గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు యొక్క ప్రాధాన్యత గురించి ప్రతి స్త్రీ తెలుసుకోవల్సిన విషయాలు

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

సఫ్రాన్ ను కేసర్, కౌంజ్, జఫ్రాన్ మరియు కుంకుమపువ్వ ఈ పేర్లన్నీ కూడా ఒక ఆరోమాటిక్ స్పైస్ నే పిలుస్తారు. తెలుగులో కుంకుమ పువ్వుగా పిలుచుకునే ఈ మసాలా దినుసు అద్భుతమైన వాసన, కలర్, ఫ్లేవర్ మరిు ఔషధగుణాలున్నాయి.. కుంకుమపువ్వు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతుంది. ఒక అద్భుతమైన సిగ్మా ఫ్లవర్ నుండి దీన్ని తయారుచేస్తారు. ఇది చాలా పరిమితంగా మాత్రమే దొరుకుతుంది. అందుకే కుంకుమ పువ్వు యొక్క ఖరీదు ఎక్కువ.ఖరీదైనా కూడా కుంకుమ పువ్వు కొనడానికి చాలా మంది ఇష్టపడుతారు. చాలా అపురూపంగా మాత్రమే దొరికే కుంకుమపువ్వు ఇప్పుడు కొన్ని లోకల్ హెర్బల్ షాపుల్లో, ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది. అయితే ఖరీదు మాత్రం ఎక్కువే..

మన ఇండియాలో మాత్రం ఈ కుంకుమ పువ్వును ఒక మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా స్వీట్స్ , డిజర్ట్స్, మరియు కొన్ని ప్రత్యేకమైన వంటల్లో ఉపయోగిస్తారు . కుంకుమ పువ్వులో ఔషధ గుణాలు అధికంగా ఉండటం వల్లే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సుపరిచితం. మహిళ గర్భం పొందిన తర్వాత కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగుతారు. పుట్టబోయే పిల్లలు అందంగా, తెల్లగా పుడతారనే ఇలా తాగడానికి ఇష్టపడుతారు.

గర్భిణీలకు కుంకుమ పువ్వు ఏఏ విధంగా ఉపయోగడపడుతుందో తెలుసుకోవడానికోసమే ఈ ఆర్టికల్. కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే బిడ్డ తెల్లగా పుడుతారా?గర్భిణీలు కుంకుమపువ్వు తీసుకోవడం సురితమేనా? కుంకుమపువ్వులో ప్రయోజనాలు లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?ఈ ప్రశ్నలన్నింటికి జవాబు మీకు ఇక్కడ దొరుకుతుంది. మరి గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు తినడం మంచిదా కాదో తెలుసుకుందాం?

కుంకుమపువ్వు?

కుంకుమపువ్వు?

ముందుగా కుంకుమపువ్వు గురించి తెలుసుకుందాం. కాకస్ సాటివస్ అనే పువ్వు నుండి పుప్పుడి రేనువులు, మరియు పువ్వు రేకులను వేరుచేసి అమ్మడిజరగుతుంది. వీటిని ఎండబెట్టడం అమ్మడం జరగుతుంది. సాధారణంగా ఒక పువ్వులో కేవలం మూడు కాడలు మాత్రమే వస్తాయి. వీటి చేత్తోనే తీసుకోవచ్చు. ఇండియాలో కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో పండుతుంది. దీన్ని కింగ్ ఆఫ్ స్పైస్ గా పిలుస్తారు .

కుంకుమపువ్వు అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు?

కుంకుమపువ్వు అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు?

కుంకుమపువ్వు అందాన్ని మెరుగుపరిచి, యంగ్ గా కనబడేలా చేస్తుందని నమ్ముతారు. అందుకే చాలా మటుకు కమర్షియల్ బ్యూటీ క్రీములలో కుంకుమపువ్వును ఉపయోగిస్తుంటారు. ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ బ్యూటీ ప్రొడక్ట్స్, కుంకుమాది థైలం వంటివి బాగా ప్రసిద్ది చెందినవి.

ఇంకా కొన్ని ఆరోగ్యకరమైన ఉత్పత్తులలో కూడా జోడిస్తారు.

