ఆస్తమా నుంచి శిశువులను రక్షించేందుకు ప్రెగ్నన్సీలో విటమిన్ డి ని తీసుకోవాలా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

విటమిన్ డి సప్లిమెంట్స్ ను ప్రెగ్నన్సీ సమయంలో తీసుకోవడం వలన నవజాత శిశువు రోగనిరోధక శక్తిపై అనుకూల ప్రభావం పడుతుంది. తద్వారా, ఆస్తమా వంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ దరిచేరవని ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది.

ఆస్తమాకి సంబంధించిన కేసులలో ఎక్కువ శాతం చిన్నవయసులోనే నిర్ధారించబడతాయని, గర్భంలోనే ఈ సమస్య తెలెత్తుతోందని కింగ్స్ కాలేజ్ లండన్ నుంచి లీడ్ రీసెర్చర్ క్యాథెరిన్ హారీలోవిజ్ చెప్తున్నారు.

4,400 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్) విటమిన్ డి సప్లిమెంట్ ని ప్రెగ్నన్సీలోని రెండవ అలాగే మూడవ త్రైమాసికంలో రోజూ తీసుకున్న వారి మీద కలిగిన ప్రభావాన్ని అలాగే డైలీ రెకమెండేడ్ ఇన్టేక్ గా 400 ఐయూని తీసుకున్న వారి మీద పడిన ప్రభావాన్ని ఈ రీసెర్చ్ టీమ్ కి చెందిన పరిశోధకులు అధ్యయనము చేశారు.

Vitamin D in pregnancy may shield babies from asthma

ఆస్తమా నుంచి శిశువులను రక్షించేందుకు ప్రెగ్నన్సీలో విటమిన్ డి ని తీసుకోవాలా?

జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్మ్యునాలజీలో పబ్లిష్ అయిన ఈ స్టడీ ప్రకారం ప్రెగ్నన్సీలో ఎక్కువ విటమిన్ డిని తీసుకోవడం వలన నవజాత శిశువులో ఇమ్మ్యూన్ రెస్పాన్స్ అనేది మెరుగ్గా ఉంటుంది.

చిన్నవయసులోని ఇమ్మ్యూన్ రెస్పాన్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఆస్త్మా వంటి లక్షణాలు రాను రాను తగ్గుముఖం పడతాయి. అందువలన, రెస్పిరేటరీ హెల్త్ అనేది చిన్నవయసులోనే బాగా ఇంప్రూవ్ అవుతుందని ఈ టీమ్ భావిస్తోంది.

విటమిన్ డికి అలాగే శిశువు యొక్క ఇమ్మ్యూనిటీకి మధ్య కలిగిన లింక్ గురించి జరిగిన స్టడీస్ అన్నీ పరిశీలనాత్మకమైనవే. ప్రెగ్నన్సీలో విటమిన్ డి అధికంగా తీసుకుంటే నవజాత శిశువు ఇమ్మ్యూన్ రెస్పాన్స్ పై సానుకూల ప్రభావం పడుతుందని అందువలన ఆస్త్మా వంటి బారిన పడకుండా శిశువును రక్షించుకోవచ్చని ఈ అధ్యయనం ద్వారా మొదటిసారి తెలిసిందని చెప్తున్నారు హారీలోవిజ్.

భవిష్యత్తులో జరగబోయే అధ్యయనాలలో శిశువు ఇమ్మ్యూనిటీపై దీర్ఘకాలిక ప్రభావం గురించి తెలియాలని అంటున్నారు హారీలోవిజ్

ఐఏఎన్ఎస్ నుంచి లభించిన సమాచారం

English summary

Vitamin D in pregnancy may shield babies from asthma

Taking vitamin D supplements in pregnancy can positively change the immune response of the newborn baby.