For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో సంతానం కోసం సిద్ధమయ్యే వారు తెలుసుకోవలసిన అన్ని విషయాలు !!

By Gandiva Prasad Naraparaju
|

మీరు మీ కుటుంబాన్ని సంపూర్ణం చేసుకోవాలనే కుతూహలంలో ఉన్నారా? మీకు ఒక బిడ్డ ఉంది, కానీ కొత్తగా పుట్టే బిడ్డకోసం ఎదురుచూస్తూ ఉన్నారా? ఈ స్థిలో మీరు మరో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నారా?

ఒక బిడ్డ కంటే ఎక్కువమందికి కలిగి ఉండే కుటుంబం కోసం కలలు కంటూ ఉంటే, అతిత్వరలో మరో బిడ్డను కావాలి అనుకోవడం చాలా సాధారణం. కానీ గర్భంధరించాలి అని నిర్ణయించుకునే ముందు, మీరు ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

అతిత్వరలో మరో బిడ్డను భారించడంలో ఈ సంఘం ఎప్పుడూ;ముందు ఉంటుంది. పిల్లల వయసులు దగ్గాగా ఉంటే, ఇద్దరూ; కలిసి పెరుగుతారు, ఇద్దరి చదువులూ ఒకేసారి అయిపోతాయి, మీరు విశ్రాంతిగా ఉండొచ్చు అని అనుకుంటారు.

Everything You Should Know Before Planning For A Second Child

రెండవ బిడ్డను కావాలి అనుకునే ముందు మీరు గుర్తుంచుకోవాల్సినవి ఏమిటి

రెండవ సారి గర్భం పొందుటకు ప్లానింగ్ మరియు చిట్కాలురెండవ సారి గర్భం పొందుటకు ప్లానింగ్ మరియు చిట్కాలు

తోబుట్టువుల మధ్య పోటీతో వ్యవహరించాల్సిన అవసరం ఉండదని, ఇద్దరి మధ్య ఎక్కువ ప్రేమ ఉంటుందని మీరు వినే ఉంటారు. అయితే, ఇవన్నీ నిజంగా నిజాలు కావు. ఈ విషయంలో మీరు బాగా లోతుగా ఆలోచించి, మీకు మీ కుటుంబానికి ఏది మంచిదో అది నిర్ణయించుకోవాలి.

మీరు మంచిగా నిర్ణయం తీసుకోడానికి సహాయపడే కొన్ని అంశాలను మేము ఇక్కడ చేర్చాము. కాబట్టి, చదివి మరిన్ని విషయాలు తెలుసుకోండి.

పిల్లల మధ్య కనీసం 18 నెలల తేడా ఉండాలి

పిల్లల మధ్య కనీసం 18 నెలల తేడా ఉండాలి

వైద్యుల ప్రకారం, మీకు మీ పిల్లల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది, మీరు మరో బిడ్డకు జన్మనివ్వడానికి ముందు కనీసం 18 నెలల సమయం తీసుకోవడం మంచిది. 18 నెలల కంటే ముందే గర్భంధరిస్తే ప్రాణంలేని బిడ్డలు పుట్టడం, గర్భస్రావం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మీ బిడ్డ ఇంకా ఎదగకుండా పుట్టడం లేదా బరువు తక్కువగా పుట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఒక తల్లి కావడం వల్ల మీరు రక్తహీనత తో కూడా బాధపడవచ్చు. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. 18 నెలల ముందే మీరు గర్భ౦ధరిస్తే నీరు చాలా త్వరగా విరిగిపోతుంది.

మీ మొదటి బిడ్డతో మీ రెండో గర్భాన్ని ఎలా పంచుకోవాలి ? మీ మొదటి బిడ్డతో మీ రెండో గర్భాన్ని ఎలా పంచుకోవాలి ?

