For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణిలో Low BP మరియు High BP? వీటిలో శిశువుకు ఏది ప్రమాదకరం?? కారణాలు, చికిత్స!!

గర్భిణిలో Low BP మరియు High BP? వీటిలో శిశువుకు ఏది ప్రమాదకరం?? కారణాలు, చికిత్స!!

|

స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు, ఆమె చాలా విషయాల గురించి ఆందోళన చెందుతుంటుంది. ఆమె మనస్సులో అనేక అపోహాలు ఉంటాయి. వాస్తంగా చెప్పాలంటే ఇటువంటి సమయంలో గర్భిణి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఎప్పుడూ ఆందోళన చెందకూడదు.

గర్భిణీ స్త్రీలు గమనించవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. అధిక రక్తపోటు వలె, తక్కువ రక్తపోటు గర్భధారణ సమయంలో తల్లి లేదా బిడ్డను ప్రభావితం చేస్తుంది.

 కారణాలు

కారణాలు

అలర్జిక్ రియాక్షన్, ఇన్ఫెక్షన్స్, ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకోవడి, డీహైడ్రేషన్, పోషకాలలోపం, ఇంటర్నల్ బ్లీడింగ్, అనీమియా , పడుకోవడం, లేదా కూర్చోవడం లేదా నిలబడటం వంటి ఎక్కువ సమయం రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. హార్ట్ కండీషన్స్, ఎండోక్రైన్ డిసార్డర్స్ వంటివి గర్భిణీలో లోబిపికి ప్రధాన కారణాలు. ఈ కారణాల వల్ల శరీరంలో రక్త ప్రవాహం దెబ్బతింటుంది. గర్భధారణ సమయంలో రక్తపోటు తక్కువగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇతర కారణాలు:

ఇతర కారణాలు

ఇతర కారణాలు

విటమిన్ B-12 మరియు ఫోలేట్ సరైన మోతాదులో శరీరానికి అందాలి.లేదంటే అవసరానికి తగ్గట్టుగా రెడ్ బ్లడ్ సెల్స్ ని ఉత్పత్తి చేయలేకపోతుంది శరీరం.ఈ కారణంతో బిపి డౌన్ అయిపోతుంది.

ఏదైనా తీవ్రమైన గాయం వలన రక్తం మరీ ఎక్కువగా బయటపడితే ప్రమాదం.

శరీరంలో సరిపడ రక్తం లేకపోవడంతో లో బీపి వస్తుంది.* ఇంఫెక్షన్స్ శరీరానికి బలంగా తాకితే, దాన్ని సెప్టిసిమియా అని అంటారు.ఇలాంటి పరిస్థితులలో బ్లడ్ ప్రెషర్ ప్రాణాంతకంగా మారుతుంది.

నీళ్ళు తక్కువ తాగే అలవాటు ఉన్నా, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. అందుకే నీళ్ళు బాగా తాగాలి.

హైపోథైరాడిజమ్, హైపర్ థైరాడిజమ్ వంటి థైరాడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా లో బిపి వస్తుంది.

లక్షణాలు

లక్షణాలు

కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో తరచుగా వికారం పొందుతారు. కానీ గర్భధారణ సమయంలో సాధారణ అనస్థీషియా మరియు తక్కువ రక్తపోటు మధ్య తేడాను ఎలా గుర్తించాలి. దాని లక్షణాలు ఏమిటో చూద్దాం.

వికారం

దృష్టితో సమస్యలు

తలతిరగడం, ఆందోళన

సరిపడా నీళ్ళు తాగినా ఎక్కువ దాహం వేస్తుంది.

డిప్రెషన్ ఇవి లోబిపికి సంకేతాలు.

చికిత్స

చికిత్స

లోబిపికి ఎటువంటి వైద్య సహాయం అవసరం లేదు ఎందుకంటే దీనిని క్రింది సాధారణ పద్దతులతో సరిదిద్దవచ్చు:

ఏమి చేయవచ్చు?

ఏమి చేయవచ్చు?

మీరు లోబిపితో బాధపడుతుంటే డాక్టర్ సలహా మేరకు తగినన్నీ లిక్విడ్స్, వాటర్ తాగుతూ శరీరంను హైడ్రేషన్లో ఉంచాలి.

డాక్టర్ సలహా మేరకు కొన్ని సాధారణ వ్యాయామాలు చేయవచ్చు

హఠాత్తుగా ఏపనులు చేయకండి లేదా మంచం మీద నుండి లేవడం మానుకోండి.

మీరు ఉప్పు వాడకాన్ని సాధారణం కంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు.

English summary

Low Blood Pressure during Pregnancy

the blood pressure that gives a person the symptoms described below and not by a standard measurement.
Story first published:Friday, October 4, 2019, 15:10 [IST]
Desktop Bottom Promotion