స్త్రీల పై గర్భధారణ సమయంలో విపరీతంగా ప్రభావం చూపే సమస్యలు ఇవే :

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

గర్భధారణ సమయంలో స్త్రీలు అనుభవించే నొప్పులు చాలా విపరీతంగా ఉంటాయి. అవి ఎంత నొప్పిని కలిగిస్తాయి అనే విషయం చాలామంది స్త్రీలకు తెలుసు. సాధారణ పద్దతిలో పిల్లలకు జన్మ ఇవ్వడం అనేది అంత సులభమైన విషయం ఏమి కాదు.

కొన్ని సందర్భాల్లో ఈ జన్మించే ప్రక్రియను టి.వి లలో చాలా బాగా చూపిస్తారు. అటువంటి సమయంలో మీరు కొద్దిగా ఆనందాన్ని పొందవచ్చు మరియు మీలో కొత్త ఉత్సాహాన్ని అది కలిగించి మీ మెదడుని శాంతపరచవచ్చు.

గర్భదారణ సమయంలో స్త్రీల పై విపరీతముగా ప్రభావం చూపే సమస్యలు ఏమిటో మీకు తెలుసా ?

Problems That Massively Affect Women During Labour

కానీ, నిజానికి ప్రసవ సమయంలో గర్భం ధరించిన స్త్రీలు ఎన్నో రకాలైన ఊహించని ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.వీటన్నింటికి అమ్మలందరూ ముందుగా సంసిద్ధం అయి ఉండాలి.

ఇప్పుడు మీరు చదవబోయే సమస్యలన్నీ చాలా సాధారణమయినవే అయి ఉండవచ్చు మరియు అధ్యయనాల ప్రకారం 80% మంది స్త్రీలు ప్రసవ సమయంలో ఈ సమస్యలన్నింటిని అనుభవించే ఉంటారు.

మీరు ఎప్పుడైతే మీ కడుపులో ఉన్న బిడ్డను బయటకు పంపాలని విపరీతమైన ఒత్తిడి చేస్తారో, అటువంటి సమయంలో వైద్యులు వైద్య పరిభాషలో వాడే మాటలను ఎక్కువగా వాడుతుంటారు మరియు అవి ఉపయోగించి అరుస్తుంటారు. అటువంటి సమయంలో వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మీ మెదడు ఒకింత సాధారణ స్థితికి చేరుకొని అసలు ఏమి జరుగుతోంది అనే విషయం మిమ్మల్ని గుర్తించేలా చేస్తుంది.

కాబట్టి, మీరు ప్రసవించే గదిలోకి వెళ్లే ముందు అక్కడ జరిగే ప్రతి ఒక్కటి చాలా ముఖ్యమైనది అని భావించి, అన్నింటికీ సంసిద్ధమై వెళ్ళాలి. అక్కడ ప్రసవించే సమయంలో స్త్రీలు ఎదుర్కోబోయే విపరీత సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

పిండం బాధ :

పిండం బాధ :

సాధారణంగా కడుపులో పెరిగే పిండం యొక్క గుండె చప్పుడు వినడానికి వైద్యులు ప్రయత్నిస్తారు. మాములుగా కడుపులో ఉండే బిడ్డ గుండె చప్పుడు సాధారణంగా కంటే తక్కువగా కొట్టుకుంటుంది అని ఊహిస్తారు. ఇటువంటి సందర్భంలో బిడ్డ యొక్క తల కనిపిస్తూ ఉంటే మరియు గర్భాశయం పూర్తిగా విప్పారిన విధంగా ఉంటే, అటువంటి సమయంలో వైద్యులు వెక్క్యూమ్ ఉపయోగించి బిడ్డని బయటకు తీస్తారు. దీనినే ఆంగ్లంలో ఫీటల్ డిస్ట్రెస్ అని అంటారు.

