వంటి వాటి జ్యూస్ లను గర్భిణీలు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. తాజా పండ్ల రసాల్లో ఎక్కువ పోషకాలుంటాయి. గర్భధారణ సమయంలో ఇవి శరీరానికి అవసరమైన మినరల్స్ ను అందిస్తాయి.

4. మజ్జిగ

4. మజ్జిగ

వేసవికాలంలో గర్భిణీలకు మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది. మజ్జిగలో విటమిన్ బీ12, ప్రోటీన్స్, కాల్షియం ఉంటాయి. ఇవి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి బాగా ఉపయోగపడతాయి. మీరు బాగా అన్నం తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది.

5. ఫ్రూట్ స్మూతీ

5. ఫ్రూట్ స్మూతీ

మీకు ఇష్టమైన పండ్లతో మీరు ఫ్రూట్ స్మూతీలు తయారు చేసుకోవొచ్చు. పండ్లరసాలకు కొన్ని పాలు, కొంచెం ఐస్ కలిపితే చక్కటి స్మూతీ తయారవుతుంది. వీటిలో పోషకాలు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. గర్భధారణ సమయంలో ఇలాంటి స్మూతీలు చాలా మేలు చేస్తాయి. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుతాయి. అందువల్ల ఎక్కువగా ఫ్రూట్ స్మూతీలు తాగుతూ ఉండండి.

6. జల్జీరా

6. జల్జీరా

జల్జిరా కూడా గర్భిణీలకు చాలా మంచిది. గర్భధారణ సమయంలో దీన్ని తాగితే చాలా మంచిది. ఇది మీ శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది. అలాగే మీరు ఉదయంపూట కాస్త నీరసంగా ఉన్నా కూడా దీన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. జల్జీరా మీ మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మీరు ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా మీరు తిన్న ఆహారం ఈజీగా జీర్ణం కావడానికి బాగా ఉపయోగపడుతుంది.

7. ఐస్ డ్ టీ

7. ఐస్ డ్ టీ

ఐస్ డ్ టీ కూడా గర్భిణీలకు చాలా మంచిది. ఉదయం పూట ఉన్న నిస్సత్తువను పొగొట్టడానికి ఇది బాగా పని చేస్తుంది. మీరు ఉత్తేజంగా ఉండేందుకు కూడా ఈ టీ బాగా పని చేస్తుంది. అయితే మీరు రోజుకొకసారి మాత్రమే ఈ టీ తాగితే మంచిది. అంతకుంటే ఎక్కువగా తాగడం అంత మంచిది కాదు.

8. మంచి నీరు

8. మంచి నీరు

గర్భిణులు ఎక్కువగా నీరు తీసుకుంటూ ఉండాలి. శరీరానికి కావాల్సినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. దీంతో మీ శరీరం హైడ్రెటెడ్ గా మారుతుంది. ప్రసవించిన తర్వాత బిడ్డకు పాలు ఇవ్వడానికి కావాల్సిన శక్తి కూడా నీటి వల్ల వస్తుంది. అందువల్ల గర్భిణీలు నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగితే చాలా మంచిది.

9. పాలు

9. పాలు

పాల, పాలతో తయారైన పదార్థాల్లో ఎక్కువగా ప్రోటీన్స్, విటమిన్లు, కాల్షియంతో ఉంటాయి. గర్భిణీలు పాలు తాగడం వల్ల శరీరం మొత్తం హైడ్రేటెడ్ గా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా చల్లిటి పాలు, మిల్క్ షేక్స్ తాగుతూ ఉండాలి. పాల వల్ల గర్భిణీలకు చాలా ప్రయోజనాలున్నాయి. అందువల్ల రోజుకొక గ్గాస్ చొప్పున పాలు తాగుతూ ఉండాలి.