5 సంవత్సరాల కంటే ఎక్కువ అంతరం కూడా ఆరోగ్యకరం కాదు

5 సంవత్సరాల కంటే ఎక్కువ అంతరం కూడా ఆరోగ్యకరం కాదు

మీరు మరోబిడ్డ కోసం 5 సంవత్సరాల కంటే ఎక్కువ అంతరం తీసుకుంటే, మీకు కొన్ని సమస్యలు రావొచ్చు. మీకు ఇప్పటికీ ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, తరువాత గర్భం కష్టం కావొచ్చు. ప్రీ-ఎక్లంప్సియా, ప్రీ మెచ్యూర్ బర్త్, బరువు తక్కువగా ఉండడం ఇలాంటివి సాధారణంగా జరుగుతాయి.

తక్కువ వయసు తేడాతో పిల్లల్ని కనడం అనేది తల్లి ఆరోగ్యానికి ప్రమాదకరం

తక్కువ వయసు తేడాతో పిల్లల్ని కనడం అనేది తల్లి ఆరోగ్యానికి ప్రమాదకరం

బిడ్డ జన్మించిన తరువాత, తల్లికి నయం కావడం అవసరం. గర్భం తల్లి శరీరంలోని పౌష్టికాలను, శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఆరోగ్యకర గర్భం ధరించే ముందు ఆమె శరీర౦ సాధారణ స్థితికి రావాలి.

తోబుట్టువుల మధ్య వయసు తేడా 3 సంవత్సరాలు ఉండాలి

తోబుట్టువుల మధ్య వయసు తేడా 3 సంవత్సరాలు ఉండాలి

ఒక జంట ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చేటపుడు కనీసం 3 సంవత్సరాల వయసు తేడా ఉండేట్లు ప్రయత్నించాలని భారతీయ ప్రభుత్వం సిఫార్సుచేసింది. ఇది స్త్రీ శరీరం నయం కావడానికి ఈ సమయం సరిపోతుంది. దేశంలో జనాభా పెరుగుదలను నియంత్రించడానికి కూడా ఇది సహాయపడుతుందని ఈ సూచన ఇవ్వబడింది.

భయభ్రాంతులవకండి....రెండో బిడ్డను పొందండి!!భయభ్రాంతులవకండి....రెండో బిడ్డను పొందండి!!

మంచి వయసు తేడా వల్ల తోబుట్టువుల మధ్య అనుబంధం కూడా బాగుంటుంది

మంచి వయసు తేడా వల్ల తోబుట్టువుల మధ్య అనుబంధం కూడా బాగుంటుంది

పిల్లల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే, పెద్దవాడు చిన్నవాడి కంటే ఎక్కువ ప్రధాన పాత్రను పోషిస్తాడు. ఈ మార్గంలో, పిల్లలు ఒకరితో ఒకరు ఎక్కువ ఆరోగ్యకర అనుబంధంలో ఉంటారు. రెండవ బిడ్డ పుట్టాక తల్లిదండ్రులు పెద్ద బిడ్డతో ఎక్కువ సమయం గడపరని కొన్ని వాదనలు ఉన్నాయి. ఇది వత్తిడిని, పిల్లల మధ్య యుద్ధాన్ని సృష్టిస్తుంది. ఇలాంటి పరిస్ధితులను ఎదుర్కోవాలి అంటే, మీరు పెద్ద బాబుతో ఎక్కువ సమయం గడుపడానికి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అవసరం.

ఒకే వయసు పిల్లల్ని పెంచడం చాలా కష్టం

ఒకే వయసు పిల్లల్ని పెంచడం చాలా కష్టం

మీరు ఒక బిడ్డను కలిగి ఉంటే, మీకు తెలుసు అబ్బాయి/అమ్మాయి ని పెంచడం ఎంత కష్టమో. మీకు పిల్లలుంటే నిద్రలేని రాత్రులు, సమయంలేని రోజులు ఉండడం సాధారణం. మీరు మరో బిడ్డ కోసం సిద్ధంగా ఉన్నారా, మళ్ళీ ఆ ప్రక్రియలోకి వెళ్ళాలి అనుకుంటున్నారా? అది చాలా కష్టం, మీరు మళ్ళీ గర్భం ధరించే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా అవసరం.

English summary

Everything You Should Know Before Planning For A Second Child

Planning to have another baby? These are the things you need to know before you plan for the second baby.
Desktop Bottom Promotion