అన్నం,చపాతీ ఎందులోకైనా అదిరిపోయే వంకాయ మామిడిపప్పు..ఎలా చేసుకోవాలో చూడండి

Posted By:

వంకాయ మామిడికాయపప్పు టేస్ట్ లో ది బెస్ట్ గా ఉంటుంది. ఇలాంటి రుచికరమైన పప్పు ఇంతకుముందెన్నడూ చూడలేదు అన్నట్లుగా ఉంటుంది. చేసే తీరులోనే దీని అసలైన రుచి దాగి ఉంటుంది. దీనిని చాలా సింపుల్ గా తక్కువ సమయంలోనే ఇంట్లో తయారుచేసుకోవచ్చు. పిల్లలు,పెద్దలు అందరికీ సూపర్ గా నచ్చేస్తుంది. వంకాయ మామిడికాయ పప్పుని తయారుచేసుకోడారికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

వంకాయ మామిడికాయ పప్పు తయారీకి కావలసిన పదార్థాలు
-తెల్ల వంకాయలు
మామిడికాయ ముక్కలు
-ఎండు మిర్చి
-టమాటో
-పచ్చిమిర్చి
-కందిపప్పు
-జీలకర్ర
-ఆవాలు
-కరివేపాకు
-కొత్తిమీర
-ఇంగువ
-పచ్చి శెనగపప్పు
-దంచిన వెల్లుల్లి
-ఉల్లిపాయ
-ఆయిల్

Andhra special vankaya mamidikaya pappu recipe in telugu

తయారీ విధానం

-ముందుగా ముప్పావు కప్పు కందిపప్పుని అరగంట సేపు నానబెట్టాలి.

-తర్వాత కుక్కర్ లో నానబెట్టిన కందిపప్పు, 5 పచ్చిమిర్చి ముక్కలు, పొడవుగా కట్ చేసిన 3 తెల్ల వంకాయల ముక్కలు, 1 టామటో ముక్కలు, కొద్దిగా పసుపు, రెండున్నర కప్పుల నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మంటను మీడియంలోనే ఉంచాలి.

=తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో చెక్కు తీసిన అరకప్పు పచ్చి మామిడికాయ ముక్కలు వేసి ఇందులోనే కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించి దించి పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు మెత్తగా ఉడికించిన మామిడికాయ గుజ్జుని, కొద్దిగా ఉప్పుని పప్పులో వేసి పప్పు గుత్తితో మెత్తగా ఇనపాలి.

రాయలసీమ పల్లెల స్పెషల్ బెండకాయ బజ్జీ..టేస్ట్ లో తిరుగుండదు అంతే..ఎలా చేసుకోవాలంటే..

-తర్వాత పాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి ఇందులో రెండు ఎండుమిర్చి ముక్కలు వేసి నల్లబడ్డాక అందులో 1 టీస్పూన్ ఆవాలు, కొద్దిగా పచ్చి శెనగపప్పు, 7 దంచిన వెల్లుల్లి,అర టీస్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి వేపాలి. తర్వాత ఇందులో 1 ఉల్లిపాయ తరుగు వేసి మెత్తబడిన తర్వాత కొద్దిగా పసుపు,కారం వేసి వేపి ఇందులో మెత్తగా ఉడికించిన పప్పు పోసి కలిపి రెండు మూడు పొంగులు రానివ్వాలి.

-తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి. అంతే నోరూరించే వంకాయ మామిడికాయ పప్పు రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, April 26, 2025, 20:06 [IST]
Desktop Bottom Promotion