గర్భధారణ తొలినాళ్లలో సురక్షితంగా గర్భస్రావం జరిగే మార్గముందా?

Subscribe to Boldsky

మానవ జీవితంలో జరిగే అద్భుతాలలో గర్భధారణ ముఖ్యమైనది. ఈ ప్రక్రియ ద్వారా మాత్రమే ఒక కొత్త ప్రాణిని ఈ భూమి మీదకు ఆహ్వానించడం సాధ్యమవుతుంది. ప్రతి స్త్రీకి గర్భం ధరించడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు జీవితంలో ఈ దశ కొరకు ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తుంటారు.

కానీ, గర్భధారణ సరైన సమయం మరియు ప్రదేశంలో జరిగినప్పుడు మాత్రమే అది ఆనందదాయకంగా ఉంటుంది అనేది కొట్టిపారేయలేని నిజం. ఇలా కనుక జరగకపోతే మన చుట్టుపక్కల వారు బంధువులు ముఖము చిట్లించుకుంటారు.ఇటువంటి సందర్భంలో తల్లి కాబోయే స్త్రీకి గర్భస్రావం చేయించుకునే అవకాశం ఇవ్వాలి.

ఇంకొన్నిసార్లు అప్పటికే దంపతులకు కోరుకున్నంతమంది పిల్లలు ఉన్నా కూడా పొరపాటున గర్భం దాలుస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా గర్భస్రావం చేయించుకోవాలనుకుంటారు. అంతేకాకుండా అవాంఛిత గర్భం కలిగినవారు కూడా గర్భస్రావం చేయించుకుంటారు.

సాధారణంగా అనూహ్యమైన గర్భాధారణ నిజంగా షాక్ కు గురిచేస్తుంది. మీరు ఊహించకుండానే సడెన్ గా మీకు గర్భం ధాల్చారని నిర్ధారణ జరిగితే మీరు ఒక్కింత ఒత్తిడికి గురిచేస్తుంది. గర్భం దాల్చడం ఇప్పుడప్పుడే వద్దు అనుకొనే వారు మెడికల్ ట్రీట్మెంట్స్ కాకుండా సహజ పద్దతుల ద్వారా ఆకస్మిక గర్భం ప్రణాళికను టర్మినేట్ చేయవచ్చు. అందుకు కొన్ని రకాల హెర్బ్స్ మరియు మొక్కలు వంటివి గర్భం విచ్చిన్నం అవ్వడానికి చాలా దేశాల్లో చట్టబద్దంగా ఉపయోగించడం జరుగుతుంది.

Is there a safe way to abort an early pregnancy?

గర్భస్రావం మీ శరీరం మీద చాలా కఠిన ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడుపడితే అప్పుడు సరైన అవగాహన లేకుండా చేయించుకునే గర్భస్రావం తల్లి ప్రాణానికి ప్రమాదం కలుగచేయవచ్చు. న్యాయపరంగా మాట్లాడినా కూడా, చాలా దేశాల్లో మొదటి త్రైమాసికం అనంతరం గర్భస్రావాన్ని అనుమతించరు.

ఆకస్మికంగా ఏర్పడ్డ గర్భం విచ్చిన్నం కావాలంటే అందుకు కొన్ని సహజ పద్దతులున్నాయి. ఉదాహరణకు, కొన్ని సహజ ఆహారాలు గర్భ విచ్చిన్నం అవ్వడానికి కారణం అవుతాయి. నేచురల్ అబార్షన్ ను పద్దతులను కేవలం మొదటి త్రైమాసికంలో(మొదటిమూడునెలలోపు) మాత్రమే జరపవచ్చు. తర్వాత సహజపద్దతుల్లో గర్భవిచ్ఛిత ఫలించకపోవచ్చు. లేదా కష్టతరం కావచ్చు. మొదటి త్రైమాసికంలో సహజ పద్దతులను ఉపయోగించే గర్భం విచ్చిన్నం చేయడం వల్ల తల్లికి ఎటువంటి ప్రమాధం ఉండదు.

వైద్యపరంగా చూస్తే గర్భాన్ని తొలినాళ్ళలోనే ఐదు నుండి పది వారాల మధ్య తొలగించడం మంచిది. సురక్షితంగా తొలినాళ్లలో గర్భాన్ని ఎలా తొలగించవచ్చో తెలుసుకోవడానికి ఈ క్రింది వ్యాసం చదవండి..

