Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
ఆంధ్రా ఫేమస్ బిర్యానీ ఇదే..దీన్ని తినకుంటే జీవితమే వేస్ట్!
బిర్యానీ అంటే బోలెడు వెరైటీలు ఉంటాయి. అందులో ఉలవచారు బిర్యానీ ఒకటి. ఉలవచారు బిర్యానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన ఒక ప్రత్యేకమైన, రుచికరమైన వంటకం. ముఖ్యంగా దీనిని ఏపీ స్పెషల్ రెసిపిగా చెప్తుంటారు. ఇది ఉలవచారు,బిర్యానీ మసాలా దినుసులను ఉపయోగించి తయారు చేయబడుతుంది. ఈ వంటకం దాని ప్రత్యేకమైన రుచి, సువాసనతో ప్రజలను ఆకర్షిస్తుంది. ఇటీవల ఓ సందర్భంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా తనకు ఇస్టమైన బిర్యానీ అంటే ఉలవచారు బిర్యానీనే అన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఓ సందర్భంలో ఉలవచారు బిర్యానీ విజయవాడ స్పెషల్ అని చెప్పారు.
ఉలవచారు బిర్యానీ రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు అందిస్తుంది. ఉలవచారు బిర్యానీని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఉలవచారు బిర్యానీని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
ఉలవచారు: 2 కప్పులు
బాస్మతి బియ్యం: 2 కప్పులు
టమోటాలు: 2
కారం: 1 టీస్పూన్
పసుపు: 1/2 టీస్పూన్
నూనె: 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టీస్పూన్లు
బిర్యానీ మసాలా: 2 టీస్పూన్లు
కొత్తిమీర: కొద్దిగా
పుదీనా: కొద్దిగా
ఉలవచారు బిర్యానీ తయారీ విధానం
-ఉలవచారు బిర్యానీ తయారుచేయడానికి ముందుగా ఉలవలను శుభ్రంగా కడిగి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి.
-నానిన ఉలవలను కుక్కర్ లో వేసి తగినంత నీళ్లు పోసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.
-ఉడికిన ఉలవలను చల్లారనిచ్చి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి.
-ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన టమోటాలు, బిర్యానీ మసాలా, కారం, పసుపు, ఉప్పు వేసి ఆయిల్ పైకి తేలే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల మిశ్రమాన్ని బాగా కలిపి నానబెట్టిన బాస్మతి బియ్యం, తగినంత నీరు పోసి మూత పెట్టి బియ్యం ఉడికే వరకు ఉడికించాలి.
-బియ్యం ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. అంతే ఉలవచారు బిర్యానీ రెడీ.
-వేడి వేడి ఉలవచారు బిర్యానీని రైతాతో కలిపి తింటే నోటికి స్వర్గాన్ని అందించినట్లే.
పెసరపప్పుతో హల్వా..మండుటెండల్లో తింటే శరీరానికి చలువ,ఎలా చేయాలంటే
ఉలవచారు బిర్యానీ ప్రయోజనాలు
ఉలవచారు బిర్యానీలో ఉలవలు ప్రధాన పదార్థం కాబట్టి, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఉలవల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉలవలు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీర బరువును తగ్గించడంలో సహాయపడతాయి. కిడ్నీలో రాళ్ళను కరిగించే గుణం ఉలవచారుకి ఉంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications