For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు తేనె తింటే ఆరోగ్యానికి బోలెడు లాభాలు?ఎంత తినాలి? ఎలా తినాలి? ప్రయోజనాలేంటి?

గర్భిణీలు మితంగా తేనె తింటే ఆరోగ్యాని బోలెడు లాభాలు?ఎంత తినాలి? ఎలా తినాలి? ఎందుకు తినాలి?ప్రయోజనాలేంటి

|

తేనె అనేక రోగాలను నియంత్రించే తీపి ఔషదం. తేనె అన్ని వయసుల వారికి ఇష్టమైనది. దాని మాధుర్యం నాలుకను తాకితే చాలు మళ్ళీ మళ్ళీ చప్పరించాలనిపిస్తుంది. సహజంగా లభించే ఈ స్వీట్నర్ ఆయుర్వేద చికిత్సలు మరియు ఇంటి నివారణలలో అత్యంత మహత్తరమైన స్థానాన్నిపొందినది. ఈ తేనె తుట్ట నుండి తేనెను సేకరిస్తారు. ఇది మానవాళికి ఒక దివ్వ ఔషధం అని చెప్పవచ్చు. రుచిలో తీపిని కలిగిన ఈ తేనె ఆరోగ్యం విషయంలో గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది.

వివిధ రకాల పువ్వుల మకరందం నుండి తయారయ్యే తేనె కొంచెం జిగటగా మరియు మందంగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి 1, బి 2, బి 3, బి 12, విటమిన్ సి, విటమిన్ కె, గ్లూకోజ్, విటమిన్ మినరల్ వంటి ప్రత్యేక పోషకాలు కూడా ఉన్నాయి. దీన్ని అనేక వ్యాధుల నియంత్రణకు ఉపయోగిస్తారు. మానవాళికి దివ్వఔషధంగా ఉన్న దీన్ని శరీర బరువు తగ్గించడం కోసం, చర్మ సంరక్షణ, సౌందర్య సాధనాలు మరియు పిల్లలు మరియు పెద్దలకు చిన్న మరియు పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించడానికి సమర్థవంతమైన ఔషధంగా ఉపయోగింపబడుతున్నది.

గర్భధారణ సమయంలో తేనెను క్రమం తప్పకుండా తీసుకోవచ్చు

గర్భధారణ సమయంలో తేనెను క్రమం తప్పకుండా తీసుకోవచ్చు

గర్భధారణ సమయంలో హార్మోన్లు వ్యత్యాసం నుండి శిశువు యొక్క అభివృద్ధి, తల్లి శరీరం యొక్క ఆరోగ్యం వరకు చాలా మార్పులు మరియు సూక్ష్మబేధాలు కనబడుతాయి. అటువంటి సందర్భంలో చాలా సాధారణ ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తరచుగా చెబుతుంటారు. అటువంటప్పుడు, డాక్టర్లు మాత్రలు లేదా మందులు ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు. అందువల్ల గర్భంలో పెరిగే శిశువుకు అసౌకర్యానికి కారణం కాని మందులు తీసుకోవాలి. అలాంటప్పుడు సహజంగా మనకు అందుబాటులో ఉండే తేనె సేవించడం ద్వారా తల్లి బిడ్డకు సురక్షితం, ఇది ఒక ఔషదంలా, కడుపులో పెరిగే శిశువుకు ఎలాంటి హాని కలిగించకుండా పోషిస్తుంది. అందువల్ల గర్భధారణ సమయంలో తేనెను క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు.

తేనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు

తేనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు

గర్భధారణ సమయంలో తల్లి శరీర ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకని, తల్లి తన ఆహారం, వ్యాయామం, దినచర్య మరియు అభిరుచులపై మంచి సమతుల్యతను పాటించాలి. అదనంగా, ఏటువంటి కారణాల చేత అంటు వ్యాధి మరియు అంటువ్యాధుల నుండి ఆరోగ్యాన్ని రక్షించబడుతుంది. అటువంటి ప్రాధమిక రక్షణను తేనె అందిస్తుంది. మీరు గర్భధారణలో ఉంటే లేదా మీ కుటుంబంలో గర్భిణీలుంటే తేనె తినడం ద్వారా ఏఏ రకమైన ఆరోగ్య సమస్యను నియంత్రించవచ్చు? గర్భధారణ సమయంలో తేనె తినడం ద్వారా కలిగే ప్రయోజనాలను పొందవచ్చు? అనే విషయాలను బోల్డ్ స్కై వ్యాసం ఈ క్రింది విధంగా వివరిస్తోంది.

గర్భవతిగా ఉన్నప్పుడు తేనె ఎందుకు సేవించాలి?

గర్భవతిగా ఉన్నప్పుడు తేనె ఎందుకు సేవించాలి?

ఒక టేబుల్ స్పూన్ తేనెను ఆహారంలో చేర్చుకోవడం లేదా తినడం వల్ల లేదా అలాగే తేనెను సేవించడం వల్ల వ్యాధినిరోధక శక్తి సంవ్రుద్దిగా పెరుగుతుంది. కాబట్టి ఉదయాన్నే, ఒక టేబుల్ స్పూన్ తేనెను గోరువెచ్చని నీటితో కలిపి సేవించండి. లేకపోతే మీ టీ లో ఒక టేబుల్ స్పూన్ తేనె జోడించి సేవించండి. లేదా ఒక గ్లాసు గోరెవెచ్చని నీటికి ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు నిమ్మరసం చేర్చి సేవించండి. తద్వారా గర్భం ప్రారంభంలో సంభవించే అత్యంత సాధారణ అలసట మరియు అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి.

గుండెల్లో మంట మరియు విరేచనాలు

గుండెల్లో మంట మరియు విరేచనాలు

ఒక గ్లాసు వెచ్చని పాలతో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల గుండెల్లో మంట మరియు విరేచనాలు వంటి అత్యంత సాధారణ సమస్యలను నివారించవచ్చుకోవచ్చు. ఇంకా ప్రశాంతంగా ఉండవచ్చు. గర్భధారణ సమయంలో అజీర్ణం, పొడి దగ్గు, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి. సహజంగా లభించే తేనె గర్భిణీ స్త్రీల ప్రాధమిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

అలెర్జీలకు దూరంగా ఉంటారు

అలెర్జీలకు దూరంగా ఉంటారు

గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా తేనె సేవించడం ద్వారా అలెర్జీలకు దూరంగా ఉంటారు. ఇది గర్భధారణలో వచ్చే స్కిన్ అలర్జీలకు దూరంగా ఉంచుతుంది. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ మితంగా తేనెను సేవిస్తే, శరీరంలో రోగనిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. ఇది కాలానుగుణంగా వచ్చే అలెర్జీల నుండి రక్షణ కల్పిస్తుంది.

దగ్గును నియంత్రిస్తుంది

దగ్గును నియంత్రిస్తుంది

గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో ఏదో ఒక సమయంలో పొడి దగ్గుతో బాధపడవచ్చు. ఇలాంటి పరిస్థితులను జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భధారణ సమయంలో యాంటీబయాటిక్ మందులు తీసుకోకూడదు. వీటి ప్రత్యామ్నాయంగా తేనె వంటి ఔషధాన్ని తీసుకోవచ్చు. దీన్ని సేవించడం వల్ల గర్భిణీలు జలుబు, దగ్గు మరియు గొంతులో మంటను తేనె నివారిస్తుంది. మీరు తేనెకు అల్లం మరియు నిమ్మరసం కలిపి సేవిస్తే జలుబు మరియు శ్లేష్మ సమస్యల నుండి బయటపడతారు.

నిద్ర లేమిని తగ్గిస్తుంది

నిద్ర లేమిని తగ్గిస్తుంది

గర్భధారణ సమయంలో నిద్ర లేమి సాధారణం. అటువంటప్పుడు, ఒక గ్లాసు పాలలో కొంచెం తేనెతో కలిపి తరచుగా సేవిస్తుంటే నిద్రలేమి సమస్య మాయమవుతాయి. ఇది నిద్రవేళకు కొద్దిసేపటి ముందు తీసుకోవాలి. అప్పుడే పిల్లలగా మంచి అందమైన నిద్రను పొందుతారు.

