చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్..అరటికాయ బఠాణీ కుర్మా ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు!

Posted By:

సాధారణంగా మనకు కుర్మా అనగానే ముందుగా బంగాళదుంప గుర్తుకువస్తుంది. కానీ బంగాళదుంపలు లేకుండా అరటికాయతో కుర్మా చేస్తే అదిరిపోతుంది.

అరటికాయకు పచ్చి బఠాణీలను జోడించి చేసే అరటికాయ బఠాణీ కుర్మా చపాతీ, పూరీ, బిర్యానీ లేదా వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. ఇది కేవలం రుచిని మాత్రమే కాదు, అద్భుతమైన పోషక విలువలను కూడా అందిస్తుంది. అరటికాయతో బఠాణీ కుర్మా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Best Combo for Chapathi and Puri s Tasty Banana Peas Kurma Recipe in Telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు

-పచ్చి అరటికాయ
-ఉల్లిపాయ
-కారం
-ఉప్పు
-పసుపు
-పచ్చిమిర్చి
-అల్లం
-జీలకర్ర
-ఆయిల్
-యాలకలు
-లవంగ మొగ్గలు
-మిరియాలు
-దాల్చిన చెక్క
-బిర్యానీ ఆకు
-జీడిపప్పు
-ఖర్బూజ గింజలు
-వెల్లుల్లి రెబ్బలు
-ఎండుకొబ్బరి తురుము
-టమాటో
-జీలకర్ర పొడి
-ధనియాల పొడి
-పచ్చి బఠాణీ

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యండి.

-వేడెక్కిన ఆయిల్ లో అంగుళంన్నర దాల్చిన చెక్క, 4 యాలకలు, 4 లవంగ మొగ్గలు, అర టీస్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు వేసి వేయించాలి.

-తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఖర్బూజ గింజలు వేసి వేపండి.

-ఖర్బూజ గింజలు చిట్లడం మొదలవ్వగానే అందులో 10 వెల్లుల్లి రెబ్బలు, అంగుళంన్నర అల్లం వేసి వేపండి. తర్వాత ఇందులో రెండు చెంచాల ఎండుకొబ్బరి తురుము వేసి వేయించాలి.

-ఇప్పుడు అందులో అర కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి అవి ఎర్రబడేదాకా వేయించాక అందులో 1 కప్పు టమాటో ముక్కలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి. టమాటో ముక్కలపై స్కిన్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపేయండి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన మిశ్రమం మొత్తం వేసి, తగినన్ని నీళ్లు కలుపుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద మళ్లీ పాన్ పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో పావు టీస్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయల సన్నని తరుగు వేసి వేయించాక ఇందులోనే 2 పచ్చి అరటికాయల ముక్కలు(క్యూబ్స్ లా కట్ చేయండి)వేయండి.

-మూతపెట్టి 4 నిమిషాలు అరటికాయ ముక్కలను వేయించాలి. తర్వాత మూత తీసి మరో 10 నిమిషాలు మగ్గించాలి.

-అరటికాయ ముక్క మెత్తగా అయిన తర్వాత అందులో 1/3 కప్పు పచ్చి బఠాణీ, అర టేబుల్ స్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు కప్పు నీళ్లు పోసి మూతపెట్టి బఠాణీ మెత్తబడేదాకా మగ్గించాలి.

-బఠాణీ మెత్తబడిన తర్వాత ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించాలి.

-కూర ఉడుకు పట్టడం మొదలైనప్పుడు మూత తీసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. అప్పుడు అందులో 1 టీస్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర తరుగు వేసి కలిపి మరో 3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయండి. అంతే సూపర్ టేస్టీ అరటికాయ బఠాణీ కుర్మా రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, February 3, 2026, 8:30 [IST]
Desktop Bottom Promotion