బిడ్డ పిరుదులు కనపడుతున్న సమయంలో :

బిడ్డ పిరుదులు కనపడుతున్న సమయంలో :

ఎప్పుడైతే కడుపులో పెరుగుతున్న బిడ్డ యొక్క తల గర్భాశయంలో పైకి లేదా ప్రక్కకు ఉండి, బిడ్డ యొక్క కళ్ళు లేదా పిరుదులు కింది వైపుకు ఉంటాయో అటువంటి స్థితి కూడా కొద్దిగా విభిన్నమైనది. అంటే బిడ్డ తలక్రిందులుగా ఉండటం అనమాట. ఈ స్థాయిని ఆంగ్లంలో "మాల్ ప్రెసెంటేషన్" అని అంటారు. ప్రసవం అయ్యే సమయంలో బిడ్డ యొక్క తల గర్భాశయ ముఖ ద్వారం వైపు ఉంటే, బిడ్డ యోని నుండి చాలా సులభంగా బయటకు రాగలదు. ఒక వేళ బిడ్డ ఆ దిశలో గనుక లేకపోతె వైద్యులు చికిత్స చేయవలసి వస్తుంది.

ప్లాసెంటా ప్రీవియ :

ప్లాసెంటా ప్రీవియ :

సాధారణంగా గర్భధారణ మొదట్లో 75% మందిలో ఈ స్థితి ఉంటుంది. సాధారణంగా గర్భధారణ చివరి దశకు వచ్చేసరికి, గర్భస్థ మావి(ప్లాసెంటా) దానికంతటికి అదే సరైన స్థితికి వస్తుంది. కానీ, కొన్ని సందర్భాల్లో ఆలా జరగదు. అటువంటి సందర్భాల్లో గర్భాశయానికి చికిత్స చేసి బిడ్డని బయటకు తీస్తారు.

ఆశించిన పురీషము :

ఆశించిన పురీషము :

బిడ్డ యొక్క పేగుల్లో ఒకలాంటి నలుపు రంగులో ఉండి, కొద్దిగా గట్టిగా ఉండి జిగటగా ఉండే పదార్ధం ఉంటుంది. దానినే ఆంగ్లంలో మెకానియం అని, తెలుగులో పురీషము అంటారు. గర్భాశయంలో ఉన్నప్పుడు బిడ్డ గాలి పీల్చే సమయంలో ఉమ్మనీరు వద్ద ఇది ఉంటుంది. దీని వల్ల కొన్ని ఊపిరికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. ఇటువంటి సమస్య ఎదురయినప్పుడు వెంటనే గనుక చికిత్స చేయకపోతే బిడ్డ మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మూపు యొక్క మెడ వెనుక భాగం :

మూపు యొక్క మెడ వెనుక భాగం :

సాధారణంగా బొడ్డుతాడు, బిడ్డ జన్మించినప్పుడు వారి మెడకు చుట్టుకొని ఉంటుంది. దాదాపు 75% శాతం మందిలో ప్రసవ సమయంలో ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి సమయంలో వైద్యులు వెంటనే స్పందించి దానిని సరిచేయాల్సిన అవసరం ఉంది.

సెఫాలోపెల్విక్ అసమానత :

సెఫాలోపెల్విక్ అసమానత :

ఎప్పుడైతే బిడ్డ యొక్క తల పెద్దదిగా ఉండి, పిండం అమ్మ యొక్క కటి ప్రాంతం నుండి బయటపడటానికి ఇబ్బంది పడుతుందో, అటువంటి సమయంలో ప్రసవం ఇక ముందుకు జరగదు. ఈ పరిస్థితినే సెఫాలోపెల్విక్ అసమానత అంటారు. ఇటువంటి సందర్భం ఎదురయినప్పుడు వైద్యులు వెంటనే స్పందించి చికిత్స అందించి బిడ్డను బయటకు తీయాల్సిన అవసరం ఉంది.

English summary

Problems That Massively Affect Women During Labour

Problems That Massively Affect Women During Labour,These are 6 Problems That Massively Affect Women During Labour. If you are pregnant, it is your duty to be aware of these things that can harm you and baby
Story first published: Friday, February 9, 2018, 8:00 [IST]