పురిటి నొప్పులను ముందుగా గుర్తించడం ఎలా ?

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

పురిటినొప్పులు అనేవి, ముందస్తుగా పుట్టే శిశువుల జనన, మరణాలతో కూడిన మాతృత్వపు సమస్య. శిశువు చుట్టూవున్న కమ్ముకొని ఉన్న అనారోగ్యమే, శిశు మరణాలకు దారితీసేదిగా ఉంటుందని ప్రపంచమంతా విశ్వసిస్తుంది. ఈ రకమైన పరిస్థితి నుండి కాపాడలేకపోయిన, ప్రారంభంలోనే గుర్తించబడిన కొన్ని సంకేతాల ఆధారంగా ప్రస్తుతి యొక్క స్థాయిని పొడిగించడానికి మరియు మెరుగైన నిర్వహణకు సహాయపడవచ్చు.

పురిటినొప్పులను ఈ విధంగా నిర్వచించవచ్చు, ఒక మహిళ గర్భం దాల్చినా 20 నుండి 37 వారాల మధ్యలో, గర్భాశయము సంకోచమును కలిగి, సాగే గుణంతో దృఢంగా ఉండటమే కాకుండా దానికి అనుగుణంగా, గర్భాశయ ద్వారాన్ని పెద్దగా వ్యాకోచించేటట్లుగా చేస్తుంది. అయితే, మీరు ముందస్తుగా వచ్చే పురిటినొప్పుల సూచనలను ముందుగా కనుగొనాలి.

పురిటినొప్పులను సూచించే కొన్ని లక్షణాలు :-

సంకోచాలను కలిగి ఉండటం :

సంకోచాలను కలిగి ఉండటం :

సమతుల్యంగా ఉన్న గర్భాశయము, సంకోచాలకు ప్రభావితం అవ్వడమే పురిటి నొప్పులను సూచించే మొదటి సూచిక. చాలా సమయాల్లో కడుపులో పిండం అభివృద్ధి చెందినప్పుడు, ఈ గర్భాశయ ద్వారం అనేది సాధారణమైన సంకోచాలను కలిగి చాలా బిగుతుగా ఉంటుంది, కానీ కొన్ని అనివార్య కారణాలవలన ఈ సంకోచం అనేది తట్టు పోయినట్లుగా కనిపిస్తుంది.

ఇలా బిగుతుగా అవడం వల్ల, జఘన ఎముకలలోకి చొచ్చుకువచ్చే ఋతుస్రావ నొప్పుల వలె భావించబడుతున్నాయి. ఒకవేళ మీకు మాతృత్వము కలగకముందే (అనగా 37 వారాల కన్నా ముందే) ఈ రకమైన నొప్పులను అనుభూతిని చెందినట్లయితే, ఆ నొప్పులనేవి క్రమబద్ధంగా ఉన్న (లేదా) లేకపోయినా సరే వెంటనే మీరు డాక్టర్ను సంప్రదించడం మంచిది.

ఒత్తిడి మూలంగా వచ్చే సంకోచాలు :

ఒత్తిడి మూలంగా వచ్చే సంకోచాలు :

మీరు పొత్తికడుపు ప్రాంతంలో ఒత్తిడిని (లేదా) సంపూర్ణమైన సంకోచాలను అనుభూతిని పొందినట్లయితే, అది ప్రారంభమైన పురిటినొప్పులుగా సూచించవచ్చు మరియు వాటిని విస్మరించకూడదు. ఒత్తిడి వల్ల కలిగే భావన, మీ వీపు వెనుక భాగానికి మరియు తొడలకు కూడా వ్యాప్తి చెందుతాయి.

వీపు భాగంలో నెమ్మదిగా ఎదురయ్యే నొప్పులు :

వీపు భాగంలో నెమ్మదిగా ఎదురయ్యే నొప్పులు :

మీ వీపు భాగంలో నెమ్మదిగా ఎదురయ్యే నొప్పులు అసాధారణమైనవిగానూ (లేదా) నిరంతరముగా లేకపోయినట్లయితే అది ప్రసవ నొప్పులను సూచిస్తుంది. అయితే, గర్భధారణ జరిగిన తరువాత వచ్చే నొప్పులను మీరు ఎక్కువగా పట్టించుకోనవసరం లేదు, ఎందుకంటే అది పిండం ఎదుగుదల వల్ల కలిగే నొప్పులు కావచ్చు.

