For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిక్స్ ఎందుకు ముఖ్యమైనవిగా ఉంటాయి

|

గర్భం దాల్చడమనేది ఎంత అందమైన అనుభూతో ఆ తల్లికే తెలుస్తుంది. వికారం, మార్నింగ్ సిక్నెస్, వాంతులు, అజీర్తి, తలనొప్పి, వంటి నొప్పులు, మరేదైనా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు వంటి సమస్యలు ఎన్ని ఎదురైనా, కడుపులో బిడ్డ ఉందన్న ఆనందం ముందు అవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి. ఒక్కసారి ఆ గర్భస్థ శిశువు పెరిగి పెద్దదవడం ప్రారంభించిన తర్వాత, నెమ్మదిగా ఆ శిశువు గర్భాశయం అంతటా కలియతిరగడం మొదలుపెడుతుంది. క్రమంగా ఆ అసౌకర్యం, వాస్తవానికి తిరుగుతుంది.

ఒక తల్లిగా గర్భధారణలో వివిధ దశలను దాటుతున్న కొలదీ, గర్భంలోని శిశువుతో మరింత అనుబంధం ఏర్పడుతుంది. క్రమంగా సరదా సంతోషాలతో కాలం కొనసాగుతుంటుంది.

baby kicks in womb

ఈ దశలో శిశువు కదలికలు అనేవి అత్యంత సాధారణమైన అంశంగా ఉంటుంది. మొదటి త్రైమాసికంలో, ఎటువంటి కదలికలు లేనప్పటికీ, తదుపరి రెండవ త్రైమాసికంలో తక్కువగా కదలికలు కనిపిస్తుంటాయి. ఇక మూడవ త్రైమాసికం అనగా చివరి దశ మొదటి భాగం కాస్త కిక్స్ ఎక్కువగా ఉన్నా, రెండవ భాగంలో ఆ కదలికలు కూడా నెమ్మదిస్తుంటాయి. అనగా, విశ్రాంతి సమయాలలో మాత్రమే కనుగొనేలా

చివరి త్రైమాసికంలోని మొదటి సగభాగంలో కడుపులోని బిడ్డ ఎక్కువగా తన్నడం చేస్తుంది. క్రమంగా తల్లికి తన ఉనికిని చాటే ప్రయత్నం చేస్తుంది. శిశువుకు గర్భాశయంలో ఎక్కువ స్థలాన్ని కలిగి ఉండని కారణాన, రెండవ సగభాగంలో కదలికలు లేకుండా ఉంటుంది.

ప్రతి శిశువు తనకంటూ ప్రత్యేకమైన స్వంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది., మరియు తన శక్తి స్థాయిల ప్రకారం స్వేచ్ఛగా గర్భాశయంలో కిక్స్ (తన్నడం) ఇవ్వడం చేస్తుంది. ఒక తల్లికి ఇటువంటి కిక్స్ ఉద్వేగభరితంగా ఉండడమే కాకుండా, అనేక రకాల పరిశీలనలకు అవకాశాలను ఇస్తుంది. అనగా శిశువు ఆరోగ్యం గురించిన వివరాలను సైతం వెల్లడిస్తుంది.

కడుపులో శిశువు తన్నడాన్ని అసలెందుకు తల్లులు అనుభూతి చెందాలి ?

గర్భస్థ శిశువు యొక్క మెదడు పనితీరు అత్యద్భుతంగా ఉంటుందని పరిశోధకులు గమనించారు. శిశువు కుడిచేతిలో కదలికలు ఎక్కువగా ఉన్న ఎడల, కుడిచేతికి స్పర్శానుభూతిని కలిగించే సంకేతాలు ఎడమ వైపు మెదడుభాగంలో ఏర్పడడం గమనించడం జరిగింది. నెలలు నిండకుండా పుట్టిన శిశువులలో కూడా ఈ మెదడులోని తరంగాల సంకేతాలు కొద్ది వారాలపాటు అత్యంత వేగంగా కొనసాగడం గమనించడం జరిగింది.

