గర్భం దాల్చినవారు మొదటి త్రైమాసికంలో నిద్ర పోవడానికి సూచించిన రెండు ముఖ్యమైన పద్దతులు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మహిళలు గర్భధారణ సమయంలో ఎంతో అలసటగా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి మొదటి త్రై మాసికం (trimester) లో ఇలా జరుగుతూ ఉంటుంది. తద్వారా ఎక్కువ నిద్రని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గుండెల్లో మంట, వికారం, రాత్రి వేళల యందు అతి మూత్ర విసర్జన , అజీర్ణం, అలసట , కాళ్ళ నొప్పులు వంటి సమస్యల కారణంగా నిద్ర లేమి సమస్యలకు గురవుతూ ఉంటారు. కానీ కొన్ని పద్దతులను అనుసరించడం ద్వారా ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టి, చిన్ని పాపాయిలా నిద్రపోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.

మామ్ జంక్షన్ అనే కమ్యూనిటీ ఫోరం, ఇలాంటి సమస్యలకు సూచనలను అందిస్తుంది. ముఖ్యంగా మీరు నిద్రకు ఉపక్రమించే సమయాన పడుకునే తీరు కూడా నిద్రలేమికి కారణం అవుతుంది.

How To Sleep During First Trimester: 2 Important Positions

మొదటి త్రై మాసికంలో శరీరంలో అనేకమార్పులు చోటుచేసుకుంటాయి, ఈ మార్పులు మీ నిద్రలేమికి కారణం అవుతాయి . 1998 నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చేసిన సర్వే లో 78 శాతం మంది మహిళలు మిగిలిన సమయాల కన్నా గర్భధారణ సమయంలోనే నిద్ర లేమి సమస్యలను అధికంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు.

క్రింద నిద్రలేమికి గల కారణాల గురించిన వివరణ ఇవ్వడం జరిగినది.

 1.ఎల్లప్పుడూ మగత ఆవరించడం:

1.ఎల్లప్పుడూ మగత ఆవరించడం:

గర్భధారణ సమయంలో ఎల్లప్పుడూ మగతగా ఉంటుంది, అనగా రోజంతా మత్తు ఆవరించుకుని ఉంటుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలోని ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఉత్తేజితమవడం , హార్మోనులో హెచ్చుతగ్గులు సంభవించడం మూలంగానే. నిజానికి ఈ హార్మోన్ మహిళలలో పునరుత్పత్తి వ్యవస్థను పెంచేందుకు దోహదం చేస్తుంది, కానీ మగతకు కూడా కారణం అవుతుంది.

శరీరంలో వేడి పెరగడం, నిద్రను ప్రేరేపించడం వంటి లక్షణాలను కలిగి ఉన్న ఈ ప్రొజెస్టిరాన్, శరీరం అలసటకు గురవడం మరియు త్వరగా నిద్ర పోయేలా శరీరాన్ని సిద్దం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఒక్కోసారి శరీరం క్షీణించినట్లు , జ్వరానికి గురైన అనుభూతికి కూడా లోనూ చేస్తుంది. తద్వారా నిద్రలేమి సమస్య ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

2. శరీరంలోని మార్పుల కారణంగా అసౌకర్యం :

2. శరీరంలోని మార్పుల కారణంగా అసౌకర్యం :

ముఖ్యంగా రొమ్ముల పరిమాణంలో అసాధారణ మార్పులు, నొప్పి వంటివి నిద్రలేమికి కారణం అవుతుంటాయి. వెల్లకిలా పడుకోవడం కూడా కొంచం అసౌకర్యంగా అనిపిస్తుంది, దీనికి కారణం పొట్ట పైకి కనిపిస్తూ ఉండడమే. కావున ప్రత్యేకమైన గదిని ఎంచుకోవడం ముఖ్యం. దీనికి కుటుంబసభ్యులు కూడా సహాయ పడేలా ఉండాలి. పసిబిడ్డను చూసుకున్నట్లే పసిబిడ్డను మోసే తల్లి ని కూడా చూసుకోవాలి.

