For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ప్రెగ్నెన్సీ సమయంలో హెచ్ పివి

  |

  హ్యూమన్ పాపిలోమా వైరస్ ను చిన్నగా హెచ్ పివి అంటారు. ఇది మనుషులకి సోకే వైరస్ ఇన్ఫెక్షన్. పాపిలోమా అంటే పులిపిర్లు అని అర్థం, ఇవి శరీరం పైభాగంలో ముఖ్యంగా జననేంద్రియాల దగ్గర మ్యూకస్ పొర లేదా చర్మం పెరగటం వలన వస్తాయి.

  స్త్రీలలో హెచ్ పివి కారణాలు, లక్షణాలు

  కడుపుతో ఉన్నప్పుడు హెచ్ పివి

  హెచ్ పివికి పెద్ద లక్షణాలంటూ ఏం ఉండవు, ఇది సోకినప్పుడు ఒంట్లో బాగోకపోవటం కూడా జరగదు. మొత్తంమీద బానే ఉంటారు కానీ వారిని ముట్టుకున్న వారికి మాత్రం ఈ వ్యాధి అంటుకుంటూ వ్యాపిస్తుంది. ఇది సులభంగా అంటుకునే రోగం, ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి చర్మాన్ని తాకితే చాలు మరొకరికి పాకేస్తుంది.

  హెచ్ పివి సరిగ్గా ఎలా అంటుకుంటుందో కూడా ఎవరికీ తెలీదు. ఆడవారిలో వచ్చే సాధారణ హెచ్ పివి రకాల్లో 'జననేంద్రియాలపై వచ్చే పులిపిర్లు’, ఇవి యోని,మలద్వారం,రెక్టం చుట్టూ చర్మం కన్పడేట్లుగా పొక్కులుగా పెరుగుతుంది.

  HPV during pregnancy

  ఈ పులిపిర్లు అంటుకుంటాయి, సెక్స్ తో సులభంగా వ్యాపిస్తాయి. వీటికి ప్రత్యేక లక్షణాలంటూ ఏం ఉండవు, అప్పుడప్పుడు దురద,మంట,రసి కారడం వంటివి ఉంటాయి కానీ చాలామటుకు నెప్పి లేకుండానే ఉంటాయి.

  పెల్విక్ పరీక్షలో చర్మం పెరగటం కన్పిస్తే సాధారణంగా హెచ్ పివి పరీక్షల అవసరం ఉంటుంది. జననేంద్రియాల దగ్గర వచ్చే పులిపిర్లు చాలామంది ఆడవాళ్ళలో అవంతట అవే సమయంతోపాటు కరిగిపోతాయి. కానీ కొన్ని హెచ్ పివి రకాలు కణాలను మార్చి క్యాన్సర్ కు దారితీస్తుంది,కానీ అది అరుదుగానే జరుగుతుంది.

  హెచ్ పివి పాఇటివ్ ఉన్న తల్లికి పుట్టే బిడ్డ

  తల్లవటం ఎంత అందమైన అనుభవమో, అదృష్టవశాత్తూ హెచ్ పివి పాజిటివ్ ఉన్న తల్లులకి అరుదుగానే గర్భస్రావం, సమయానికి ముందే పుట్టడం లేదా బేబీకి ఇతర సమస్యలు వస్తాయి. జననేంద్రియాల పులిపిర్లు కడుపుతో ఉన్నప్పుడు డిశ్చారి వలన వేగంగా పెరిగినా, బేబీ పెరగటంలో ఏ రకమైన సమస్య,రిస్కును కలిగించదు.

  ఇంకా, బేబీకి హెచ్ పివి సంక్రమించే అవకాశాలు కూడా అరుదు. ఒకవేళ బేబీకి సంక్రమించినా, సహజంగా ఎదిగేటప్పుడు లేదా చికిత్స ద్వారా బేబీకి నయమైపోతుంది. అరుదు కానీ సీరియస్ స్థితి అయిన శ్వాసకోస పాపిలోమాటోసిస్ కొన్నిసార్లు వస్తుంది, అలాంటప్పుడు బేబీ గొంతులో పులిపిర్లు పెరుగుతాయి. అప్పుడు బేబీ పుట్టగానే ఆపరేషన్ వెంటనే చేస్తారు.