కుంకుమపువ్వులో ఔషధగుణాలు అధికం. ముఖ్యంగా దీన్ని ఆస్త్మా, అజీర్తి, ఇన్ ఫెర్టిలిటి, బట్టతల మరియు క్యాన్సర్ మెడికేషన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

ఇది పీరియడ్స్ లో నొప్పిని , తిమ్మెర్లను తగ్గిస్తుంది.

పిఎంఎస్ లక్షణాలను తగ్గించి, నయం చేస్తుంది

పసిపిల్లలకు కుంకుమపువ్వు పెట్టవవచ్చా?

పసిపిల్లలకు కుంకుమపువ్వు పెట్టవవచ్చా?

కుంకుమపవ్వును తినడం వల్ల చర్మం కాంతి మెరుగుపడుతుంది, స్కిన్ స్ట్రక్చర్ కూడా మెరుగు అవుతుంది. అయితే ఇది తల్లి తీసుకోవడం సురక్షితమో కాదు పరిశోధనల పరంగా ఎలాంటి ఆధారాలు లేవు., ప్రస్తుతం సైన్స్ కూడా ఇది ఒక అపోహ మాత్రమే అని తేల్చింది. అలాగని మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, గర్భిణీలు కుంకుమపువ్వు తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కలుగుతాయి.

కుంకుమపువ్వును గర్భిణీలు తినడం సురక్షితమా?

కుంకుమపువ్వును గర్భిణీలు తినడం సురక్షితమా?

కుంకుమపువ్వు తినడం వల్ల పుట్టే బిడ్డ తెల్లగా పుడుతుందని గ్యారెంటీ లేదు కానీ, ఇందులో ఇతర పోషక విలువలు, మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి కండరాల నొప్పులను మరియు మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, దాంతో ఆహారాలు మరింత బెటర్ గా తీసుకోవడానికి సహాయపడుతుంది. అయితే , కుంకుమపువ్వును పరిమితంగా మాత్రమే తీసుకోవాలి

గర్భిణీలు కుంకుమపువ్వు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు

గర్భిణీలు కుంకుమపువ్వు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు

పైన సూచించిన విధంగా గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.

మానసిక స్థితి మెరుగ్గా ఉంచుతుంది

మానసిక స్థితి మెరుగ్గా ఉంచుతుంది

గర్భిణీలలో తరచూ మనస్సు మారుతుంటుంది. అందుకు కారణం వారిలో కలిగే హార్మోనుల అసమతుల్యతలే, కుంకుమపువ్వు శరీరాన్ని మైండ్ ను విశ్రాంతి పరుస్తుంది. అందుకు కుంకుమపువ్వు యాంటీడిప్రెజెంట్ గా పనిచేస్తుంది. ఇది అందుకు అవసరం అయ్యే సెరోటినిన్ ను విడుదల చేస్తుంది.ఇది మూడ్ మార్చుతుంది. దాంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది

గర్భధారణ సమయంలో హైబ్లడ్ ప్రెజర్ తల్లికి మరియు బిడ్డకు కూడా ప్రమాదకరమే, కాబట్టి, గర్భిణీలు కొద్దిగా కుంకుమపువ్వును పాలతో కలిపి తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ లెవల్స్ తగ్గడానికి సహాయపడుతుంది.

జీర్ణశక్తిని పెంచుతుంది

జీర్ణశక్తిని పెంచుతుంది

గ్యాస్, కడుపుబ్బరం లేదా మలబద్దక సమస్యలుంటే, డైట్ లో కుంకుమపువ్వు చేర్చుకోవాలి. ఈ సమస్యలు కేవలం గర్భధారణ సమయంలో మాత్రమే ఉంటుంది కాబట్టీ, ఈ సమయంలో కొద్దిగా కుంకుమపువ్వు వాడటం మంచిది, కుంకుమపువ్వు ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

కుంకుమపువ్వు మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గిస్తుంది

కుంకుమపువ్వు మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గిస్తుంది

గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్ నెస్ సహజం, ఇటువంటి సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గించి, సౌకర్యవంతంగా మార్చుతుంది.

నొప్పి తగ్గిస్తుంది

నొప్పి తగ్గిస్తుంది

గర్భధారణ సమయంలో గర్భిణీలో అనేక మార్పులు వస్తాయి. పొట్టలో బేబీ పెరగడం వల్ల ఇంటర్ననల్ అవయావాలు, ఎముకల ఆకారం కొద్దిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో క్రాంప్స్, నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో కుంకుమపువ్వు ఒక పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. గర్భిణీలు ఎలాంటి నొప్పులున్నా తగ్గిస్తుంది.

