For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి (PID), గర్భధారణపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది?

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి అనేది పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేసే వ్యాధిగా వైద్యశాస్త్ర పరిభాషలో చెప్పవచ్చు. దీనిని సంక్షిప్తంగా, PID అని పిలుస్తారు. ఈ వ్యాధి శరీరానికి నేరుగా లేదా కొన్నిసార్లు క

|

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి అనేది పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేసే వ్యాధిగా వైద్యశాస్త్ర పరిభాషలో చెప్పవచ్చు. దీనిని సంక్షిప్తంగా, PID అని పిలుస్తారు. ఈ వ్యాధి శరీరానికి నేరుగా లేదా కొన్నిసార్లు క్లమీడియా లేదా గోనేరియా వంటి లైంగిక సంక్రమిత రోగ లక్షణాలలో భాగంగా సంభవించవచ్చు.

లైంగిక సంక్రమిత వ్యాధులు PID సంభవించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, వివిధ రకాల బ్యాక్టీరియాల ద్వారా కూడా ఇది సంక్రమించవచ్చు. బాక్టీరియా యోని లేదా గర్భాశయ ముఖద్వారం వద్ద దాడి చేసినప్పుడు, క్రమంగా PID మిగిలిన పునరుత్పత్తి అవయవాలకు కూడా వ్యాప్తి చెందుతుంది.

How Can Pelvic Inflammatory Disease Affect Pregnancy?

ఒకరి కన్నా ఎక్కువ లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నా లేదా అంతర్గత గర్భాశయ పరికరం ఉపయోగించినా లేదా డూష్ ను ఉపయోగించినా PID సోకే ప్రమాదం పెరుగుతుంది. PID ఉదాహరణకు కొన్ని కటి భాగంలో, కొన్ని శస్త్ర చికిత్సలు జరిగిన తరువాత, ఉదాహరణకు, గర్భాన్ని తొలగించడం వంటి ప్రక్రియలు చేపట్టిన తరువాత కూడా సంభవించవచ్చు. ఈ వ్యాధి బిడ్డకు జన్మనిచ్చాక లేదా ప్రేగులలో ఇన్ఫెక్షన్ మూలంగా పెద్ద ప్రేగు చీలినా కూడా సంభవించవచ్చు.

ఈ వ్యాధి సాధారణంగా యవ్వనంతో ఉన్న, లైంగికంగా చురుకైన మహిళలలో కనిపిస్తుంది. చాలా సందర్భాలలో PID లైంగిక సంక్రమణ ఫలితంగా కలుగుతుంది. అసురక్షితమైన లైంగిక చర్యల వలన ఈ వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

PID అసాధారణ వ్యాధేమి కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అనేకమంది మహిళలు ఈ వ్యాధికి గురవుతున్నారు. PID మూలంగా వంధ్యత్వం కూడా కలగవచ్చు. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు PID సంభవించే అవకాశం ఉందని మీకు తెలుసా? గర్భధారణ సమయంలో PID సంక్రమణ గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి ఇక!

గర్భధారణ సమయంలో PID సంభవించవచ్చా?

అసాధారణమైనప్పటికీ, PID గర్భధారణ సమయంలో సంభవిస్తే, చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. గర్భధారణ సమయంలో PID తో బాధపడుతున్నప్పుడు, ముందస్తు ప్రసవం జరిగే అవకాశాలు పెరుగుతాయి. ప్రసూతి అనారోగ్యం కూడా పెరుగుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వారి సలహా ప్రకారం, ఒక గర్భవతికి PID ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి. అప్పుడు వైద్యులు పేరెంటరల్ యాంటీబయాటిక్స్ ను ఉపయోగించి చికిత్సను అందిస్తారు.

పొత్తి కడుపులో నొప్పి, జ్వరం, అసాధారణంగా యోని నుండి ద్రవాలు ఊరడం, యోనిలో దుర్వాసన, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట మరియు సంభోగ సమయంలో బాధ , సంభోగానంతర రక్తస్రావం PID యొక్క సాధారణ లక్షణాలు. కనుక, గర్భిణీ స్త్రీలలో, ఇటువంటి లక్షణాలను కనిపిస్తే, వెంటనే PID ఉనికిని గుర్తించడానికి వైద్యుని తప్పక సంప్రదించాలి.

