ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్

Posted By:

ఇడ్లీ, దోశల్లోకి కాంబినేషన్‌గా రొటీన్‌ గా కొబ్బరి పచ్చడి, పల్లి చట్నీ లేదా సాంబార్ చేసుకుంటాం. అప్పుడప్పుడు ఇడ్లీ కారం పొడితో సరిపెట్టేస్తాం. కానీ ఎప్పుడైనా ఇడ్లీ, దోసెల్లోకి ఉల్లి కారం ట్రై చేశారా? ఇది టిఫిన్స్ తో పాటు వేడి వేడి అన్నంలోకే బాగుంటుంది.

ఉల్లిపాయ కారం తయారు చేయడం చాలా సులువు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. స్పైసీ అండ్ టేస్టీ ఉల్లిపాయ కారం ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Andhra Special Ulli Karam Super Side Dish For Tiffins

ఉల్లిపాయ కారం తయారీకి కావలసిన పదార్థాలు

వేయించి రుబ్బుకోవడానికి
సాంబార్ ఉల్లిపాయలు- అర కిలో
మెంతులు - పావు టీస్పూన్
ఆవాలు - పావు టీస్పూన్
నువ్వుల నూనె- 2 టేబుల్ స్పూన్లు
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజులో సగం
తాలింపు కోసం
నువ్వుల నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఆవాల పొడి - అర టీస్పూన్
మెంతుల పొడి (లేదా మెంతులు) - పావు టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - అర టేబుల్ స్పూన్
తగినంత ఉప్పు
బెల్లం - అర టేబుల్ స్పూన్

నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..

ఉల్లిపాయ కారం తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఓ మందపాటి బాండీ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడే వరకు వేయించండి.

-ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలను వేసి, అవి కాస్త రంగు మారి పారదర్శకంగా అయ్యేవరకు బాగా వేయించుకోండి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా చింతపండు వేసి, మంటను మీడియంలో పెట్టి మరో 2 నిమిషాల పాటు కలపండి.
ఈ మిశ్రమాన్ని స్టవ్ పైనుంచి దించి, పూర్తిగా చల్లారనివ్వండి.

-చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ లో వేసి, నీళ్లు అస్సలు పోయకుండా కాస్త బరకగా (కోర్స్‌గా) రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు మళ్లీ అదే బాండీలో తాలింపు కోసం 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి.

-నూనె కాగాక ఆవాల పొడి, మెంతి పొడి, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కారం వేసి మంటను పూర్తిగా సిమ్‌ లో ఉంచి బాగా కలపండి. వెంటనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ గుజ్జును ఇందులో వేసి నూనెలో బాగా కలిసేలా వేయించండి. అవసరమైతే మధ్యలో మరో స్పూన్ నూనె వేసుకోవచ్చు.

-పచ్చడిలోని పచ్చివాసన పోయిన తర్వాత, చివరగా కొద్దిగా బెల్లం తురుము వేసి బాగా కలపండి. బెల్లం కరిగి, పచ్చడి ముద్దగా మారి చుట్టూ నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి.

-అంతే ఘుమఘుమలాడే ఉల్లిపాయ కారం రెడీ. పూర్తిగా చల్లారిన తర్వాత ఓ పొడి గాజు సీసాలో నిల్వ చేసుకోండి.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 29, 2026, 13:41 [IST]
Desktop Bottom Promotion