ప్రసవం తర్వాత, కొన్ని వారాలు వ్యవధిలో, శిశువు మెదడులోని తరంగాల వేగం క్రమంగా తగ్గడం కనిపించింది. చివరి మూడు నెలల్లో గర్భస్థ శిశువు ఇచ్చే కిక్స్ అత్యంత ముఖ్యమైనవి. ఇవి జననేంద్రియాలతో మెదడు యొక్క సంబంధాన్ని అభివృద్ధి చేస్తుంది; ఇది వారికి తమ శరీరం గురించిన అవగాహన పొందేందుకు సహాయపడుతుంది. క్రమంగా తాను ఉండే పర్యావరణానికి అనుగుణంగా యాదృచ్ఛికంగా శరీర కదలికలను ప్రదర్శించడంలో సహాయపడుతుంది. మరియు సమర్థవంతమైన అభిప్రాయాలపరంగా మెదడు మార్గ నిర్దేశకం చేసుకునేలా (బ్రెయిన్ మ్యాపింగ్లో) సహాయపడుతుంది.

నిద్ర మరియు కదలికలు అనేవి గర్భస్థ పిండానికి మరియు నెలలు నిండని శిశువులకు అత్యంత అవసరంగా ఉంటాయి. అవి కంటికి సంబంధించిన మ్యాపింగ్లో దోహదం చేస్తాయి మరియు పిల్లలు తమకు తాము అభద్రతాభావాలకు లోనుకాకుండా రక్షించడంలో సహాయపడుతాయి.

మెదడు అభివృద్ధితో, గర్భస్థ పిండం తన స్వంత మెదడు కార్యకలాపాలు కొనసాగించడం ప్రారంభిస్తుంది, క్రమంగా మెదడు సంకేతాలకు ప్రతిస్పందనగా తన్నడం చేస్తుంది. ధ్వని, ఉష్ణోగ్రత, తల్లి కదలికలలోని ఒక నిర్దిష్ట మార్పు, తల్లియొక్క మానసిక కల్లోలాల సంబంధిత బాహ్య కారకాలు కూడా శిశువు ఆలోచనల్లో ప్రభావాన్ని చూపగలవు.

శిశువు కిక్స్ ఇవ్వడం ప్రారంభించినప్పుడు, తన శరీర కండరాలను మరియు అవయవాలను విస్తరించటానికి మరియు ప్రేరణను అందివ్వడానికి, మెదడుతో ఒక చేతన అనుబంధాన్ని కలిగిఉంటుంది. అయినప్పటికీ, అనేకమంది గర్భస్థ శిశువులలో ఈ కదలికల ఫ్రీక్వెన్సీలోని (తరచుగా) వ్యత్యాసాన్ని వైద్యులు ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. కొందరు పిల్లలు అధికకాలం అచేతన స్థితిని ప్రదర్శిస్తుంటారు. చివరి త్రైమాసికంలో అతితక్కువ కదలికలను ప్రదర్శించే గర్భస్థ శిశువులు మృత శిశువులుగా మారే అవకాశాలు సైతం లేకపోలేదు. కానీ, కొన్ని ఉదాహరణల ప్రకారం అత్యంత అరుదుగా ఇటువంటి సందర్భాలలో కూడా ఆరోగ్యకరమైన శిశువు జన్మించడం జరుగుతుంటుంది.