3. రాత్రివేళల యందు అతి మూత్ర సమస్య:

3. రాత్రివేళల యందు అతి మూత్ర సమస్య:

ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఇలాంటి సమస్యలకు ఒకరకంగా కారణం అవుతుంటుంది. హార్మోనుల హెచ్చుతగ్గుల వలన సున్నితమైన కండరాలు ఉద్దీపనకు గురవడం మూలంగా, మరియు పెరుగుతున్న పొట్ట భాగం, మూత్రాశయం మీద ఒత్తిడిని తీసుకుని రావడం వలన తరచుగా మూత్రం వస్తున్న అనుభూతికి లోనవుతూ ఉంటారు. ఒక్కోసారి అది కేవలం అనుభూతి వరకే ఉంటుంది. క్రమంగా మూత్రాశయం మీద ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా తరచుగా నిద్రలేవడం వలన, నిద్ర లేమి సమస్య వెంటాడుతుంది. కావున ఇలాంటి సమస్యలు ఉన్నవారు, పగలు సమయం కూడా కొంత నిద్రకు కేటాయించేలా చూసుకోవడం ఉత్తమం.

4. వికారం:

4. వికారం:

మొదటి 12వారాల సమయంలో ఉదయం వికారంగా ఉండడం సహజ లక్షణంగా ఉంటుంది. కానీ చాలామందికి రోజంతా కూడా ఉండడం పరిపాటి, అది వారి వారి శరీర తత్వాలపై ఆధారపడి ఉంటుంది. ఇది రాత్రివేళల యందు నిద్రకు ఆటంకంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర నిల్వలు అసాధారణంగా తగ్గడం వలన ఈ వికార సమస్యలు వస్తుంటాయి .

5. గుండెల్లో మంట :

5. గుండెల్లో మంట :

ప్రొజెస్టిరాన్ హార్మోన్ మీ శరీరంలోని ప్రతిభాగానికి విశ్రాంతినిచ్చి స్వాంతన చేకూరేలా చేస్తుంటుంది. కడుపులో అన్నవాహిక కండరాల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. దీనివలన కడుపులోని పదార్ధాలు, ఆమ్లాలు అన్నవాహికకు తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. ముఖ్యంగా అజీర్తి సమస్యలవలన ఈ సమస్య వస్తుంది. ఇది నెమ్మదిగా గుండెల్లో మంటగా అనిపించేలా చేస్తుంటుంది. క్రమంగా నిద్రలేమికి కూడా కారణం అవుతుంది.

6. ఒత్తిడి మరియు ఆందోళన

6. ఒత్తిడి మరియు ఆందోళన

నిజం, ఎక్కువగా మొదటి త్రై మాసికంలో ఆతృత, ఆశ్చర్యకర అనుభూతులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మొదటిసారి గర్భధారణ జరిగిన మహిళలలో ఇది సర్వసాధారణం. తద్వారా తమను తాము శారీరికంగా, మానసికంగా సంసిద్ద పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. తద్వారా ఒత్తిడి ఆందోళనా స్థాయిలు పెరగడం జరుగుతూ ఉంటుంది. వీరికి ప్రియమైనవారు తగిన సహాయం చేస్తుండాలి. గర్భధారణ అనుభవం ఇదివరకే ఉన్న మహిళలకు మరియు కొత్తగా గర్భధారణ జరిగిన మహిళలకు మద్య చేసిన సర్వేలో, ఇదివరకు అనుభవం ఉన్నవారు 45 నిమిషాలు ఎక్కువ నిద్రపోవడం జరిగినట్లు నివేదికలు అందాయి.

నిద్ర కు ఉపక్రమించే విధానాలు :

నిద్ర కు ఉపక్రమించే విధానాలు :

మొదటి త్రైమాసికంలో పడుకునే సమయంలో పాటించవలసిన పద్దతులు:

ఇన్ని సమస్యల మద్య నిద్ర కూడానా అనుకోకండి, మీరు ఎంత మంచి నిద్రను ఆస్వాదించగలరో మీ బిడ్డకు కూడా అంత ఆరోగ్యాన్ని ఇవ్వగలరు.

