Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవాళ్లకు పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపి..చేసుకోవడం చాలా సింపుల్
బరువు తగ్గాలనే ప్రయత్నంలో చాలామంది రకరరకాల రెసిపిలను ప్రయత్నిస్తుంటారు. అయితే ఆరోగ్యంగా బరువు తగ్గించే రెసిపిలు కొన్నే ఉంటాయి. అలాంటివాటిల్లో ముందువరుసలో ఉంటుంది చియా పుడ్డిండ్. ఇది తయారు చేయడం చాలా సులభం, రుచికరమైనది,అత్యంత పోషక విలువలను కలిగి ఉంటుంది. ఆరోగ్యంగా పోషకాలు అందుకుంటూ బరువు తగ్గాలనుకుంటే చియా పుడ్డింగ్ బెస్ట్ ఆప్షన్ ఇది.
చియా గింజలను పాలలో నానబెట్టినప్పుడు అవి తమ బరువు కంటే 10-12 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుని జెల్లీ లాంటి లేదా పుడ్డింగ్ లాంటి పదార్థంగా మారతాయి. దీనికి రుచి కోసం తేనె, బెల్లం లేదా పండ్లు, నట్స్ లేదా ఇతర పదార్థాలను జోడించి చియా పుడ్డింగ్ తయారు చేస్తారు. ఇది సాధారణంగా రాత్రిపూట తయారుచేసి, ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్ గా తింటారు. పొద్దున్నే హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినాలనుకున్నా లేదా హడావుడిలో బ్రేక్ ఫాస్ట్ చేసే టైం లేని వారికి కూడా చియా పుడ్డింగ్ మంచి ఛాయిస్.
చియా పుడ్డింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-చియా సీడ్స్
-కొబ్బరి
-కివి,సపోటా లేదా నచ్చిన ఫ్రూట్స్
-ఖర్జూరం
-బాదం
-తేనె
చియా పుడ్డింగ్ తయారీ విధానం
-ముందుగా 1 తాజా కొబ్బరికాయను ముక్కలుగా చేసుకోండి. 2 కప్పుల కొబ్బరి ముక్కలు(320-340 గ్రా) ఉండేలా చూసుకోండి.
-కొబ్బరి ముక్కలను చిన్న చిన్నవిగా కట్ చేసి వీటిని మిక్సీ బ్లెండర్ లో వేసి,ఇందులో 1 కప్పు నీళ్లు(250 ml) హై స్పీడ్ మీద బ్లెండ్ చేయాలి.
-తర్వాత బ్లెండ్ చేసి కొబ్బరి మిశ్రమాన్ని ఓ మస్లిన్ క్లాత్ లో వేసి గిన్నెలోకి పిండుకుంటే చిక్కని కొబ్బరి పాలు వస్తాయి. వీటినే ఫస్ట్ ఎక్స్ ట్రాక్ట్ కోకోనట్ మిల్క్ అంటారు. ఆ మిగిలిన పిప్పిలో ఇంకొంచెం నీళ్లు గ్రైండ్ చేస్తే వచ్చేదాన్ని సెకండ్ ఎక్స్ ట్రాక్స్ పాలు అంటారు.
-ఇప్పుడు ఒక గిన్నెలో 120 గ్రాముల రెడీ చేసుకున్న కొబ్బరి పాలు వేసి ఇందులోనే 20 గ్రాముల చియా విత్తనాలు(8 టేబుల్ స్పూన్లు)వేసి స్పూన్ తో 1 నిమిషం కలబెడుతూ ఉండాలి. చియాసీడ్స్ పాలలో పూర్తిగా కలిసిపోయాక ఇందులోనే 2 టీస్పూన్ల తేనె వేసి బాగా కలిపాక 3 ఖర్జూరాలను కట్ చేసి వేసుకొని బాగా కలపండి.
-తర్వాత కలుపుకున్న పాల మిశ్రమాన్ని నాలుగు సగాలుగా బాటిల్స్ లో పోసి మూతపెట్టేయండి.దీనిని రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టండి.
-తర్వాత ఉదయం దాన్ని బయటకు తీసి అందులో కొన్ని వేయించిన బాదం పలుకులు కివీ,సపోటా, లేదా మీకు నచ్చిన ఫ్రూట్ ముక్కలు వేసేయండి. అంతే చియా పుడ్డింగ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