గర్భధారణలో ఉన్న తల్లి, రెండు గంటల వ్యవధిలో పది కదలికలను (కిక్స్) గమనిస్తున్న ఎడల, అది ఆరోగ్యకరమైన అంశంగా భావించడం జరుగుతుంటుంది. అయితే, వీటి గణనల సంఖ్య ఆధారంగా ఆరోగ్యకరమైన గర్భధారణకు హామీ ఇచ్చే బలమైన రుజువంటూ ఏదీ లేదు. కొంతమంది తల్లులు శిశువు లోపల కదులుతున్నా, అంతగా అనుభూతిని కలిగి ఉండరు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు తక్కువ బరువు కలిగిన శిశువు, లేదా కాన్పుల సంఖ్య, లేదా ఊబకాయం, లేదా ఇతరత్రా పనుల్లో నిమగ్నమవడం వంటివి చెప్పవచ్చు.

baby kicks in womb

కడుపులోని శిశువు కిక్స్ ఇస్తున్న ఎడల, మీరు పాటించవలసిన అంశాలు :

1. కిక్స్ సంఖ్యను లెక్కించండి :

చివరి త్రైమాసికంలో గర్బస్థ శిశువులో తరచుగా కదలికలు కనిపిస్తుంటాయి. సాధారణంగా అనేకమంది ఆరోగ్యకరమైన తల్లులు ఇతరత్రా ఇంటి పనులలో నిమగ్నమై ఉన్న కారణంగా ఈ కిక్స్ లెక్కించడం అనేది తక్కువగా ఉంటుంది. క్రమంగా కిక్స్ సరిగ్గా లేవని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే, ఆమె సావదానంగా ఒకచోట కూర్చుని గమనించిన ఎడల, శిశువు ఇచ్చే కిక్స్ లెక్కించడం సాధ్యపడుతుంది. కానీ ఇటువంటివి అదిపనిగా చేసినట్లు ఉండకూడదు. అలా తీవ్రంగా ఆలోచించడం కూడా ఆరోగ్యానికి మంచిదికాదు. మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయాలలో కాస్త సమయం కేటాయించి, గమనించడం సిఫార్సు చేయబడుతుంది.

అయితే, అందరు శిశువులు భిన్న రకాలుగా ఉంటారని మరవకండి. కొందరు పగలు చురుకుగా ఉంటే, కొందరు రాత్రివేళల్లో చురుకుగా ఉంటారు. కొందరైతే అన్ని వేళలా చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ తల్లులకు తీరికలేకుండా చేస్తుంటారు.

గర్భస్థ శిశువు దాదాపు పదిహేను గంటలపాటు నిద్రిస్తుంది. అక్కడ ఒక విడత సుమారు 50 నిముషాలుగా ఉంటుంది. శిశువు ఒక రోజులో 15 నుండి 20 సార్లు కన్నా తక్కువ సంఖ్యలో కిక్స్ ఇస్తూ, ఇలా ఇదివరకే కొన్ని సార్లు జరిగి ఉంటే, ఖచ్చితంగా ఆ తల్లి వైద్యుడిని సంప్రదించి, సలహా తీసుకోవలసి ఉంటుంది.

2. కొద్ది మోతాదులో స్నాక్స్ తీసుకోండి :

శిశువు కొంచం ఎక్కువ నిద్రిస్తున్నట్లయితే, తల్లి బిడ్డ కదలికలను ఎంతగా అనుభూతి చెందడం జరగదు. ఆ సమయంలో ఆ తల్లి, కొద్దిగా చిరుతిండి లేదా కొంత జ్యూస్ తీసుకోవడం చేస్తూ ఉండాలి. ఈ చర్య మీ ప్రేగు వ్యవస్థను మరియు గర్భాశయంలో ఒక కదలికను సృష్టించగలుగుతుంది. క్రమంగా శిశువు కదిలేలా ప్రేరణనిస్తుంది. ఇది గర్భధారణ చివరి త్రైమాసికంలో సూచించదగిన ఉపయోగకరమైన చిట్కాలలో ఒకటిగా ఉంటుంది. అయినప్పటికీ, డయాబెటిక్ స్త్రీలు తినే ఆహారం పట్ల శ్రద్దవహించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోని ఎడల, వారి రోగాలను తమ శిశువులకు అందించే అవకాశాలు లేకపోలేదు.

