For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టలో కవలున్నప్పుడు, గర్భిణీలు ఖచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ..!!

|

ప్రస్తుత కాలంలో చాలామంది జంటలు ఒకేమారు ఇద్దరు పిల్లలను అంటే కవల పిల్లలను కనేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రకమైన కోర్కెలు వారిలో బాగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం నేడు మహిళలు చాలావరకు ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక ఆ ఉద్యోగంలో మేటర్నీటీ లీవ్ అంటూ రెండు సార్లు సెలవు పెట్టటం మహిళ తన ఉద్యోగ భధ్రతకు, తన కెరీర్ కు ఆటంకంగా భావిస్తోంది. ఒకే సారి గర్భం ధరించి ఇద్దరు పిల్లలనను కనేయాలని భావిస్తోంది. ఆమె అవసరం అటువంటిది. కనుక, ఒకే సారి ఇద్దరు పిల్లలను కనేందుకు తప్పక మార్గాలు కూడా వుంటాయి.

కవల పిల్లలు పుడితే చాలా అదృష్టమే మరి. మరి అలా కవల పిల్లలు పుట్టాలంటే అందుకు ప్రత్యేకంగా తీసుకోవలసిన ఆహారాలు కూడా ఉన్నాయి. వీటిని కనుక తిన్నట్లైతే కవల పిల్లలు పుట్టే చాన్సెస్ అధికంగా ఉన్నాయి. అవి కనుక తింటే తప్పకుండా కవలపిల్లలు కలిగే అవకాశం ఉంది. మరి అటువంటి ఆహారాలేంటో చూద్దాం... గర్భం పొందేందుకు ప్రయత్నించే సమయంలో పాల సంబంధిత ఉత్పత్తులు, చిలకడ దుంప వంటి దుంప పదార్ధాలు అధికంగా తీసుకుంటే అవకాశాలుంటాయి.మీరు కనుక ఒకే సారి కవల పిల్లలను కనాలని అనుకుంటుంటే, ఈ చిట్కాలు బహుశ మీకు ఉపయోగించవచ్చు. వీటితో పాటు జీవన శైలిలో కొన్ని మార్పులు తప్పకుండా చేసుకోవాలి. డైట్ హ్యాబిట్స్ ను తప్పనిసరిగా మార్చుకోవాలి. రెగ్యులర్ డైట్ లో ఈ క్రింది సూచించిన ఆహారాలను చేర్చుకవోడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటాయి. ట్విన్ ప్రెగ్నెన్సీ లో తీసుకోవల్సిన న్యూట్రీషియన్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా..

1. నట్స్ :

1. నట్స్ :

నట్స్ లో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువ పోషకాలను అందిస్తాయి. అన్ బార్న్ బేబీ హెల్తీగా ఉంటుంది.

2. పాలు :

2. పాలు :

గర్భంలో కవల పిల్లలున్నప్పుడు, పాలు తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు హైలీ న్యూట్రీషియన్ ఫుడ్ . కాబట్టి, రెగ్యులర్ డైట్ లో పాలు తీసుకోవడం వల్ల తల్లి బిడ్డకు అవసరమయ్యే క్యాల్షియం, ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా అందుతాయి.

3. పెరుగు:

3. పెరుగు:

పెరుగులో క్యాల్షియం, అధికంగా ఉంటుంది. ట్విన్స్ ను ఎక్స్ పెక్ట్ చేసేవారు క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. క్యాల్షియం ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల బేబీ బోన్స్ మరియు దంతాలు ఏర్పడుటకు సహాయపడుతాయి.

4. చేపలు:

4. చేపలు:

మాంసాహారం తినే వారు , మెర్యురి తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల కవలపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. సాల్మన్ ఫిష్ లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి.

5. చెన్న:

5. చెన్న:

చిక్ పీస్ లేదా చెన్నాలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో పొట్టలో కవలలున్నప్పుడు శెనగలు తినడం వల్ల బేబీ మజిల్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతాయిజ

6. గుడ్లు:

6. గుడ్లు:

గుడ్డులో న్యూట్రీషియన్స్, విటమిన్స్ , ప్రోటీన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి.ట్విన్ బేబీస్ కు , ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

7. ఆకుకూరలు:

7. ఆకుకూరలు:

గర్భిణీలు ఆకుకూరలు తినడం వల్ల, వీటిలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బేబీ డెవలప్ మెంట్ కు , బేబీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పాటకు గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

7 Best Foods To Eat When You Are Pregnant With Twins

If you are a to-be mom who has just found out that you are going to be the mother of twin babies, then you must be exhilarated, right? Well, did you know that there are superfoods that you must consume when you are pregnant with twins, to remain healthy?
Desktop Bottom Promotion