For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాధారణ సమయంలో ఓవర్ వెయిట్ తో భయపడేవారికి డైట్ ప్లాన్

గర్భాధారణ సమయంలో ఓవర్ వెయిట్ తో భయపడేవారికి డైట్ ప్లాన్

|

గర్భం అనేక విధాలుగా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కానీ గర్భధారణ సమయంలో మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే, ఇది తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉండాలని అర్ధం. ఆరోగ్య సంరక్షణ కోరినప్పుడు ఊబకాయం తరచుగా మహిళలందరినీ భయపెడుతుంది. అందువల్ల, ఆ భయాన్ని తొలగించడానికి తగిన జాగ్రత్త తీసుకోవాలి.

Diet Plans For Overweight Pregnant Women - Everything You Need To Know

గర్భధారణ సమయంలో అసౌకర్యాన్ని తగ్గించే విషయానికి వస్తే, మీరు గర్భధారణ సమయంలో ఊబకాయం పట్ల కూడా తగిన శ్రద్ధ వహించాలి. ఊబకాయానికి సరైన కారణాన్ని గుర్తించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో మరియు తరువాత వచ్చే అసౌకర్యాన్ని మనం పరిష్కరించవచ్చు. స్థూలకాయాన్ని తొలగించడానికి ఏ ఆహారంతో ప్రారంభించాలో చూద్దాం.

గర్భధారణ సమయంలో పొట్ట పెరుగుదల

గర్భధారణ సమయంలో పొట్ట పెరుగుదల

గర్భధారణ సమయంలో కొవ్వు పేరుకుపోవడం సహజం. ఇటువంటి పరిస్థిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కానీ సాధారణ పరిస్థితులలో ఎక్కువ ఊబకాయం ఉండకూడదు మరియు ఎమైనప్పటికీ కొంత కొవ్వు పెరుగుతుంది. కానీ గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యాన్ని చూసుకునేటప్పుడు ఎప్పుడూ ఊబకాయం అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి. గర్భధారణ సంబంధిత సమస్యలను నివారించడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. శిశువు యొక్క బరువు, రక్త ప్రవాహం, తల్లి పాలు ఉత్పత్తిని మరియు అమ్నియోటిక్ ద్రవం పెరగడం ఇవన్నీ గర్భధారణ సమయంలో గర్భిణీ యొక్క బరువును పెంచుతాయి.

ఇది గమనించవలసిన ముఖ్యం

ఇది గమనించవలసిన ముఖ్యం

ఊబకాయం నివారణకు గర్భధారణ సమయంలో తీసుకోవల్సిన అనేక జాగ్రత్తలు, విషయాలు ఉన్నాయి. ఊబకాయం వల్ల తరచుగా మీకు ఆకస్మిక సమస్యలను కలిగిస్తుంది. ఊబకాయం వల్ల గర్భాధారణ సమయంలో జస్టేషనల్ డయాబెటిస్, అకాల ప్రసవం మరియు డెలివరీ సమయంలో వచ్చే సమస్యలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ ఊబకాయం వల్ల కలిగేవని గ్రహించాలి. అయితే, దీన్ని తగ్గించడానికి గర్భధారణ సమయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం.

ఆహారపు అలవాట్లు

ఆహారపు అలవాట్లు

మీ ఆహారపు అలవాట్లను అకస్మాత్తుగా మార్చడం కష్టం. కానీ తరచుగా ఇది మీకు కొద్దిగా ఆందోళనకు కారణమవుతుంది. కానీ మీరు మీ ఆహారపు అలవాట్లను వెంటనే మార్చకుండా నెమ్మదిగా మార్చుకోవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే, మీ ఆహారంలో ప్రోటీన్ మరియు విటమిన్ మొత్తాన్ని తగ్గించకూడదు. ఇది మీలో సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి మీ ఆహారం తీసుకోవడంలో మార్పులను కొంచెం నెమ్మది నెమ్మదిగా మార్చుకోవడంలో తగిన జాగ్రత్తగా తీసుకోండి.

ఎక్కువ నూనె వాడటం

ఎక్కువ నూనె వాడటం

తరచుగా ఎక్కువ నూనె వాడటం వల్ల మీ ఆరోగ్యానికి విలన్ గా మారుతుంది. మీరు ఆలివ్ ఆయిల్, వెన్నను కూడా ఉపయోగించవచ్చు. కానీ కొబ్బరి నూనె వంటి కొవ్వు పదార్థాలు వాడకుండా జాగ్రత్త వహించండి. ఇది ఊబకాయం నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది, ఇది ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఇటువంటి ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించడానికి జాగ్రత్త వహించండి.

పండ్లు మరియు పండ్ల రసాలు పుష్కలంగా

పండ్లు మరియు పండ్ల రసాలు పుష్కలంగా

గర్భధారణ సమయంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అందువల్ల, మీ ఆహారంలో పండ్లు మరియు పండ్ల రసాలను చేర్చడం చాలా ముఖ్యం. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. ఇది ఊబకాయంలో ఆందోళను తొలగించడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అలాగే, మీ డైట్‌లో ఉప్పు తగ్గించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు ఎక్కువగా తినకూడదు. ఇది మీలో చాలా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

English summary

Diet Plans For Overweight Pregnant Women - Everything You Need To Know

Diet Plans For Overweight Pregnant Women - Everything You Need To Know
Desktop Bottom Promotion