Latest Updates
-
కాఫీ, టీలు ఎక్కువ తాగుతున్నారా? అయితే ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
రొటీన్ మటన్ కూరలతో బోర్ కొట్టిందా? అయితే ఈ రంజాన్ కు క్రీమీ ఆఫ్ఘానీ మటన్ ట్రై చేయండి..డబుల్ మజా! -
ఈద్ ఉల్ ఫితర్ 2026..మీ బంధుమిత్రులకు రంజాన్ విషెస్ ఇలా అందంగా చెప్పండి! -
ఈరోజు రాశి ఫలాలు (21.03.26): శని దేవుని అనుగ్రహం ఎవరిపై ఉంటుంది? మీ జాతకం ఇక్కడ చూడండి! -
మష్రూమ్ చికెన్ మసాలా..కిర్రాక్ టేస్ట్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె లేకుండా 'దహీ భల్లా'.. రుచికి రాజీ లేదు, ఆరోగ్యానికి డోకా లేదు! -
ఉదయాన్నే పరగడుపున కుంకుమపువ్వు నీరు తాగితే... మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
ఈరోజు రాశి ఫలాలు (20.03.26): శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం!
నోరూరించే భాయ్ స్టైల్ చికెన్ బిర్యానీ.. మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
దరికీ ఇష్టమైన ఆహారం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు బిర్యానీ. రోజురోజుకూ బిర్యానీ ప్రియుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే హోటళ్లలో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని రకాల బిర్యానీలు తిన్నా, మన ముస్లిం సోదరులు (భాయ్) ఇంట్లో వండే బిర్యానీ రుచికి ఏదీ సాటిరాదు.
ఆ గుమగుమలు, ఆ అద్భుతమైన రుచి.. అలాంటి ఇంట్లో వండిన బిర్యానీ తినే అదృష్టం అందరికీ దొరకకపోవచ్చు. కానీ ఇవాళ రంజాన్ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా అచ్చం భాయ్ వాళ్ల ఇంట్లో చేసే రుచికరమైన చికెన్ బిర్యానీని మీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు
నూనె - 1/4 కప్పు
నెయ్యి - 1/4 కప్పు
బిర్యానీ ఆకులు - 3
లవంగాలు - 5
దాల్చిన చెక్క - 2 ముక్కలు
యాలకులు - 4
అనాస పువ్వు- 1
రాతి పువ్వు - కొద్దిగా
జాపత్రి - 1
జాజికాయ పొడి - చిటికెడు
షాజీరా - 1 టీస్పూన్
సోంపు - అర టీస్పూన్
జీలకర్ర సంబా బియ్యం - 2 కప్పులు
చికెన్ - 1 కిలో
నీళ్లు - 4 కప్పులు
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 2 కప్పులు
టమాటాలు - అర కప్పు
పచ్చిమిర్చి - 6
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పుదీనా ఆకులు - పావు కప్పు
కొత్తిమీర - పావు కప్పు
పెరుగు - పావు కప్పు
పసుపు - అర టీస్పూన్
కారం - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ తయారీ విధానం
-ముందుగా జీలకర్ర సంబా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలాగే చికెన్ ను కూడా కడిగి కొద్దిగా ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న బిర్యానీ గిన్నె పెట్టి అందులో నూనె, నెయ్యి వేడి చేయాలి. అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, షాజీరా, సోంపు వేసి దోరగా వేయించాలి.
-మసాలా దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి బంగారు రంగులోకి మారేంత వరకు వేయించాలి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్, టమాటాలు, పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. చికెన్ కాస్త మగ్గాక, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి, 4 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి బాగా మరిగించాలి.
-ఎసరు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన జీలకర్ర సంబా బియ్యాన్ని అందులో వేసి పెద్ద మంట మీద 6 నుండి 7 నిమిషాల పాటు ఉడికించాలి.
-బియ్యం నీటిని పీల్చుకుని అన్నం సుమారు 60 శాతం ఉడికిన తర్వాత అందులో నిమ్మరసం వేసి నెమ్మదిగా కలపాలి.
-ఇప్పుడు అసలైన దమ్ ప్రక్రియ. మంటను పూర్తిగా తగ్గించి, గిన్నెపై ఆవిరి బయటకు పోకుండా గట్టిగా మూత పెట్టాలి. ఇలా 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
-ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తెరవకుండా మరో 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. గిన్నెలో ఉన్న వేడికి బిర్యానీ పర్ఫెక్ట్ గా మగ్గుతుంది.
-చివరగా మూత తీసి పైన 3 స్పూన్ల నెయ్యి, కొద్దిగా కొత్తిమీర చల్లి, అన్నం మెతుకులు విరిగిపోకుండా సున్నితంగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










![వారపు రాశి ఫలాలు [19 నుండి 26 మార్చి]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? మీ రాశి ఫలాలు ఇక్కడ చూడండి!](https://images.boldsky.com/fit-in/400x225/te/img/2026/03/today-rasi-phalalu-for-all-12-zodiac-signs-19-mar-2026.jpg)


