రెండో సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే ముందు ఇవి తెలుసుకోండి!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

రెండో సంతానం కోసం మీరు ప్లాన్ చేసుకుంటున్నారా? కొత్తగా పుట్టే బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారా?మరో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నానని అనుకుంటున్నారా? ఒక కలల కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుకున్నప్పుడు...రెండో బిడ్డకు జన్మనివ్వాలని అనుకోవడం సహజమే. అయితే గర్భం పొందాలని నిర్ణయించుకునే ముందు కొన్ని విషయాల గురించి ఆలోచించాలి.

వీలైనంత త్వరగా రెండో బిడ్డను కూడా కనాలని సమాజమే మీ ముందుకు తీసుకొస్తుంది. పిల్లల వయస్సు దగ్గరగా ఉన్నప్పుడు కలిసి పెరుగుతారు. ఎడ్యుకేషన్ కూడా ఇద్దరు కలిసి చేస్తారు. అప్పుడు మీరు విశ్రాంతి తీసుకోవచ్చని చెబుతుంటారు.

రెండవ గర్భధారణకు రెడీ అవండి!

తోబుట్టువుతో పోటితో వ్యవహారించాల్సిన అవసరం ఉండదని...తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయని మీరు కూడా వినే ఉంటారు. అయితే వీటిలో అన్ని నిజాలు కావు. సమస్యల గురించి మీరే ఆలోచించాలి. మీ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో మీరే న్యాయనిర్ణేతగా ఉండి నిర్ణయం తీసుకోవాలి.

మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే కొన్ని పాయింట్లను మీ ముందు ఉంచుతున్నాము.

పిల్లల మధ్య 18 నెలల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలి:

పిల్లల మధ్య 18 నెలల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలి:

వైద్యులు చెప్పిన ప్రకారం...మీ మొదటి శిశువుకు మరొక శిశువుకు కనీసం 18 నెలల గ్యాప్ ఉండాలి. అంతేకాదు ఇది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అప్పుడు సంభోగం మరియు గర్భస్రావానికి అవకాశం పెరుగుతుంది. మీ బిడ్డ ముందుగా జన్మించడం లేదా తక్కువ బరువుతో పుట్టె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రక్తహీనతతో బాధపడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పుట్టిన తర్వాత...మీ గర్భాశయం యొక్క సంక్రమణకు ప్రమాదం ఉంటుంది. మీరు 18 నెలల ముందు గర్భవతి అయితే నీరు తగ్గిపోతుంది.

5 సంవత్సరాల కన్నా ఎక్కువ గ్యాప్ అంత మంచిది కాదు:

5 సంవత్సరాల కన్నా ఎక్కువ గ్యాప్ అంత మంచిది కాదు:

ఒక శిశువుకు మరొక శిశువుకు మధ్య 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా గ్యాప్ ఉంటే ఎన్నో సమస్యలను ఎదుర్కొనవల్సి ఉంటుంది. అంతేకాదు గర్భం రావడానికి కష్టంగా ఉంటుంది. ప్రి-ఎక్లంప్సియా, ప్రిమెచ్చుర్, తక్కువ బరువు వంటి సమస్యలతో శిశువు జన్మిస్తుంది.

చిన్న పిల్లలు ఉంటే...తల్లి ఆరోగ్యం పట్ల చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది:

చిన్న పిల్లలు ఉంటే...తల్లి ఆరోగ్యం పట్ల చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది:

ప్రసవం తర్వాత...తల్లికి కొంత విశ్రాంతి అవసరం. ప్రసవం తర్వాత తల్లి శరీరానికి చాలా పోషకాలు, శక్తి అవసరం ఉంటుంది. శరీరం తనను తాను భర్తీ చేసుకోవల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన గర్భధారణకు ముందు సాధారణ స్థితికి తిరిగి రావాలి.

మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి

తోబుట్టువుల మధ్య ఆదర్శ వయస్సు అనేది మూడు సంవత్సరాలు ఉండాలి:

తోబుట్టువుల మధ్య ఆదర్శ వయస్సు అనేది మూడు సంవత్సరాలు ఉండాలి:

ఇద్దరు పిల్ల మధ్య కనీసం 3ఏళ్ల గ్యాప్ ను తప్పకపాటించాలని భారత ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఇది తల్లి శరీరాన్ని ఆరోగ్యకరంగా మార్చేందుకు తగినంత సమయం ఉంటుంది. దేశ జనాభా పెరుగుదలను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది.

పిల్లల మధ్య గ్యాప్ ఉంటే...ఖచ్చితంగా మంచి సంబంధం కలిగి ఉంటారు.

వయస్సు అంతరం అనేది పెద్ద పిల్లల్లో ఎక్కువగా ఉంటే:

వయస్సు అంతరం అనేది పెద్ద పిల్లల్లో ఎక్కువగా ఉంటే:

చిన్న పిల్లవాడు పోషకాహార పాత్రను తీసుకుంటాడు. ఈ విధంగా పిల్లలు మరింత ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. పెద్ద పిల్లవాడు తల్లిదండ్రుల ద్రుష్టిని ఆస్వాదించడానికి ఎక్కువ సమయం ఉంటుందని కొందరు వాదిస్తారు. అందుకే రెండో బిడ్డను కనేందుకు ఇష్టపడరు.

ఒకే వయస్సు ఉంటే...చుట్టూ ఉన్న పిల్లలు హ్యాండిల్ చేస్తారు:

ఒకే వయస్సు ఉంటే...చుట్టూ ఉన్న పిల్లలు హ్యాండిల్ చేస్తారు:

కానీ మీ బిడ్డపై శ్రద్ధ తీసుకునేందుకు చాలా కష్టంగా ఉంటుంది. రాత్రుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

అయితే మీరు మరో బిడ్డను కనేందుకు రెడీగా ఉన్నారా? లేదా మళ్లీ ప్రాసెస్ ద్వారా వెళ్లాలా? ఇది ఖచ్చితంగా కష్టమనే చెప్పాలి. మీరు గర్భాన్ని పొందడానికి ముందుకు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా అవసరం.

English summary

Things every mother should do before planning a second Child

You might also hear that you will not have to deal with sibling rivalry and there will be more love between the siblings. However, all of these are not really true. You need to think deeply on the issue and decide what is best for your family and yourself.
Subscribe Newsletter