10. ఆమ్ పన్నా

10. ఆమ్ పన్నా

ఆమ్ పన్నా కూడా గర్భిణీలకు చాలా మేలు చేస్తుంది. దీన్ని చల్లటి నీరు, ఆకుపచ్చ రంగులో ఉండే మామిడి పండ్ల గుజ్జుతో తయారు చేస్తారు. ఇది మంచి ట్యాంగీ డ్రింక్. శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. గర్భిణీలకు కావాల్సిన చాలా విటమిన్లు ఇందులో ఉంటాయి. అందువల్ల గర్భిణీలు ఎక్కువగా దీన్ని తీసుకోవడం చాలా మంచిది.

11. కూరగాయల జ్యూస్

11. కూరగాయల జ్యూస్

మీరు రోజూ ఆహారంలో తగినంత మొత్తంలో కూరగాయలను తీసుకుంటూ ఉండకపోతే కూరగాయలతో తయారు చేసిన జ్యూస్ లను తాగుతూ ఉండాలి. వేసవికాలంలో గర్భిణీలకు ఇవి చాలా మేలు చేస్తాయి. ఎక్కువగా దాహం వేయకుండా చేస్తాయి. వీటిలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గర్భిణీలుకూరగాయలతో తయారు చేసిన జ్యూస్ లను ఎక్కవగా తీసుకుంటూ ఉండాలి.

12. చియా సీడ్ వాటర్

12. చియా సీడ్ వాటర్

చియా గింజల్లో రాగి, జింక్, నియాసిన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, భాస్వరం ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్నికి చాలా మంచివి. ముందుగా కొన్ని చియా గింజలను తీసుకోండి. వాటిని ఒక పాత్రలో పోసి నీళ్లు పోసి నానబెట్టండి. కొద్దిసేపు అలాగే ఉంచండి. తర్వాత ఆ నీటిని తాగండి. చియావిత్తనాల ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ ఆ నీటని తాగడం ద్వారా కలుగుతాయి. చియా సీడ్స్ శరీరాన్ని డీ హైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. గర్భిణీలు వారి డైట్ లో వీటిని కచ్చితంగా చేర్చుకోవాలి.

13. పుదీనా టీ

13. పుదీనా టీ

పుదీనా టీ కూడా గర్భిణీలకు చాలా మేలు చేస్తుంది. ఉదయం పూట కలిగే నిస్సత్తువను ఇది పోగొడుతుంది. అంతేకాకుండా దీని వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇది ఆకలిని పెంచుతుంది. తలనొప్పి నుంచి ఉపశమనం కలగిస్తుంది. అందువల్ల గర్భిణీలు పుదీనా ఆకులతో టీ తయారు చేసుకుని తాగడం చాలా మంచిది.

14. రూయిబోస్ టీ

14. రూయిబోస్ టీ

ఈ టీలో ఆమ్లజనకాలు అధికంగా ఉంటాయి.కెఫీన్ ఉండదు. దీనిలో ఇందులో మెగ్నీషియం, కాల్షియం ఉంటుంది. గర్భిణీలకు ఇవి చాలా అవసరం. ఈ టీ జీర్ణక్రియకు బాగా అయ్యేలా చేస్తుంది. ఇక ఈ డ్రింక్స్ మొత్తం కూడా మీరు రోజులో ఎప్పుడైన తాగొచ్చు. లంచ్ డిన్నర్ కు మధ్యలో లేదంటే.. బ్రేక్ ఫాస్ట్ కు లంచ్ మధ్యలో ఇలాంటి సమయంలో వీటిని తీసుకుంటే మంచిది.

English summary

14 Best Drinks To Have During Pregnancy

Following is a list of the 14 best drinks that you can have during your pregnancy months. These drinks are enriched with all the essential nutrients that are necessary for your baby's growth. Each drink brings the benefits of the constituents present in them. Let us have a brief description of each and every drink and know how they can help you in your pregnancy time.
Story first published: Thursday, November 16, 2017, 13:00 [IST]
Subscribe Newsletter