Latest Updates
-
నిద్రలో పెద్దగా గురక పెడుతున్నారా? అయితే మీకు 71% గుండెపోటు ముప్పు ఉన్నట్లే! -
సొంత తమ్ముడి భార్యతోనే అన్న బహిరంగంగా ఆ పని చేయొచ్చు..ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా? -
చపాతీ,అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మటి పెరుగు-బెండకాయ కర్రీ చేసుకోండిలా.. -
శ్రీశైల అడవుల్లో అద్భుతం.. అమ్మవారి విగ్రహం నుదురు తాకితే మనిషిలా మెత్తగా..కోరిన కోర్కెలు తీర్చేస్తుంది! -
ఆదివారం అదిరిపోయే రుచి..స్పైసీ నెల్లూరు చికెన్ రోస్ట్..ప్లేట్లు కూడా నాకేస్తారు! -
మండే ఎండలకు చెక్.. వడదెబ్బను తరిమికొట్టే పచ్చి మామిడి - ఉల్లి చట్నీ! -
మేషం, సింహం, మకర రాశుల వారికి ఈ వారం అద్భుత యోగం.. మీ రాశి ఉందా? - 5 నుండి 11 ఏప్రిల్ 2026 వరకు -
తుల, మిథున, కుంభ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 05 ఏప్రిల్ 2026 -
Easter Sunday 2026 Wishes: రక్షకుడు జీవిస్తున్నాడు..మీ బంధుమిత్రులకు ఈస్టర్ 2026 విషెస్ ఇలా అందంగా చెప్పండి -
శనగపిండి, కీర దోసకాయ ఉంటే చాలు..10 నిమిషాల్లో క్రిస్పీ దోశ..ఎలా చేసుకోవాలంటే..
స్టవ్ వెలిగించే పనే లేదు..5 నిమిషాల్లో స్పైసీ బెంగాలీ ఝల్ మురి చేసుకోండిలా..
సాయంత్రం పూట లేదా టీ తాగుతున్న సమయంలో.. అకస్మాత్తుగా ఏదైనా కారంగా, పుల్లగా, కరకరలాడుతూ తినాలనిపిస్తుంది. కానీ వంటగదిలో గంటల తరబడి కష్టపడటం, నూనె వంటకాలు చేయడం ఇష్టం ఉండదు. అలాంటి సమయాల్లో వెంటనే గుర్తొచ్చే, అత్యంత సులభంగా చేసుకోగలిగే అద్భుతమైన చిరుతిండి ఝల్ మురి.
బెంగాల్ వీధుల్లో, ముఖ్యంగా కోల్ కతా నగరంలో దొరికే ఈ ఝల్ మురి రుచికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, దీని తయారీకి ఎలాంటి ఖరీదైన పదార్థాలు అవసరం లేదు. మన ఇంట్లో నిత్యం ఉండే సాధారణ పదార్థాలతోనే దీనిని చాలా వేగంగా తయారు చేసుకోవచ్చు. బెంగాలీ స్టైల్ ఝల్ మురి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
బెంగాలీ స్టైల్ ఝల్ మురి తయారీకి కావలసిన పదార్థాలు
కరకరలాడే మరమరాలు - 2 కప్పులు
బంగాళదుంప - 1
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1
సన్నగా తరిగిన టమాటో - 1
వేయించిన పల్లీలు- 2 టేబుల్ స్పూన్లు
వేయించిన శనగలు - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి ముక్కలు - కొద్దిగా
పచ్చిమిర్చి - 1
తాజా కొత్తిమీర - కొద్దిగా
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
ఆవ నూనె (మస్టర్డ్ ఆయిల్) - 1 టేబుల్ స్పూన్
ఉప్పు-రుచికి సరిపడా
కారం, వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్ చొప్పున
చాట్ మసాలా - అర టీస్పూన్
బెంగాలీ స్టైల్ ఝల్ మురి తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటో ముక్కలు, వేయించిన శనగలు, వేయించిన పల్లీలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి స్పూన్ తో బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమంలో కరకరలాడే మరమరాలను వేయండి. మరమరాలు విరిగిపోకుండా చాలా సున్నితంగా కలపాలి.
-ఆ తర్వాత, ఝల్మురికి అసలైన వీధి రుచిని తీసుకొచ్చే ఆవ నూనెను పైన చల్లండి. దీంతో పాటు ఉప్పు, నల్ల ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి మసాలాలన్నీ మరమరాలకు పట్టేలా పైకి కిందకి ఎగురవేస్తూ కలపండి.
-చివరగా ఈ మిశ్రమంపై తాజా నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లండి. అంతే నోరూరించే స్పైసీ బెంగాలీ ఝల్ మురి సిద్ధం.
-ఝల్ మురి కరకరలాడుతూ ఉండాలంటే నిమ్మరసం, మరమరాలు ఎప్పుడూ తినే ముందు మాత్రమే కలపాలి. ఆవనూనె వాడటం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే దాని ఘాటు వల్లే ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచి వస్తుంది. మరింత క్రంచీగా కావాలంటే పైన సన్నటి కారప్పూస (సేవ్) చల్లుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