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది

గర్భధారణ సమయంలో జరిగే అనేక మార్పులు వల్ల హార్ట్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇటువంటి సమయంలో ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారాలు ఏమాత్రం ఉపయోగపడవు. ఈ సమయంలో కుంకుమపువ్వును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ మరియు ట్రై గ్లిజరైడ్స్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

ఐరన్ లెవల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది

ఐరన్ లెవల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది

గర్భిణీలలో అనీమియా చాలా సాదారణ సమస్య. గర్భిణీలు రోజూ తీసుకునే మెడికేషన్స్ లో ఐరన్ పిల్స్ ఒకటి. కుంకుమపువ్వులో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల కుంకుమపువ్వు గర్భిణీలలో హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది.

జుట్టు రాలడం తగ్గిస్తుంది:

జుట్టు రాలడం తగ్గిస్తుంది:

గర్భధారణ సమయంలో చాలా మందికి హెయిర్ ఫాల్ ఉంటుంది. కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భిణీలలో నమ్మకాన్ని పోగొడుతుంది. కాబట్టి, తలకు కొద్దిగా కుంకుమపువ్వు పాలను అప్లై చేయడం వల్ల జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది. తర్వాత జుట్టు రాలడం తగ్గుతుంది.

కుంకుమపువ్వు బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది

కుంకుమపువ్వు బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది

కుంకుమపువ్వులో నిద్రపట్టించే గుణాలు ఎక్కువ. పొట్ట పెరిగే కొద్ది శరీరంల వివిధ రకాల నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు నిద్రలేమికి కారణం అవుతాయి. నిద్రలేమి సమస్యను నివారించడానికి రాత్రుల్లో కుంకుమపువ్వు పాలను తాగాలి. సఫ్రాన్ మిల్క్ తాగడం వల్ల రెస్ట్ ఫుల్ స్లీప్ పొందుతారు.

కుంకుమపువ్వు చర్మ సమస్యలను దూరం చేస్తుంది

కుంకుమపువ్వు చర్మ సమస్యలను దూరం చేస్తుంది

కుంకుమపువ్వు అన్ని రకాల చర్మ సమస్యలను దూరం చేస్తుంది. గర్భధారణ సమయంలో మెలస్మా, ప్రెగ్నెన్సీ మాస్క్ సాధారణ సమస్య. గర్భిణీలలో మొటిమలు, మచ్చలను నివారించడానికి కుంకుపువ్వు సహాయపడుతుంది.

కుంకుమపువ్వు అలర్జీలను దూరం చేస్తుంది

కుంకుమపువ్వు అలర్జీలను దూరం చేస్తుంది

గర్భధారణ సమయంలో గర్భిణీలలో వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. కుంకుమపువ్వు తినడం వల్ల వ్యాధినిరోధకశక్తి మెరుగుపడటానికి సహాయపడుతుంది. అలర్జీలను దూరం చేయడంతో పాటు, జలుబు, దగ్గు, ఇతర అలర్జీలను దూరం చేస్తుంది.

ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేస్తుంది

ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేస్తుంది

పొటాషియం అనే న్యూట్రీషియన్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం అయినది. ఇది గర్భిణీలకు కూడా చాలా అవసరం. కుంకుమపువ్వులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేస్తుంది.

ఇది ఓరల్ హెల్త్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది

ఇది ఓరల్ హెల్త్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది

గర్భధారణ సమయంలో ఓరల్ హెల్త్ చాలా ముఖ్యం, ఇది పెద్ద సమస్యగా మారుతుంది. శరీరంలో జరిగే అనేక హార్మోనుల ప్రభావం వల్ల చిగుళ్ళ వాపుల, రక్తస్రావం , నొప్పి ఉంటుంది. కొద్దిగా కుంకుమపువ్వు తినడం వల్ల చిగుళ్ళ వ్యాధి తగ్గుతుంది.

బేబీ మూమెంట్స్ ఫీల్ అవ్వడానికి సహాయపడుతుంది

బేబీ మూమెంట్స్ ఫీల్ అవ్వడానికి సహాయపడుతుంది

పొట్టలో బేబీ కదలికలను తెలుసుకోవడానికి కుంకుపువ్వు పాలు సహాయపడుతాయి , కుంకుమపువ్వు కలిపిన పాలను తాగడం వల్ల బేబీ కదలికలను గమనించవచ్చు. శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి, బేబి కదలికలను సహాయపడుతుంది.

