Latest Updates
-
ఈరోజు రాశి ఫలాలు (23.03.26): వృషభ రాశిలో చంద్రుడి సంచారం.. ఆ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
శ్రీరామనవమి 2026 తేదీ, పూజా ముహూర్తం,శక్తివంతమైన శ్రీరామ మంత్రాలు -
ప్రేమలో మంకీ బ్రాంచింగ్.. డేటింగ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ సరికొత్త ద్రోహం గురించి మీకు తెలుసా? -
సాయంత్రం టీ టైమ్‌లో కరకరలాడే శనగపిండి కారప్పూస.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా! -
సాయంత్రం స్నాక్ గా కరకరలాడే చికెన్ పకోడి.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
డయాబెటిస్ ఉందా? అయితే మీరు రోజూ ఎంతసేపు నడవాలో తెలుసా? -
ఘుమఘుమలాడే మంగళూరు చికెన్ సుక్కా.. ఒక్కసారి వండితే ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ కావాలంటారు! -
బంపర్ ఆఫర్: ఫ్రీగా ఫిన్ లాండ్ వెళ్లే ఛాన్స్..ఒక్క రూపాయి లేకుండా 7 రోజుల ట్రిప్..పూర్తి వివరాలు చూడండి.. -
Weekly rasi phalalu (22 నుండి 28 మార్చి): ఈ రాశుల వారికి అదృష్టం వరించబోతోంది, మీ రాశి ఉందేమో చూడండి! -
ఆరోగ్యానికి అమృతం లాంటి నల్ల నువ్వుల లడ్డూ..ఇలా చేసి రోజుకొకటి తింటే జుట్టు రాలడం, PCOD పరార్!
అచ్చమైన పల్లెటూరి స్టైల్ పచ్చి మామిడికాయ చట్నీ..చపాతీ, రోటీ, అన్నం దేనిలోకైనా అదుర్స్!
మామిడి కేవలం పండిన తర్వాత వచ్చే తీయని, రసవంతమైన రుచికి మాత్రమే కాదు.. పచ్చిగా ఉన్నప్పుడు కూడా తనదైన అద్భుతమైన రుచిని, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పల్లెటూళ్లలో అయినా, పట్టణాల్లో అయినా పచ్చి మామిడికాయతో చేసే వంటకాలకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా పచ్చి మామిడికాయ చట్నీ పేరు చెబితేనే నోళ్లలో నీళ్లు ఊరుతాయి.
ఒక్కసారి పల్లెటూరి స్టైల్ మామిడి చట్నీ రుచి చూశారంటే మరే ఇతర పచ్చడిని మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని, ఈ చట్నీ కలుపుకుని తింటే ఆ మజానే వేరు. రోటీలు, చపాతీలతో సైడ్ డిష్ గా కూడా ఆస్వాదించవచ్చు. రుచి మాత్రమే కాదు, పచ్చి మామిడిలో విటమిన్-A, విటమిన్-C, డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవి తాపం నుండి శరీరాన్ని రక్షించి, చల్లగా, తేమగా ఉంచుతాయి.
పచ్చి మామిడికాయ చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
పుల్లటి పచ్చి మామిడికాయలు - 2
ఉల్లిపాయ - 1
కశ్మీరీ ఎండు మిరపకాయలు- 3
జీలకర్ర - 1 టీస్పూన్
తాజా కొత్తిమీర - 1 కట్ట
వెల్లుల్లి రెబ్బలు- 10
బ్లాక్ సాల్ట్- అర టీస్పూన్
తెల్ల ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి మామిడికాయ చట్నీ తయారీ విధానం
-ముందుగా రెండు పచ్చి మామిడికాయలను తీసుకుని, వాటిపై ఉన్న మురికి పోయేలా నీటిలో శుభ్రంగా కడగాలి.
-కడిగిన మామిడికాయలను ఒక పొడి వస్త్రంతో తడి లేకుండా తుడిచి మామిడికాయల తొక్కను పూర్తిగా తీసేయాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయ, ఎండు మిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర ఆకులు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా, కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటే చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది.
-గ్రైండ్ చేసుకున్న మామిడి చట్నీ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో అర టీస్పూన్ నల్ల ఉప్పు, మీ రుచికి సరిపడా సాధారణ తెల్ల ఉప్పు వేసి బాగా కలపాలి. నల్ల ఉప్పు వల్ల చట్నీకి ఒక ప్రత్యేకమైన పల్లెటూరి ఫ్లేవర్ వస్తుంది.
-అంతే ఎంతో కమ్మగా, పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే నోరూరించే పచ్చి మామిడికాయ చట్నీ రెడీ. దీన్ని గాలి చొరబడని డబ్బాలో తీసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటే రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