3. కొద్దిగా తేలికపాటి వ్యాయామాన్ని అనుసరించండి :

అనేక సార్లు పిల్లలు అల్ట్రాసౌండ్ సమయంలో కెమెరాలో కనపడకుండా దాక్కుంటూ ఉంటారు. కావున కొద్దిపాటి వైద్యులు సూచించిన పద్దతిలో జాగింగ్, జంపింగ్ జాక్స్ వంటి తేలికపాటి వ్యాయామాలను అనుసరించడం ద్వారా, శిశువు కదలికలలో మార్పులు ఏర్పడుతాయి. క్రమంగా తమ స్థానంలో మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తాయి.

baby kicks in womb

4. టార్చ్లైట్ ఉపయోగించి కడుపు మీద ఫ్లాష్ లైట్ వేయండి :

కడుపులోని బిడ్డ, తన 23వ వారం నందు వెలుపలి ప్రపంచంలోని కాంతి మరియు చీకటి మార్పులను సులభంగా గ్రహించగలదు. తల్లి కడుపు మీద కాంతి పడినప్పుడు, వారు దాని నుండి పక్కకు తిరగడం చేస్తుంటారు. క్రమంగా వారి కదలికలను ప్రేరేపించడానికి సూచించదగిన సమర్థవంతమైన పద్ధతిగా చెప్పబడింది.

5. గర్భస్థ శిశువుతో కమ్యూనికేషన్ ప్రారంభించండి :

గర్భస్థ శిశువు 16వ వారంలో వినికిడి ప్రక్రియ మొదలవుతుంది. మరియు 22వ వారం పూర్తిగా పరిపక్వత చెందడం జరుగుతుంది. క్రమంగా శిశువులు తల్లి స్వరశబ్దం, ఆమె రక్తప్రసరణ మరియు బాహ్య వాతావరణంలోని పెద్ద శబ్దాలను కూడా వినడం జరుగుతుంటుంది. ఈ ప్రక్రియ తల్లి, పిండంతో కమ్యూనికేట్ చేయడానికి అత్యద్భుతమైన అవకాశంగా ఉంటుంది. కొన్నిసందర్భాలలో వారు తమతమ ప్రతిస్పందనలను కూడా కదలికల ద్వారా తెలియజేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకు కడుపులో అటు ఇటు తిరగడం, తన్నడం, కుదుపులను ప్రదర్శించడం వంటివి.

6.కొద్దిగా స్పందనలు, కొంత పరిమితిమేర :

తల్లులు తమ గర్భస్థ శిశువుల నుండి కదలికలను ఆశిస్తున్న ఎడల, వారికి కొన్ని సంకేతాలను ఇవ్వడం ద్వారా వారి కదలికలను పొందే అవకాశాలు ఉన్నాయి. అనగా కడుపు మీద కొద్దిగా చక్కిలిగింతలు పెట్టడం. లేదా సున్నితంగా నొక్కడం వంటివి. ఇటువంటివి, శిశువులకు ఊహించని విధంగా ఉన్న కారణాన, అనాలోచితంగా కదలికలను ప్రదర్శించగలరు. కానీ ఎక్కువగా చేయకండి. అధిక ఉద్వేగం అనేది, తల్లికి బిడ్డకు ప్రమాదం కావున, శిశువుతో వ్యవహరించేటప్పుడు సున్నితంగా ఉన్నారని నిర్ధారించుకోండి.

7. సున్నితమైన పాటలను వినడం లేదా పాడడం చేయండి :

తల్లి కడుపులోని శిశువులు, సున్నితమైన లాలి పాటలను లేదా సంగీతాన్ని వినేందుకు ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. కొన్నిసందర్భాలలో శిశువు తన చిన్న చిన్న కదలికలతో కూడా ప్రతిస్పందించవచ్చు. శిశువు ఎక్కువ సేపు కదలకుండా ఉన్న ఎడల, ఈ చిట్కాను అనుసరించి చూడండి. తప్పనిసరిగా కొంత ఉత్సాహపూరిత ప్రతిస్పందనను పొందడానికి సహాయపడుతుంది.