కుంకుమపువ్వు వల్ల సైడ్ ఎఫెక్ట్స్

కుంకుమపువ్వు వల్ల సైడ్ ఎఫెక్ట్స్

గర్భస్రావానికి కారణం అవుతుంది

కుంకుమపువ్వులో ఎక్కువగా వాడటం వల్ల గర్భస్రావానికి కారణం అవుతుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది మరియు ఇది గర్భస్రావానికి కారణం అవుతుంది. కుంకుమపువ్వు వాడటానికి ముందు డాక్టర్ ను కలవండి.

హైపర్ సెన్సిటివిటిని పెంచుతుంది

కుంకుమపువ్వు అందరు మహిళలకు మంచిది కాదు, కొంత మందికి హైపర్ సెన్సిటివిటీగా పనిచేస్తుంది. మరికొంత మందిలో కుంకుపువ్వు నోరు తడి ఆరిపోవడానికి , తలనొప్పి, వికారం, వాంతులుకు కారణం అవుతుంది.

వాంతులు ఎక్కువ అవుతాయి

కుంకుమపువ్వు గర్భిణీలలో మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది. అలాగేవాంతులకు కూడా దారితీస్తుంది. కుంకుమపువ్వు వాసన లేదా ఫ్లేవర్ వాంతులకు కారణం అవుతుంది

ఇతర దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి

ఇతర దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి

కుంకుమపువ్వు రక్తస్రావం, మొటిమలు, మచ్చలు, అసమతుల్యత, కళ్ళు తిరగడం, తిమ్మెర్లు, మరియు కామెర్లు మొదలగు సమస్యలకుకారణం అవుతుంది.

గర్భిణీలు కుంకుమపువ్వు తినడానికి బెస్ట్ సమయం ఏది?

కుంకుమపువ్వు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దాంతో సంకోచానికి కారణం అవుతుంది. ఈ కారణం చేత, ఇది గర్భిణీలు మొదటి మూడు నెలలు తీసుకోకూడదు. గర్భధారణ పూర్తిగా స్థిరంగా ఉండదు. కుంకుమపువ్వును ఐదో నెల నుండి తీసుకోవడం మంచిది. కుంకుమపువ్వును తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రధించండి. హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నవారు కుంకుమపువ్వుకు దూరంగా ఉండాలి.

ఎంత మేర కుంకుమపువ్వును వాడుకోవచ్చు?

ఎంత మేర కుంకుమపువ్వును వాడుకోవచ్చు?

ఒక సారికి లేదా ఒక రోజులో 10గ్రాములకు మంచి ఉపయోగించకూడదు. దీనికి మించి తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ మీద ప్రభావం చూపుతుంది. పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం.

కుంకుమపువ్వును కరెక్ట్ గా ఎలా వాడాలి?

కుంకుమపువ్వును కరెక్ట్ గా ఎలా వాడాలి?

కుంకుమపువ్వు పాలు

కొన్ని పాలను వేడి చేసి, అందులో కుంకుమపువ్వు వేసి వేడి చేసి, గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి.

కుంకుమపువ్వును బాదం మరియు పిస్తాలతో తీసుకోవచ్చు

రెండు మూడు కుంకుమపువ్వు రేకులను బాదం, పిస్తాతో జోడించి తీసుకోవాలి. బాదం పిస్తాను నీళ్ళలో నానబెట్టి, మెత్తగా పేస్ట్ చేసి పాలలో కుంకుమపువ్వుతో పాటు కలిపి తాగాలి. అవసరం అయితే పంచదార కలుపుకోవాలి. ఈ డ్రింక్ ను వేడి గా లేదా చల్లగా తాగొచ్చు.

దీన్ని సూప్స్ లేదా కర్రీస్ లో ఫ్లేవర్ కోసం ఉపయోగించుకోవచ్చు

English summary

benefits of saffron during pregnancy | uses of saffron | why do pregnant women consume saffron

Pregnancy is a time when people go out of their way to get some saffron for the mother-to-be's consumption. A pregnant woman is advised by everyone around her to make sure to drink milk that has saffron added to it. The lore has it that drinking milk boiled with saffron makes the baby's complexion very fair.