1. మాన్యువల్ వాక్యూమ్ ఆస్పిరేషన్:

1. మాన్యువల్ వాక్యూమ్ ఆస్పిరేషన్:

ఈ పద్ధతిలో వైద్యుడు చేతిలో ఇమిడే సాధనంతో గర్భానికి సంబంధించిన కణజాలాన్ని తొలగిస్తారు. ఈ పద్దతిలో ఉండే సదుపాయం ఏమిటంటే ఎటువంటి అంతర్గత రక్తస్రావం ఉండదు మరియు ఐదు నిమిషాలలో ప్రక్రియ పూర్తి అవుతుంది. మరుసటి రోజు నుండి దైనందిన కార్యక్రమాలు మామూలుగా చేసుకోవచ్చు. మిగిలిన పద్ధతులతో పోలిస్తే ఇది అత్యంత సురక్షితమైనది, ఎందుకంటే ఇందులో గీరటం కానీ , ఎలెక్ట్రిక్ సక్షన్ కానీ, మత్తు ఇవ్వడం కానీ జరగదు. కండరాలు సంకోచం చెందవు కనుక ఎటువంటి నొప్పి కూడా కలగదు.

2. గర్భస్రావ మాత్రలు:

2. గర్భస్రావ మాత్రలు:

వైద్యులు సూచించే ఈ మాత్రను తొమ్మిదవ వారం వరకు తీసుకోవచ్చు. ఈ మాత్ర గర్భధారణ సమయంలో విడుదలయ్యే హార్మోన్లను అడ్డుకుని గర్భస్రావాన్ని ప్రేరేపిస్తుంది. కండరాలు వ్యాకోచం చెందటం వలన ఇది కాస్తంత నొప్పితో కూడుకున్నదే. ఈ పద్దతిని అనుసరించినపుడు నొప్పినివారణ మాత్రలు కూడా వేరేగా వేసుకుంటారు. అంతేకాకుండా పూర్తిగా గర్భస్రావం జరిగిందో లేదో తెలుసుకోవడానికి వైద్యుని సంప్రదించాలి. దీనిలో ఉన్న సదుపాయం ఏమిటంటే వైద్యుని సలహాతో ఇంట్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

3. బొప్పాయిని సేవించడం:

3. బొప్పాయిని సేవించడం:

బొప్పాయిలో ఉండే వృక్ష సంబంధిత రసాయనాలలో గర్భనిరోధక లక్షణాలు ఉంటాయి. ఈ రసాయనాలలో ఉండే ఆక్సిటోసిన్ మరియు ప్రోష్టాగ్లాండిన్ లు ప్రసవానికి అవసరమైన నొప్పులు కలుగజేస్తాయి. గర్భం దాల్చిన తొలినాళ్లలో గర్భస్రావన్ని కోరుకునేవారు మగ్గిన బొప్పాయిని మాత్రమే కాక పచ్చి బొప్పాయిని కూడా రుచి చూడండి. పచ్చి బొప్పాయిలో ప్రోష్టాగ్లాండిన్ అధికంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురవ్వకూడదంటే పచ్చి బొప్పాయిని తినరాదు.

4. దాల్చిన చెక్క:

4. దాల్చిన చెక్క:

గర్భసంచిలో ఉద్దీపన కలిగించడానికి దాల్చినచెక్కను సాధారణంగా వాడతారు. ఇది శరీరాన్ని ప్రసవవేదనకు సంసిద్ధం చేస్తుంది. గర్భధారణ తొలినాళ్లలో తీసుకుంటే దీని మూలాన గర్భస్రావం అవుతుంది. ఇక్కడ గమనించవల్సిన విషయమేమిటంటే, కొద్ది మొత్తంలో దాల్చినచెక్కను తీసుకుంటే ఎటువంటి హాని జరగదు. ఫలితం కావల్సినవారు తగినంత మొత్తంలో తినాలి. పచ్చిగా తింటే ఇంకా మంచిది. వంటల్లో వాడితే వేడితగిలి దానిలో ఉండే మూలకాల ప్రభావం తగ్గిపోతుంది.

5. అతిగా వ్యాయామం చేయడం:

5. అతిగా వ్యాయామం చేయడం:

గర్భధారణ సమయంలో అధికంగా వ్యాయామం చేస్తే అది బిడ్డకు చేటు చేస్తుంది.కనుక తొలినాళ్లలో సులువైన పద్ధతిలో గర్భస్రావం కావాలనుకునేవారు, వెయిట్ లిఫ్టింగ్, పరుగు లేక స్కిప్పింగ్ చేయవచ్చు. గంటల కొలదీ మెట్లు ఎక్కడం దిగడం వలన కూడా ఫలితం వుండొచ్చు. ఏదేమైనప్పటికి ఈ పద్ధతిని అనుసరించే ముందు వైద్యులను సంప్రదించాలి. ఏ చిన్న పొరపాటు దొర్లినా జీవితంలో మళ్ళీ మీరు గర్భాన్ని పొందలేరు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Is there a safe way to abort an early pregnancy?

    Unwanted pregnancies lead to abortion. There are certain medical ways to abort the unborn foetus too. Abortions are usually done in the first trimester of pregnancy. Manual Vacuum Aspiration, abortion pills, consumption of papaya, etc., are the ways to abort an early pregnancy.Safe Way To Abort An Early Pregnancy
    Story first published: Saturday, April 14, 2018, 17:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more