ప్రెగ్నన్సీ సమయంలో బెడ్ రెస్ట్ ప్రాముఖ్యతేంటి?

Subscribe to Boldsky

ప్రెగ్నన్సీ అనేది ఒక అత్యద్భుతమైన దశ. ఈ దశలో మహిళలు ఇటు శారీరకంగా అటు మానసికంగానూ అనేక మార్పులకు గురవుతారు. ఈ మహాద్భుతమైన దశలో మహిళలకు అనేక సలహాలు లభిస్తాయి. వాటిలో బెడ్ రెస్ట్ గురించి ముఖ్యమైన సలహా అందుతుంది. బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు కూడా మీకు సూచించి ఉండవచ్చు. కుటుంబసభ్యుల దగ్గరనుంచి బంధువుల వరకూ వరకూ ఈ బెడ్ రెస్ట్ విషయమై అనేకసలహాలు అందుతూ ఉంటాయి. కాబట్టి, మీకు కంగారు కలగడం సహజమే. అయితే, ఈ విషయమై మీ సందేహాలను నివృత్తి చేసి సంపూర్ణ వివరాలను మీకు అందించడానికి ఈ రోజు మీ ముందుకొచ్చాము.

సాధారణంగా 70 శాతం గర్భిణీలకు బెడ్ రెస్ట్ ని అడ్వైజ్ చేస్తారు. కాబట్టి, మీకిటువంటి సలహా వైద్యుల నుంచీ అందితే ఆందోళన చెందకండి. ఎంత కాలం బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నది వ్యక్తులను బట్టీ మారుతుంది. ఆరోగ్యకరమైన విధంగా ప్రెగ్నన్సీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే ఎక్కువ బెడ్ రెస్ట్ ను సాధారణంగా సూచించరు. అయితే, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కారణాల రీత్యా వైద్యులు ఒక్కోసారి పాక్షికంగా బెడ్ రెస్ట్ ను సూచించవచ్చు లేదా పూర్తి బెడ్ రెస్ట్ ను కూడా సూచించవచ్చు.

1. అసలు ఈ బెడ్ రెస్ట్ అంటే ఏంటి?

1. అసలు ఈ బెడ్ రెస్ట్ అంటే ఏంటి?

బెడ్ రెస్ట్ అంటే పనులను తగ్గించుకుని కేవలం మీ పనులను మాత్రమే పరిమితమవడం. స్నానం చేసుకోవడం వంటి కొన్ని బేసిక్ యాక్టివిటీస్ ని మాత్రమే పరిమితమవమని చెప్తూ కొన్ని అదనపు పనులను తగ్గించుకోమని సూచిస్తారు. కొన్ని సందర్భాలలో, హాస్పటలైజేషన్ కూడా అవసరపడవచ్చు. బేసిక్ హైజీన్ యాక్టివిటీస్ ను చేసుకోవడానికి కూడా కదలకూడని స్థితిలో ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది.

పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవడం వలన ఎంతో శక్తి ఆదా అవుతుంది. తద్వారా, ప్రెగ్నన్సీలో సాధారణంగా ఎదురయ్యే కాంప్లికేషన్స్ అనేవి నివారింపబడతాయి.

2. ప్రెగ్నన్సీ సమయంలో బెడ్ రెస్ట్ ను వైద్యులు ఎందుకు సూచిస్తారు

2. ప్రెగ్నన్సీ సమయంలో బెడ్ రెస్ట్ ను వైద్యులు ఎందుకు సూచిస్తారు

ప్రెగ్నన్సీ సమయంలో మీకు ఎదురయ్యే వివిధ రకాల ఆరోగ్యసమస్యల రీత్యా మీ డాక్టర్ మిమ్మల్ని బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించవచ్చు.

ఆరోగ్యంగా గర్భం పొందడానికి ఆయుర్వేదం చెప్పే రహస్యాలు!

3. బ్లీడింగ్:

3. బ్లీడింగ్:

ప్రెగ్నన్సీ సమయంలో కొన్ని సార్లు స్వల్ప రక్తస్రావం లేదా స్పాటింగ్ అనేది కనిపించవచ్చు. ఇటువంటి స్పాటింగ్ అనేది తగ్గే వరకు బెడ్ రెస్ట్ తీసుకోవడం తప్పనిసరని డాక్టర్లు మీకు సూచించవచ్చు. కొన్నిసార్లు, డెలివరీ అయ్యే వరకూ ఈ బెడ్ రెస్ట్ అవసరమని సూచిస్తారు.

4. గర్భాశయ ద్వారం వద్ద సమస్యలు

4. గర్భాశయ ద్వారం వద్ద సమస్యలు

గర్భాశయ ద్వారం అనేది దృఢంగా లేకపోయినా గర్భస్రావం కలిగేందుకు ఆస్కారం కలదు. గర్భాశయంలో బిడ్డ ఎదుగుదల ప్రారంభమయ్యాక గర్భాశయమనేది బిడ్డ బరువును మోయలేకపోవచ్చు. అటువంటప్పుడు, గర్భాశయాన్ని మూసివేసేందుకు వైద్యులు కొన్ని పద్దతులను పాటిస్తారు. కుట్లు వేస్తారు. ఆ తరువాత సంపూర్ణ బెడ్ రెస్ట్ ను తీసుకోమని సూచిస్తారు.