8. శిశువుతో ఆడేందుకు సమయాన్ని వెచ్చించండి :

తల్లికి బిడ్డతో ఆడుకోవడమనేది ఎంతో సంతోషకరమైన అనుభూతిగా ఉంటుంది. కడుపులోని శిశువు, తన చేతులు లేదా కాళ్లను సాగించి, సున్నితంగా తన్నుతూ ఉంటే, తల్లి తన ప్రతిస్పందనను తెలియజేయడానికి, కొంచెం తిరిగి నొక్కవచ్చు. బిడ్డ సంతోషంగా లేదా చురుకుగా ఉన్న ఎడల, మరలా తిరిగి తన్నడం ద్వారా స్పందించవచ్చు.

9. తరచుగా స్థానభ్రంశం ఉండేలా చూసుకోవాలి :

శిశువు నిద్రిస్తున్న సమయంలో ఉండే కొన్ని భంగిమల కారణంగా తల్లులకు కాస్త అసౌకర్యంగా ఉంటూ బాధకలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 9వ నెలలో, శిశువు పరిమాణం పెద్దదిగా మారిన కారణాన, సరైన స్థలం లేని కారణంగా,. వారి తల చివరికి కటి ప్రాంతానికి (కిందకు) మరియు కాళ్లు పక్కటెముకల వైపుగా (పైకి) మారుతుంది. క్రమంగా వారి స్వల్ప కదలికలు సైతం తల్లికి అసౌకర్యాన్ని మరియు బాధను కలిగించవచ్చు. కావున ఆమె ఈ కదలికలను అనుభవిస్తున్నప్పుడు, తరచుగా తన స్థానాలను మార్చుకునేలా జాగ్రత్త తీసుకోవచ్చు.

10. ఈ దశను ఆనందించండి :

ఇది 9 వ నెల, తల్లికి బాధాకరమైనది అయినప్పటికీ, గర్భస్థ పిండం కిక్స్ అనేవి దాని అభివృద్ధిలోని ముఖ్యమైన భాగం. ఒక కొత్త జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ అనుభూతిని ఆమె సంతోషంగా అంగీకరించిన ఎడల, ఆమె ఈ దశను పరిపూర్ణంగా ఆస్వాదించగలుగుతుంది. క్రమంగా ఆమెకు మానసికంగా అవసరమైన శక్తి చేకూరుతుంది.

ఒక తల్లి తన బిడ్డకు ఆరోగ్యకరమైన జన్మనివ్వడానికి, ఆమెకు శారీరికంగానే కాకుండా మానసిక బలాన్ని కూడా కలిగి ఉండడం అవసరంగా ఉంటుంది. గర్భస్థ పిండం కదలికలు సరిగ్గా లేనట్లయితే, శిశువు చురుకుగా లేదని నిర్ధారించుకుని, తక్షణమే వైద్యుని సంప్రదించవలసిన అవసరం ఉంటుందని గుర్తుంచుకోండి.

baby kicks in womb

శిశువు కిక్స్ లెక్కించడానికి కూడా సమయం ఉంటుందా ?

28 వారాల గర్భధారణ తరువాత, శిశువు కదలికలు తల్లికి అనుగుణంగా ఏర్పడుతుంటాయి. కావున సాధారణంగా ఈ సమయం సూచించబడుతుంది. శిశువు చురుకుగా ఉన్నప్పుడు, లేదా తల్లి విశ్రాంతి తీసుకున్న సమయం మీద దృష్టి సారించేలా సమయాన్ని ఎన్నుకోవాలి.

నిలకడ అనేది కీలకంగా ఉంటుంది :

దాదాపు ఇటువంటి సమయాలలోనే శిశువు కదలికలు లెక్కించడం మంచిది. క్రమంగా గర్భస్థ పిండం ప్రతిస్పందించిన నమూనాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

భ్రూణ కదలికలను ఎలా తనిఖీ చేయాలి ?