గుండెల్లో మంట మరియు అజీర్ణంను తగ్గిస్తుంది

గుండెల్లో మంట మరియు అజీర్ణంను తగ్గిస్తుంది

గర్భధారణ సమయంలో గుండెల్లో మంట మరియు అజీర్ణం సమస్య సాధారణం. ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో రోజూ ఒక గ్లాసు పాలకు కొంత తేనె కలిపి సేవించడం ద్వారా సమస్యను నివారించుకోవచ్చు.

అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది

అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది

తేనె ఆహారం యాంటీఆక్సిడెంట్ల కలిగిన గొప్ప వనరు అని మేము ఇప్పటికే చెప్పాము. కానీ, తేనెలో చాలా ఫ్లేవనాయిడ్లు కూడా ఉన్నాయని మీకు తెలుసా? కాబట్టి, మీరు తేనెను క్రమం తప్పకుండా తింటుంటే, అది ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చేస్తుంది. అంతేకాక, శిశువు అభివృద్ధికి తేనె కూడా సహాయపడుతుంది.

తేనె సహజంగా వచ్చే నొప్పులను నివారిస్తుంది

తేనె సహజంగా వచ్చే నొప్పులను నివారిస్తుంది

సహజంగా వచ్చే నొప్పులన నివారించడంలో తేనె ఒకటి అని తెలుసుకోవాలి. గుండెలో మంట, అల్సర్ వంటి సమస్యలను నివారిస్తుంది. వీటి నివారణకు తేనె ఒక దివ్వఔషధం. తేనె నొప్పిని నివారించడానికి మరియు గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది.

నొప్పులను మరియు గాయాలను నయం చేస్తుంది

నొప్పులను మరియు గాయాలను నయం చేస్తుంది

కడుపులో హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా పెరుగకుండా తేనె అడ్డుకోవడానికి సహాయపడుతుంది. మీరు తేనెను మితంగా తీసుకుంటే అల్సర్ వంటి పుండ్లను నయం చేస్తుంది. ఇంకా కొత్త కణజాలాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

గర్భవతిగా ఉన్నప్పుడు మీరు ఎన్ని చుక్కలు తినవచ్చు?

గర్భవతిగా ఉన్నప్పుడు మీరు ఎన్ని చుక్కలు తినవచ్చు?

మీరు మొదట మితంగా తీసుకునే వరకు అద్భుతంగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెలో 8.6 గ్రాముల ఫ్రక్టోజ్ అనే అంశం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం - ప్రతి రోజు 25 గ్రాముల లోపు ఉచిత చక్కెరలను తీసుకోవడానికి పరిమితం చేయాలి. ఇది రోజు లో ఎక్కువ తీసుకుంటే నష్టం కలుగుతుంది. అతిగా తీసుకుంటా అమృతం కూడా విషపూరితమైనదని గుర్తుంచుకోవాలి. ఇందులో అధిక చక్కెర పదార్థం ఉంటుంది. ఇది అన్ని ఆహారాలతో కలపకూడదు. మీరు డాక్టర్ సలహా ప్రకారం క్రమం తప్పకుండా తీసుకుంటే అంతా బాగుంటుంది.

English summary

Benefits Of Eating Honey During Pregnancy

A spoonful of honey has an abundance of dietary antioxidants. Stir some honey in your warm cup of adrak chai or perhaps mix some honey with lukewarm lemon water; these are great remedies to cure morning sickness or stuffy nose. Now, did you know, a tall glass of warm milk blended with honey can comfort heartburn and diarrhoea? Yes, that’s true. From indigestion to a sore throat, and from wounds to coughs – honey is the best natural ingredient that should be your kitchen staple during pregnancy.
Desktop Bottom Promotion