 పక్కకు తిరిగి పడుకోవడం:

పక్కకు తిరిగి పడుకోవడం:

బోర్లా లేదా వెల్లకిలా పడుకునే కన్నా , పక్కకు తిరిగి పడుకోవడం అన్నివిధాలా మేలు. అందులోనూ ఎడమపక్కకు తిరిగి పడుకోవడం అన్నిటికన్నా ఉత్తమం అని చెప్పబడింది.

దీనికి కారణం కుడివైపున తిరిగి పడుకోవడం వలన కాలేయం(liver) పై ఒత్తిడి పెరుగుతుంది. మీ డాక్టర్ కూడా మీకు ఎడమ ప్రక్కకే తిరిగి పడుకోమని సూచిస్తుంటారు.

ఇలా ఎడమ పక్కకి తిరిగి పడుకోవడం మూలంగా గర్భాశయం పెరుగుదల కాలేయం మీద పడకుండా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. మరియు గర్భస్థ పిండానికి కావలసిన ప్రాణవాయువు, విటమిన్లు , పోషకాలు ప్లెసెంటా ద్వారా అందుటకు అనువుగా ఉంటుంది.

మరియు రక్త ప్రసరణ పెరగడం ద్వారా కొన్ని సమస్యలను తల్లికి మరియు గర్భస్థ పిండానికి కూడా కలగకుండా చూస్తుంది. ఎడమ వైపు ఎక్కువసేపు పడుకోవడానికి అసౌకర్యంగా అనిపిస్తే, కుడివైపుకి కూడా పడుకోవచ్చు. కానీ ఎక్కువ సేపు కుడివైపునే ఉండేలా మాత్రం చేయకూడదు. మోకాళ్ళు వంచి పక్కకి తిరిగి పడుకోవడం ఉత్తమమైన పద్దతిగా సూచించబడింది.

వెల్లకిలా పడుకోవడం :

వెల్లకిలా పడుకోవడం :

గర్భం దాల్చిన మొదట్లో మీరు ఈ పద్దతిని ఎన్నుకోవచ్చు. కానీ ఇదే పద్దతి కొనసాగిస్తే మాత్రం అసౌకర్యానికి గురికాక తప్పదు. కానీ కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ, వెన్ను కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. కావున నెమ్మదిగా అలా పడుకోవడం తగ్గించాలి. కొనసాగిస్తే, వెన్నుపై ప్రభావమే కాకుండా, కొన్ని ముఖ్యమైన రక్త నాళాలు కూడా ప్రభావానికి గురై రక్త ధారణ జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇది తల్లికి బిడ్డకు ఇద్దరికీ మంచిది కాదు.

వెల్లకిలా పడుకోవడం వలన కండరాల నొప్పులు కూడా వస్తాయి, మరియు రక్తం గడ్డకట్టే అవకాశాలు పెరుగుతాయి. BP స్థాయిలు అసాధారణ మార్పులకు కూడా గురవుతూ ఉంటాయి. తద్వారా, వికారం మైకం ఆవరించుకుంటూ ఉంటుంది. ఇది మంచిది కాదు. కొంతమంది మహిళలలో, గురకకు కూడా కారణం అవుతూ ఉంటుంది. ఒక్కోసారి గుండెల్లో మంటగా అనిపించినప్పుడు , వీపు కింద దిండ్లను ఉంచుకుని సగం కూర్చున్నట్లు పడుకోవడం ద్వారా కాస్త ఉపశమనం లభిస్తుంది.

కానీ మొదటి త్రై మాసికంలో ఎడమ వైపు తిరిగి పడుకోవడం అన్నీ విధాలా శ్రేయస్కరం.

English summary

How To Sleep During First Trimester: 2 Important Positions

Most women are confused about the right sleep position during pregnancy. We all have our preferred sleeping positions. Some of us are comfortable sleeping on our back. Other prefer to sleep on their side. There are also some people whop sleep on their stomach.