చురుకుగా జీవితం కొనసాగుతున్న సమయంలో, పని కారణంగా లేదా ఏదేని ఇతరత్రా అంశాల మీద దృష్టి సారించినప్పుడు, శిశువు కదలికలను కనిపెట్టలేకపోవచ్చు. ఏదిఏమైనా, కిక్స్ విషయంలో ఏదైనా తగ్గుదల ఉన్న ఎడల, ఎట్టి పరిస్థితుల్లో వైద్యుని సంప్రదించవలసి ఉంటుందని మరువకండి. ఇటువంటి సమయంలో, సాధారణంగా ఎడమ వైపున పడుకోమని సూచించడం జరుగుతుంటుంది. ఇది గర్భస్థ శిశువుకి పరిపూర్ణ మద్దతుగా ఉంటుంది.

రెండు గంటల వ్యవధిలో ఉన్న శిశువు కదలికల సంఖ్యను తల్లులు తప్పక అనుసరించవలసి ఉంటుంది. క్రమంగా, తల్లి తన బిడ్డ యొక్క సహజ కదలికలను తెలుసుకోవటానికి సాధ్యపడుతుంది. సూచించిన సమయంలో శిశువు 10 కిక్స్ కన్నా తక్కువగా చూపించినట్లయితే, కేర్ టేకర్ సలహా తీసుకోవటానికి ప్రయత్నించండి.

శిశువు కిక్స్ తగ్గడం వలన ఏమన్నా అవాంతరాలు ఉంటాయా ?

ఇది ప్రధానమైన విషయం కాకపోవచ్చు, కానీ గర్భస్థ శిశువు కిక్స్ తగ్గుదల కారణంగా సరైన ఆక్సిజన్ లేదా సరైన పోషకాహారాన్ని పొందలేని పరిస్థితిని సూచించవచ్చు. ఈ పరిస్థితి శిశువును నొప్పికి గురిచేసే అవకాశాలు ఉన్నాయి. గర్భస్థ పిండం మరియు ప్రసూతి తనిఖీలలో తక్కువ కదలికలకు గల కారణాలు తెలుసుకోవడానికి వీలవుతుంది.

అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా, గర్భస్థ పిండం యొక్క రక్త ప్రసరణ మరియు బాహ్య ప్రేరణకు శిశువు యొక్క ప్రతిస్పందనలను గమనించడం జరుగుతుంది. క్రమంగా ఏ ఇతరత్రా సమస్యలు ఉత్పన్నమైనా నివారణా చర్యలు తీసుకునే వీలుంటుంది.

8 నెలల తర్వాత గర్భస్థ శిశువు కదలికలు :

గర్భస్థ శిశువు ఎనిమిది నెలల తర్వాత, ప్రతి క్షణమూ కదులుతూనే ఉండడానికి ప్రయత్నించినప్పటికీ, తన ఎదుగుదల కారణంగా గర్భాశయంలో సరైన స్థలం లేక, ఇరుకుగా ఉన్న కారణాన, పెద్ద పెద్ద కదలికలను ఇవ్వలేకపోవచ్చు. క్రమంగా బొడ్డు తాడుతో ఆడుకోవడం జరుగుతుంటుంది. మరియు ఉన్న ఆ కొద్ది ప్రదేశంలోనే వారి ముఖాన్ని మరియు చేతులను సున్నితంగా కదిలించే ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో వెక్కిళ్ళలో సహజమైన లయను కూడా అనుసరిస్తుంటారు, మరియు ప్రతిరోజూ అదే సమయంలో వాటిని అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి.

గర్భస్థ శిశువు కదలికలు, వారి భవిష్యత్తును నిర్ణయించడానికి సహాయం చేస్తాయా ?