PID యొక్క ఉనికిని గుర్తించడానికి, మహిళలు కొన్ని పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. బాక్టీరియా యొక్క ఉనికిని పరీక్షించడానికి గర్భాశయము మరియు యోని నుండి ఒక కాటన్ స్వాబ్ ను ఉపయోగించి నమూనా ద్రవాన్ని పరీక్షించడానికి తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో, మూత్రం మరియు రక్త పరీక్ష కూడా నిర్వహించవచ్చు. గనేరియా మరియు క్లామిడియా వంటి లైంగిక సంక్రమిత వ్యాధులను కలిగించే బాక్టీరియా యొక్క ఉనికిని తనిఖీ చేయడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో, పెల్విక్ ఆల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా ఫెలోపియన్ నాళాలలో వాపును తెలుసుకుంటారు.

PID మరియు గర్భధారణ సమస్యలు:

PID చరిత్ర కలిగిన మహిళలు గర్భం ధరించిన సమయంలో అధిక ప్రమాదాలను ఎదుర్కుంటారు. గర్భస్రావం, ముందస్తు జననాలు మరియు నిర్జీవమైన బిడ్డ జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భవతులకు PID కలిగినప్పుడు, ఆరంభ దశలోనే చికిత్స అందించాలి.

వ్యాధి లక్షణాలు అంత తీవ్రంగా లేనప్పటికీ, వీలైనంత త్వరగా, ప్రారంభ దశలో ఉన్న వ్యాధికి చికిత్సను అందించడం ఉత్తమం. ఇలా చేయడం వలన తరువాత దశలలో ఎదురయ్యే అనేక గర్భధారణ సమస్యల నుండి రక్షణ పొందవచ్చు. వ్యాధి లక్షణాల నుండి కొంత ఉపశమనం లభించినప్పటికి, వ్యాధిని సంపూర్ణంగా నివారించడానికి, సూచింపబడిన ఔషధాలను, పూర్తి కోర్సు ముగిసే వరకు వాడాలి.
గర్భిణి స్త్రీలకు పీల్చుకోవడం ది కనుక గర్భధారణ సమయంలో PIDకి సంబంధించిన, ఏ చిన్న సంకేతం కనిపించినా, గర్భిణీ స్త్రీలు వెంటనే ఆస్పత్రిని సందర్శించాలి. వెంటనే వారికి సిరల ద్వారా సురక్షితమైన యాంటీబయాటిక్స్ ను అందించి ప్రభావవంతమైన చికిత్సను అందజేస్తారు. అయితే యాంటీబయాటిక్స్ ను ఉపయోగించినప్పటికిని, పునరుత్పత్తి అవయవాలకు అప్పటికే సంభవించిన నష్టాన్ని పూడ్చలేము.

PID కలిగి ప్రమాదాలను తగ్గించడం ఎలా?

మహిళలు PID సంక్రమణకు కారణమయ్యే బాక్టీరియా, తనకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లైంగికం సంక్రమిత వ్యాధుల నుండి సంరక్షించుకోవడం చాలా అవసరం. సంభోగంలో ఉన్నప్పుడు, భాగస్వాముల మధ్య వీర్యం మరియు యోని ద్రవం వంటి శరీర ద్రవాలను తాకకుండా కండోమ్ లను వాడటం తప్పనిసరి. సరిగ్గా ఉపయోగించినప్పుడు, కండోమ్ లు వివిధ లైంగిక సంక్రమిత వ్యాధులను నివారించడానికి సమర్ధవంతంగా పని చేస్తాయి. అసురక్షిత లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్న మహిళలు PID వంటి సమస్యల నివారణకు పరీక్షలు చేయించుకోవాలి.

English summary

How Can Pelvic Inflammatory Disease Affect Pregnancy?

Although unusual, PID during pregnancy can be quite risky. When diagnosed with PID during pregnancy, the risks of preterm delivery increase drastically. Maternal morbidity also increases. If a pregnant woman is diagnosed with PID, she will need to be hospitalized immediately. The doctors would impart treatment with parenteral antibiotics. This is going by what is mentioned by the Centers for Disease Control and Prevention (CDC).
Desktop Bottom Promotion