  HPV during pregnancy

  కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  కడుపుతో ఉన్న ప్రతి స్త్రీ తన బేబీకి మంచికి చేయాల్సినవన్నీ చేయాలనే కోరుకుంటారు, కానీ ఈ కేసులో తల్లికి ఇప్పటికే జననాంగాల వద్ద పులిపిర్లు ఉన్నాయని తేలుతుంది,అలాగే మందులు కూడా వాడుతుంటారు, కానీ ఈ చికిత్సను ప్రెగ్నెన్సీ సమయంలో ఆపేస్తారు.

  గర్డసిల్ అనే వ్యాక్సిన్ కూడా హెచ్ పివి 6,11,16 మరియు 18 ను నివారిస్తుంది, కానీ అది 30 లైంగికంగా సంక్రమించే హెచ్ పివి రకాలను నివారించలేదు, అలాగే శరీరంలో ఉన్న హెచ్ పివిని నయం చేయలేదు.

  గర్డసిల్ లో అల్యూమినియం హైడ్రోక్జైఫోస్ఫేట్ సల్ఫేట్ ఉండటం వలన, ఇది కడుపుతో ఉన్నవారికి లేదా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇవ్వరు.

  కడుపుతో ఉన్న సమయంలో హెచ్ పివి చికిత్స

  జననాంగాల వద్ద వచ్చే పులిపిర్లు ప్రెగ్నెన్సీలో ఏ సమస్య తీసుకురావు, అందుకని డాక్టర్లు వాటికి చికిత్స సాధారణంగా చేయరు, లేకపోతే ఆ మందుల వలన ఏదైనా కాంప్లికేషన్ లేదా డెలివరీ ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది. అదేకాక శరీర రోగనిరోధక వ్యవస్థకి హెచ్ పివిని సహజంగా ఎలా నయం చేయాలో తెలుసు.

  కొన్నికేసులలో, పెద్ద సైజు పులిపిర్లు ఉంటే, డెలివరీకి సమస్య అవుతుంది కాబట్టి చికిత్స అవసరమవ్వచ్చు. ఈ కేసులో, సురక్షిత పద్ధతులైన పులిపిర్లను లిక్విడ్ నైట్రోజన్ తో గడ్డకట్టించటం, ఎలక్ట్రికల్ కరెంట్, లేసర్ తో కాల్చటం లేదా ఆపరేషన్ తో తీసేయటం వంటివి చేస్తారు.

  ఈ కింది కొన్ని మందులు ఇవ్వబడ్డాయి, ఇవి పులిపిర్లను నయం చేయటానికి వాడతారు కానీ కడుపుతో ఉన్నవారు వీటి సైడ్ ఎఫెక్ట్ల కారణంగా వాడరు ;

  HPV during pregnancy

  -సాలిసిలిక్ యాసిడ్ పులిపిరుల్లో ఒక్కో పొర చొప్పున తొలగిస్తుంది. ఇది కొంతమంది పేషెంట్లలో చర్మానికి మంట కలిగిస్తుంది అందుకే కడుపుతో ఉన్నవారు వాడరు.

  -ఇమిక్విమోడ్ హెచ్ పివితో పోరాడగలిగే విధంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ శక్తిని పెంచుతుంది.

  -పోడోఫిలోక్స్ నేరుగా పులిపిరిపైనే రాస్తారు, ఇది అక్కడి పొరలను నాశనం చేస్తుంది కానీ నొప్పి, దురదను కూడా కలిగిస్తుంది.

  -ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్ పులిపిర్లను తన రసాయన పదార్థాలతో కాల్చేస్తుంది. ఇది కూడా అవి ఉన్న ప్రాంతంలో మంటను కలిగిస్తుంది.

  Read more about: pregnancy
  English summary

  HPV | HPV during pregnancy | causes of HPV | Symptoms of HPV

  HPV is a short form for Human papillomavirus which is a virus infection in humans. 'Papilloma' means 'warts' which is the growth of mucous membrane.There are no major symptoms of HPV, as people don't even feel unwell while they are infected with it.It is easily contagious that skin-to-skin contact is all it needs to be spread from the infected person to another.
  Story first published: Tuesday, May 29, 2018, 15:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more