ఏది ఏమైనప్పటికి, గర్భస్థ శిశువు కదలికల నమూనా ప్రసవం తర్వాత, వారి ప్రవర్తనను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది అని వైద్యులు ధృవీకరిస్తున్నారు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు వారి కిక్స్ మరియు చిన్నతనంలో వారి క్రమశిక్షణా ప్రవర్తనల మధ్య ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లు కనుగొనబడింది. ఎక్కువగా, గర్భంలో చురుకుగా ఉన్న శిశువులు, చురుకుగా మరియు సూపర్ యాక్టివ్ నేచర్ కలిగి తమ తమ తల్లులకు విశ్రాంతి లేకుండా చేస్తుంటారు. రాత్రిపూట ఎక్కువగా చురుకుగా ఉంటూ, రోజంతా నిద్రకు కేటాయిస్తున్న శిశువులు, తరువాతి దశలో ఎక్కువగా నిద్రకు సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

గర్భస్థ పిండం కదలికలు లేదా కిక్స్ అనేవి, శిశువు యొక్క పరిపూర్ణ ఎదుగుదలను సూచించే మొట్టమొదటి అందమైన కమ్యూనికేషన్ వలె ఉంటుంది. పైన చెప్పిన చిట్కాలన్నిటినీ మనస్సులో ఉంచుకోవడం ద్వారా, ఒత్తిడి రహిత గర్భధారణ మరియు ప్రసవాన్ని కలిగి ఉండేందుకు దోహదపడుతుంది.

ఎటువంటి అనుమానాలు ఉన్నా, మీ వైద్యుని లేదా కేర్ టేకర్ని అడిగి తెలుసుకోండి. కడుపులో 9 నెలలు శిశువు పడే కష్టం, తల్లి కష్టంలో సమానంగా ఉంటుంది. తిరిగి ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనంతరం, వాస్తవిక సమాజిక పరిస్థితులకు అనుగుణంగా తననుతాను మార్చుకోవలసిన పరిస్థితులు ఆ శిశువుకి ఏర్పడుతుంటాయి. కావున, కడుపులో ఉన్నప్పటి నుండే, శిశువు పట్ల జాగ్రత్తను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఆహారం నుండి తీసుకునే సప్లిమెంట్స్ వరకు, శిశువు ఆరోగ్య పరీక్షల నుండి బిడ్డ కదలికల వరకు ప్రతి అంశమూ కీలకంగానే ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ విషయంలో తల్లిది ప్రధాన భాద్యతగా ఉన్నా, ఆ తల్లికి బిడ్డకు ఇద్దరికీ కుటుంబ సభ్యుల సహకారం ఖచ్చితంగా ఉండాలి.

కొన్ని సందర్భాలలో వారి వారి సలహాలు, అనుభవాలు ఎన్నో పాఠాలను నేర్పిస్తాయని మరువకండి. కానీ, కాలానుగుణ పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుత వాస్తవిక పరిస్థితుల నడుమ వారి అభిప్రాయాలను సరిపోల్చుకుంటూ, వైద్యుల సలహా మేరకు నిర్ణయాలు తీసుకునేలా ఉండాలని గుర్తుంచుకోండి. మాతృత్వం, ఇదొక వరం. మారుతున్న కాలుష్య పరిస్థితుల దృష్ట్యా, వంధ్యత్వం (ఇన్ఫర్టిలిటీ), ఇన్పొటెన్సీ సమస్యల కారణంగా మాతృత్వానికి నోచుకోని తల్లుల శాతం పెరుగుతూ ఉంది. ఒకవేళ అన్ని కష్టాలను అధిగమించినా, జన్యుపరమైన సమస్యల నుండి పోషకాహారం, ఆరోగ్యం వంటి అనేక అంశాల నడుమ బిడ్డకు జన్మనివ్వవలసిన పరిస్థితులు ఉంటాయి. కావున జాగ్రత్త తప్పనిసరి అని మాత్రం మరువకండి. ఆక్రమంలో భాగంగానే గర్భస్థ శిశువు కదలికల గురించిన వివరాలు అందివ్వడం జరిగింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, శిశు సంబంధ, మాతృత్వ, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: pregnancy parenting
English summary

what to do when baby kicks in womb?

what to do when baby kicks in womb
Desktop Bottom Promotion