5.. రక్తపోటు అస్థిరతలు

5.. రక్తపోటు అస్థిరతలు

ప్రెగ్నన్సీ సమయంలో రక్తపోటు అనేది అస్థిరంగా ఉంటే పాక్షికంగా బెడ్ రెస్ట్ ను తీసుకోమని లేదా అదనపు పనుల నుంచి కాస్త విరామం పొందమని వైద్యులు మీకు సూచించవచ్చు. అధిక రక్తపోటు సమస్య కలిగిన వారిలో బెడ్ రెస్ట్ అనేది అత్యంత అవసరం. ఎందుకంటే, వీరిలో ఎక్లాంప్సియా లక్షణాలు కనిపించే ఆస్కారం కలదు. ఈ సమస్యను ప్రాణాంతకమైన సమస్యగా భావించవచ్చు.

6. మల్టిపుల్ ప్రెగ్నన్సీ

6. మల్టిపుల్ ప్రెగ్నన్సీ

మల్టీపుల్ ప్రెగ్నన్సీ సందర్భాలలో బెడ్ రెస్ట్ ను సూచించే అవకాశాలు కలవు. ట్విన్స్ విషయంలో సాధారణంగా బెడ్ రెస్ట్ ను అడ్వైజ్ చేయకపోయినా ట్రిప్లెట్స్ లేదా ఆపై ఎక్కువమంది గర్భంలో జీవం పోసుకున్న సమయంలో సంపూర్ణ బెడ్ రెస్ట్ అవసరమవుతుంది.

7. కొన్ని ఇతర కారణాలు

7. కొన్ని ఇతర కారణాలు

ప్లాసెంటా ప్రీవియ, ప్లాసెంటల్ అబ్రప్షన్, ప్లాసెంటాల్ అక్రెట్ వంటి కొన్ని ప్లాసెంటాకి సంబంధించిన కాంప్లికేషన్స్ సమయంలో బెడ్ రెస్ట్ ను సూచించవచ్చు.

ప్రీటెర్మ్ లేబర్

ఇంతకు ముందు ఒకసారి గర్భస్రావం జరిగి ఉండటం.

ప్రీమెచ్యూర్ బర్త్ లేదా స్టిల్ బర్త్

గెస్టేషనల్ డయాబెటిస్

గర్భిణీ నార్మల్ డెలివరీ కోసం కొన్ని ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ టిప్స్

8. ప్రెగ్నన్సీ సమయంలో బెడ్ రెస్ట్ వలన కలిగే ప్రయోజనాలు

8. ప్రెగ్నన్సీ సమయంలో బెడ్ రెస్ట్ వలన కలిగే ప్రయోజనాలు

రోజువారీ పనులను తగ్గించుకుని తగినంత బెడ్ రెస్ట్ ను తీసుకోమని వైద్యులు మీకు సూచించడం వలన మీకు అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. పండంటి బిడ్డకు మీరు జన్మనిచ్చి తల్లీ బిడ్డా క్షేమంగా ఉండాలని ఈ విధంగా మీకు సూచిస్తారు.

ప్రెగ్నన్సీ సమయంలో బెడ్ రెస్ట్ ను తీసుకోవడం వలన కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఈ క్రింద వివరించాము.

9. బెడ్ రెస్ట్ వలన గర్భాశయంపై అదనపు ఒత్తిడి పడదు.

9. బెడ్ రెస్ట్ వలన గర్భాశయంపై అదనపు ఒత్తిడి పడదు.

తగినంత బెడ్ రెస్ట్ ను తీసుకోవడం వలన గుండెకు రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. తద్వారా, కిడ్నీలకు కూడా రక్త ప్రవాహం సజావుగా ఉంటుంది. ఆ విధంగా గుండెపై ఒత్తిడి తగ్గుతుంది అలాగే ద్రవాలు చేరడమనే సమస్య తలెత్తదు.

10. తల్లిబిడ్డకు ఆక్సిజన్ సప్లై మెరుగ్గా ఉంటుంది

10. తల్లిబిడ్డకు ఆక్సిజన్ సప్లై మెరుగ్గా ఉంటుంది

గర్భాశయానికి రక్తసరఫరా సజావుగా జరగాలంటే తగినంత బెడ్ రెస్ట్ తీసుకోవడం తప్పనిసరి. ఆ విధంగా గర్భంలోనున్న పాపాయికి అవసరమైనంత ఆక్సిజన్ ని అలాగే చక్కటి పోషణని అందించినవారవుతారు.

తగినంత బెడ్ రెస్ట్ ని తీసుకోవడం ద్వారా ఒత్తిడిని కలిగించి ప్రెగ్నన్సీ కాంప్లికేషన్స్ ని పెంచే క్యాటెకోలమైన్స్ అనే ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను తగ్గించుకున్నవారవుతారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Is Bed Rest Essential During Pregnancy?

    Bed rest in pregnancy basically refers to limiting your activity to just a few basic activities such as having a bath or using the washroom. In some cases, hospitalization may be necessary, as when the doctor advises not to move even as much as required for basic hygiene.
    Story first published: Wednesday, January 3, 2018, 14:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more