యోని నుండి రక్తము కారితే :

యోని నుండి రక్తము కారితే :

పురిటినొప్పులు కలిగిన సందర్భంలో, యోని నుండి రక్తస్రావం గాని జరిగితే వెంటనే డాక్టర్కు ఈ పరిస్థితి గూర్చి తెలియజేయండి. ఈ విధంగా రక్తం గానీ కారితే, అది పురిటినొప్పులను సూచించేదిగా చెప్పవచ్చు. యోని నుండి లేత ఎరుపు (లేదా) గోధుమ రంగులో రక్తం గానీ కారినట్లయితే, అది కూడా పురిటినొప్పుల సంకేతంగా భావించవచ్చు.

యోనిలో తీవ్రమైన నొప్పి :

యోనిలో తీవ్రమైన నొప్పి :

యోని (లేదా) గర్భాశయ ద్వారం వద్ద తీవ్రమైన నొప్పి గాని ఎదురైతే అది పురిటి నొప్పుల సంకేతంగా చెప్పవచ్చు. గర్భాశయం యొక్క పరిమాణంలో వచ్చే మార్పు, ఈ ప్రభావాన్ని కలుగజేస్తుంది.

ప్రేగులలో వచ్చే తిమ్మిర్లు :

ప్రేగులలో వచ్చే తిమ్మిర్లు :

ప్రేగులలో నిరంతరంగా వచ్చే తిమ్మిర్లు అతిసారం వల్లగాని (లేదా) అలా కాకుండా గానీ ఎదురైనప్పుడు, వాటిని కూడా పురిటి నొప్పులుగా భావించవచ్చు. ఈ తిమ్మిర్లు నిరంతరంగా గ్యాస్ వల్ల వచ్చేవిగా ఉండటంవల్ల, వీటిని త్వరగా గుర్తించలేము.

పైన పేర్కొన్న లక్షణాలు మాత్రమే కాకుండా, ఎలాంటి కారణం లేకుండా మీకు అనారోగ్యం వచ్చినట్లుగా గానీ మీకు బాగా తెలిసినట్లయితే, అవి పురిటినొప్పులకు సంబంధించినవిగా భావించవచ్చు కానీ, నిర్లక్ష్యం మాత్రం చెయ్యకూడదు. మీరు అనుభూతి చెందుతున్న లక్షణాలలో ఏదైనా మార్పు గానీ ఉంటే వెంటనే ఆ విషయాల గూర్చి డాక్టర్కు తెలియజేయండి.

మీరున్న పరిస్థితులను గూర్చి పూర్తి అవగాహనను కలిగి ఉండటం చాలా మంచిది. అలా మీ ప్రసూతిని నిరంతరం పర్యవేక్షించడం వల్ల, పురిటి నొప్పులను గుర్తించే అవకాశాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. నిర్దిష్టమైన ఆరోగ్య సమస్యలు, గతంలో జరిగిన ముందస్తు జననాలు, ఔషధాల ప్రభావం (లేదా) మద్యం వ్యసనం మరియు పర్యావరణ అంశాల వంటివి మహిళ యొక్క పురిటినొప్పులలో ముప్పును పెంచుతాయి.

పైన చెప్పిన అంశాలన్నింటినీ మీరు సరిగ్గా నిర్వహించలేకపోయినప్పటికీ, మీ సమస్యను అర్థం చేసుకోవడం వల్ల, ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు.

English summary

How To Identify Preterm Labor Symptoms

Preterm labor is generally defined by the presence of uterine contractions which are regular and also strong sufficient to cause extension of the cervix prior to conclusion of the term, more particularly in between the 20th as well as 37th week of pregnancy. However, the tightenings are not always unpleasant and you have to look for other subtle indications of preterm labor.
Story first published: Wednesday, February 14, 2018, 18:30 [IST]
Subscribe Newsletter