For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!

స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!

|

గతంలో కంటే ఇప్పుడు సంతానోత్పత్తి రేటు చాలా వరకు పెరిగింది. చాలా మంది జంటలు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాతావరణ కాలుష్యం, తినే ఆహారంతో పాటు అండోత్సర్గ లోపాలు, మద్యం మరియు ధూమపానం వంటి అనేక కారకాలు సంతానోత్పత్తని ప్రభావితం చేస్తున్నాయి.

Fertility Diet : foods to consume for healthy fertility in telugu

ఈ పరిస్థితిలో సంతానం పొందడం కొంచెం కష్టమే. ఆ మధ్యన హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, సంతానం కలగాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం మరియు కొన్ని పోషకాహారాలను తప్పనిసరిగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. మీరు వయస్సు మరియు జన్యుశాస్త్రం వంటి అనియంత్రిత కారకాలను నియంత్రించినప్పుడు ఈ ఆహారాలు మీ గర్భం దాల్చే అవకాశాలను పెంచుతాయి. ఈ పోస్ట్‌లో, గర్భం పొందడానికి ప్రయత్నిస్తున్న వారు ఎలాంటి ఆహారాలను తినాలి మరియు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో చూద్దాం..

ఫోలేట్ మరియు విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు

ఫోలేట్ మరియు విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు

గర్భం పొందాలంటే అందుకు సహాయపడే ముఖ్యమైన విటమిన్లు, ప్రోటీన్స్, ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అలాంటి వాటిలో ఫోలేట్ ఒకటి. దీన్ని ఫోలిక్ యాసిడ్ ఆని కూడా పిలుస్తారు. దీన్ని డాక్టర్లు సప్లిమెంట్ రూపంలో సూచిస్తారు. ఎందుకంటే ఇందులో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది. మీరు గర్భవతి కావడానికి 3 నుండి 6 నెలల ముందు నుంచే ప్రతిరోజూ 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవచ్చు మరియు మీరు గర్భవతి అయ్యే వరకు 12 వారాల పాటు ప్రతిరోజూ తీసుకోవచ్చు.

మంచి ఆరోగ్యం కోసం ఆకు కూరలు ఎక్కువగా తినమని సలహా ఇస్తారు. కాబట్టి మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అవి మరింత ముఖ్యమైనవి కావడంలో ఆశ్చర్యం లేదు. ఆకుకూరల్లో కాలే మరియు బచ్చలికూర, పాలకూరలలో క్యాల్షియం, ఐరన్, విటమిన్ K మరియు ఫోలేట్ వంటి ప్రినేటల్ న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి, ఇవి శిశువు పుట్టుకతో వచ్చే లోపాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఆకు కూరలు విటమిన్ బి యొక్క గొప్ప మూలం, ఇది అండం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు అండోత్సర్గము పనిచేయకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

విటమిన్ సి ఆహారాలు

విటమిన్ సి ఆహారాలు

జామ, ఆరెంజ్, దానిమ్మలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్ మరియు సంతానోత్పత్తికి సహాయపడే అనేక ఇతర విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి. నారింజ, కివీస్, బ్లాక్‌బెర్రీస్, గూస్‌బెర్రీస్, జామ మరియు స్ట్రాబెర్రీ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి సంతానోత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషించే గర్భధారణ హార్మోన్ ప్రొజెస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. విటమిన్ సి స్పెర్మ్ ఆరోగ్యాన్ని మరియు చలనశీలతను మెరుగుపరుస్తుంది.

విటమిన్ D3 & సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు

విటమిన్ D3 & సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు

విటమిన్ డి యొక్క సహజ మూలం సూర్యకాంతి. రోజూ ఉదయం 15-30 నిముషాలు ఎండలో నిలబడితే శరీరానికి విటమిన్ డి పొందుతారు. అలాగే గుడ్లు విటమిన్ B మరియు D3 యొక్క గొప్ప మూలం. అల్పాహారం కోసం తీసుకునే గుడ్లలో కోలిన్‌ అధికంగా ఉంటుంది. ఇది పిండం అభివృద్ధిపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలలో చూపబడింది. విటమిన్ B గుడ్డు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, విటమిన్ D3 అండాశయాల ఉద్దీపన మరియు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. సెలీనియం గుడ్లలో కూడా కనిపిస్తుంది. ఒక ఉడికించిన గుడ్డులో 15 mcg విటమిన్ ఉంటుంది. ఇది స్త్రీ గుడ్ల చుట్టూ ఉండే ఫోలిక్యులర్ ద్రవానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. పురుషల్లో స్పెర్మ్ ఉత్పత్తి చేయడానికి సెలీనియం కూడా అవసరం; సెలీనియం మరియు విటమిన్ ఇ కలయిక స్పెర్మ్ నాణ్యత మరియు స్పెర్మ్ చలనశీలతను పెంచుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాలు

విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాలు

సీఫుడ్, సాల్మన్, మాంసాలు, పాల ఉత్పత్తులు మరియు గుడ్లలలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B12 అండోత్సర్గాన్ని పెంచడానికి మరియు గుడ్డు అభివృద్ధిని మెరుగుపరుస్తుంది.

కో-ఎంజైమ్ Q10

కో-ఎంజైమ్ Q10

ఈ మైటోకాన్డ్రియల్ పోషకం ఆడవారిలో అండాల్లో వృద్ధాప్యం ప్రభావాలను ఎదుర్కోవటానికి అధ్యయనాలలో చూపబడింది. తమ గర్భాశయంలోని అండాల నాణ్యతను మెరుగుపరచాలనుకునే మహిళలు ఈ పోషకాన్ని పరిగణించాలి. మాంసం, చికెన్, పంది మాంసం, కొవ్వు చేపలు, సోయాబీన్స్, కాయధాన్యాలు, నారింజ, బచ్చలికూర, కాలీఫ్లవర్, వేరుశెనగ మరియు నువ్వుల గింజలు కో-ఎంజైమ్ Q10 కు గొప్ప మూలం. పురుషులలో, ఇది స్పెర్మ్ కౌంట్ మరియు చలనశీలతను మెరుగుపరుస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు

పండ్లు మరియు కొన్ని రకాల గ్రీన్ వెంజిటేబుల్స్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి శరీరం నుండి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి, ఇవి గుడ్లు మరియు స్పెర్మ్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పుచ్చకాయలోని లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ స్పెర్మ్ చలనశీలతను ప్రోత్సహిస్తుంది. స్ట్రాబెర్రీలు, చెర్రీస్ మరియు బ్లూబెర్రీస్ వంటి బెర్రీలు అవసరమైన యాంటీఆక్సిడెంట్లతో పాటు ఫోలేట్ మరియు జింక్ కలిగి ఉంటాయి. మీ గర్భం దాల్చే అవకాశాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి..

మేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

మేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

సాల్మన్ , అవిసె గింజలలో ఒమేగా-3 మరియు ఒమేగా-6 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి, ఇవి గర్భం పొందాలని కోరుకునే వారికి హార్మోన్లను సమతుల్యం చేయడానికి అవసరం.ఇంకా అవిసె గింజలు సంతానోత్పత్తిని పెంచడానికి శక్తివంతమైన కలయిక. అవి లిగ్నాన్స్ అని పిలువబడే ఫైటోఈస్ట్రోజెన్‌లను (ప్లాంట్ ఈస్ట్రోజెన్‌లు) కలిగి ఉంటాయి, ఇవి శరీరాన్ని హానికరమైన జెనోఈస్ట్రోజెన్‌ల (ఈస్ట్రోజెనిక్ లక్షణాలతో కూడిన పర్యావరణ రసాయనాలు) నుండి రక్షిస్తాయి.

English summary

Fertility Diet : foods to consume for healthy fertility in telugu

Here is the list of foods to consume and avoid for healthy fertility.
Story first published:Tuesday, January 24, 2023, 11:17 [IST]
Desktop Bottom Promotion