For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెనోపాజ్ దశలో గర్భం దాల్చే అవకాశం ఉందా ?

By R Vishnu Vardhan Reddy
|

సాధారణంగా ప్రతి స్త్రీ తన జీవితం లో మెనోపాజ్ దశను ఎదుర్కొంటుంది. మెనోపాజ్ దశను తెలుగు లో రుతువిరతి అని అంటారు. ఈ దశను కొంతమంది కొన్ని నెలల పాటు అనుభవించవలసి వస్తే, మరికొంత ముందేమో కొన్ని సంవత్సరాల పాటు అనుభవించవలసి వస్తుంది. ఈ సమయంలో స్త్రీ యొక్క శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది, రకరకాల ఒత్తిళ్లు తలెత్తుతాయి, ఆలోచనలు విపరీతంగా మారిపోతుంటాయి, వేడి సెగలు తగిలినట్లు ఉంటుంది మరియు యోని దగ్గర పొడిబారినట్లు ఉంటుంది.

స్పష్టంగా చెప్పాలంటే, స్త్రీలలో ఉండే సంతానోత్పత్తి సామర్థ్యం ఈ దశలో అంతం అవుతుంది మరియు ఈ సమయంలో గర్భం దాల్చడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మీకు గనుక ఒక విషయం తెలిస్తే నిజంగా ఆశ్చ్చర్యపోతారు. అదేమిటంటే మెనోపాజ్ దశలో గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయని మీరు నమ్మగలరా? కానీ, ఇది నిజం. అది ఎలా జరుగుతుందో ఎప్పుడు మనం తెలుసుకోబోతుకున్నాం.

Can you get pregnant while you are going through menopause?

ఇందులో మొత్తం మూడు దశలు ఉన్నాయి

మూడు దశలు :

మెనోపాజ్ లో మొత్తం మూడు దశలు ఉన్నాయి. పెఱిమెనోపాజ్, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ అనే దశలు ఉన్నాయి. ఈ ప్రక్రియ లో పెఱిమెనోపాజ్ అనేది మొదటి దశ. ఈ దశ లో స్త్రీల యొక్క ఋతుక్రమము చివరి దశకు చేరుకుంటుంది. ఒకవేళ ఆమెకు గనుక రుతుక్రమం వస్తున్నా కూడా అవి చాలా అసందర్భంగా వస్తుంటాయి. రెండవ దశ, మెనోపాజ్. ఈ దశ లో రుతుక్రమం పూర్తిగా ఆగిపోతుంది. ఎప్పుడైతే ఒక స్త్రీకి వరుసగా పన్నెండు నెలలపాటు రుతుక్రమం రాదో, అప్పడు ఆమె ఈ దశలో ఉన్నట్లు అర్థం. ఇక చివరి దశను పోస్ట్ మెనోపాజ్ గా పిలుస్తారు. మెనోపాజ్ దశ పూర్తిగా అయిపోయిన తరువాత ఈ దశ వస్తుంది. అంటే వేడి సెగలు రావటం కూడా ఆగిపోయిన తరువాత అన్నమాట. ఈ దశకు చేరుకున్న తరువాత కూడా మీకు గనుక ఇంకా యోని వద్ద రక్తం వస్తుంటే, ఇది ఒక అసాధారణ పరిస్థితి అని, దీని గురించి తక్షణమే వైద్యులకు చెప్పాలి అని, అందుకు తగ్గ చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Can you get pregnant while you are going through menopause?

గర్భం దాల్చే అవకాశం ఉందా?

గర్భం దాల్చే అవకాశం ఉందా? అని ప్రశ్నిస్తే అవుననే చెబుతున్నారు. మీరు ఎప్పుడైతే మొదటి దశలో ఉంటారో, అంటే పెఱిమెనోపాజ్ దశలో ఉన్నప్పుడు గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయట. పెఱిమెనోపాజ్ దశలో రుతుక్రమం సక్రమంగా ఉండదు మరియు అసందర్భంగా రుతుక్రమం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మెనోపాజ్ దశకు చేరుకున్నారా లేదా అనే విషయం మీకు ఈ దశలో స్పష్టంగా తెలియకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఒకవేళ అసురక్షిత శృంగారంలో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పెఱిమెనోపాజ్ దశలో ఇలా జరగడం అసాధ్యమనే చెప్పాలి. కానీ, మీ అండాశయంలో మిగిలి ఉన్న కొన్ని అండాల వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి, ఆ సమయంలో మీకు కొన్ని సార్లే రుతుక్రమం వచ్చినప్పటికీ, మీరు గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయి.

Can you get pregnant while you are going through menopause?

అది ఆరోగ్యవంతమైన గర్భధారణేన ?
ఆలా వచ్చిన గర్భం ఆరోగ్యవంతమైన గర్భధారణేన అంటే కాదని చెబుతున్నారు. మీ వయస్సు పెరుగుతుండటం వల్ల, ఈ దశలో కడుపులో పెరుగుతున్న పిండానికి

సమస్యలు తలెత్తుతాయి, ఆ పిండాన్ని మోస్తున్న మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. మెనోపాజ్ దశలో గర్భం దాల్చడం అసాధ్యం మరియు మీ అండాశయంలో ఉన్న అండాలు కూడా పాతవి అయి ఉంటాయి. ఆరోగ్యవంతమైన గర్భం దాల్చాలి అని అనుకునేవారికి ఇది అంత మంచిది కాదు.

Can you get pregnant while you are going through menopause?

మెనోపాజ్ దశలో స్త్రీ గనుక గర్భం దాల్చాలి అని భావిస్తే ?

ఒక వేళా ఎవరైనా స్త్రీ మెనోపాజ్ దశలో గర్భం దాల్చాలి అని భావిస్తున్నట్లైతే, ఇంతకుమునుపు చెప్పుకున్నట్లుగా ఆ గర్భం ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. కానీ, మీరు గనుక గర్భం దాల్చాలి అని భావించినట్లైతే ఒక సారి మీ వైద్యుడిని కలవండి. ఈ దశలో గర్భం దాల్చడం కష్టం, ఎందుకంటే మీ శరీరం బలహీనంగా ఉంటుంది మరియు మీ సంతానోత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అంతే కాకుండా, మీ శరీరం తో పాటుగా మీ అండాశయంలో ఉన్న అండాలు కూడా బలహీనంగానే ఉంటాయి. దీని వల్ల పుట్టబోయే బిడ్డ రోగాల భారిన పడే అవకాశాలు ఎక్కువ. కాబ్బటి, మీరు దేనైనా ఎంపిక చేసుకొని నిర్ణయం తీసుకునేముందు అన్నింటిని బేరీజు వేసుకొని ఒక నిర్ణయం తీసుకోండి,

English summary

Can you get pregnant while you are going through menopause?

The transition time of menopause may vary for every woman. A few might experience this phase for merely two months and for some, it could last even for years. Apart from bodily changes, women usually experience hot flashes, mood swings and vaginal dryness. Precisely, this is the end of a woman’s reproductive years and getting pregnant may become close to impossible.
Desktop Bottom Promotion