Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
Rava Pongal: కర్ణాటక స్టైల్ రవ్వ పొంగలి..టేస్ట్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే,ఆరోగ్యం కూడా..ఎలా చేసుకోవాలంటే
రవ్వ పొంగలిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరులో తయారుచేస్తుంటారు. అయితే కర్ణాటకలో తయారుచేసే రవ్వ పొంగలి ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అదే కావాలని కోరుకుంటారు. అంత రుచికరంగా ఉంటుంది. దీని టేస్ట్ ఎన్ని రోజులైనా నాలుకమీద నుంచి పోదు. వేడి వేడిగా ఈ రవ్వ పొంగలి తింటుంటే ఆ మజానే వేరు. పొద్దున్నే ఇడ్లీ,దోశ,బోండా,పూరీ వంటివి మానేసి ఇది తింటే రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. చాలా టేస్టీగా ఉండే కర్ణాటక స్టైల్ రవ్వ పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
రవ్వ పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-గోధుమ నూక
-ఉప్పు
-పచ్చిమిర్చి
-జీడిపప్పు
-కరివేపాకు
-మిరియాలు
-నెయ్యి
-నీళ్లు
-పచ్చి కొబ్బరి ముక్కలు
-అల్లం తురుము
-ఇంగువ
-జీలకర్ర

కర్ణాటక స్టైల్ రవ్వ పొంగలి తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఓ బాండీ పెట్టి అందులో పావుకప్పు పెసరపప్పు వేసి సన్నని సెగమీద మంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేయించుకోవాలి.
-పెసరపప్పు రంగు మారుతున్న సమయంలో దించేసి దానిని కుక్కర్ లో వేసేయండి. కుక్కర్ లో 1 కప్పు నీళ్లు కూడా పోసి మూతపెట్టేసి మీడియం మంట మీద 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికాక దించేయండి.
-తర్వాత స్టవ్ మీద బాండీపెట్టి అందులో 1 కప్పు గోధుమ నూక వేసి సన్నని సెగమీద మంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.
-రవ్వ రంగుమారి తెల్లగా అవడం ప్రారంభమైనప్పుడు దించేసి దానిని వేరే ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 5 కప్పుల నీళ్లు,రుచికి సరిపడా ఉప్పు వేసి ఎసరును తెర్లకాగనివ్వండి.
Kova bobbatlu: కాకినాడ స్పెషల్ కోవా బొబ్బట్లు..అద్భుతమైన రుచి, ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
-ఎసరు బాగా కాగిన తర్వాత వేయించిన గోధుమరవ్వను కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ నూకను మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి.
-కొంచెం జారుగా ఉన్న టైంలో అందులో ఉడికించిన పెసరపప్పు వేసి కలిపి మంటను సిమ్ లో పెట్టేయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టి అందులో 6 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించాక ఇందులో అర టీస్పూన్ మిరియాలు వేసి చిట్టనివ్వాలి. అప్పుడు అందులో అర టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు కప్పు జీడిపప్పు వేసి వేయించాలి. జీడిపప్పు రంగు మారడం స్టార్ట్ అయినప్పుడు అందులో 2 పచ్చిమిర్చి చీలికలు, అర టేబుల్ స్పూన్ అల్లం తరుము ,పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అర టీస్పూన్ ఇంగువ, రెండు రెమ్మల కరివేపాకు వేసి వేపుకోవాలి.
-వేగిన తాళింపుని ఉడికిన పొంగలిలో వేసి కలపాలి. అంతే రవ్వ పొంగలి రెడీ. దీన్ని వేడివేడిగా చట్నీతో లేదా సాంబార్ తింటే నోట్లో బ్లాస్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications