శ్రీలంక ఫేమస్ యెల్లో రైస్..ముద్ద నోట్లో పెట్టుకుంటే కేక ఉంది అంటారు..మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

మన పొరుగు దేశం శ్రీలంక ప్రకృతి సౌందర్యానికి ఎంత ప్రసిద్దో అక్కడి వంటకాలు కూడా అంతే ప్రసిద్ది చెందాయి. శ్రీలంకలో ఏ పండుగ జరిగినా,ఏ శుభకార్యం అయినా,ప్రత్యేక సందర్భాల్లో కహా బాత్ తప్పక ఉండాల్సిందే. దీనిని యెల్లో రైస్ అని కూడా పిలుస్తారు. కహా అంటే సింహళ భాషలో పసుపు అని..బాత్ అంటే అన్నం అని అర్థం. కనుక కహా బాత్ అంటే పసుపు అన్నం లేదా యెల్లో రైస్ అని అర్థమన్నమాట.

శ్రీలంకలో కొత్త సంవత్సరంలో మొట్టమొదటి భోజనంగా చాలా కుటుంబాలు కహా బాత్‌ నే స్వీకరిస్తాయి. ఇది వారి జీవితంలోకి కొత్త వెలుగును, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. దీని తయారీ చాలా సులభం, కానీ దాని రుచి మాత్రం అమోఘం. మీ ఇంట్లోనే ఈజీగా శ్రీలంక స్పెషల్ యెల్లో రైస్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Creamy and Aromatic Sri Lankan Special Yellow Rice Recipe in Telugu

యెల్లో రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం: 2 కప్పులు
చిక్కటి కొబ్బరి పాలు: 1 కప్పు (మొదటి పాలు)
పల్చటి కొబ్బరి పాలు: 2 కప్పులు (రెండవ పాలు)
పసుపు: 1 టీస్పూన్
ఉల్లిపాయ: 1
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క: 1 అంగుళం ముక్క
యాలకులు: 3-4
లవంగాలు: 4-5
కరివేపాకు: రెండు రెమ్మలు
రెంప ఆకులు (Pandan Leaves): చిన్న ముక్క (లేకపోతే వదిలేయండి)
నిమ్మగడ్డి: ఒక చిన్న కాడ
ఉప్పు: రుచికి సరిపడా
వేయించిన జీడిపప్పు,ఎండుద్రాక్ష,వేయించిన ఉల్లిపాయ ముక్కలు

Creamy and Aromatic Sri Lankan Special Yellow Rice Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

-తర్వాత ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి.

-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, రెంప ఆకులు, నిమ్మగడ్డి (ఉపయోగిస్తుంటే) వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా కలపాలి.

-ఇప్పుడు నానబెట్టి వడకట్టిన బియ్యాన్ని అందులో వేసి, సుగంధ ద్రవ్యాలతో బాగా కలిసేలా రెండు నిమిషాలు మెల్లగా వేయించాలి. ఇలా చేయడం వల్ల అన్నం పొడిపొడిగా వస్తుంది. ఆ తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

-ఇప్పుడు చిక్కటి కొబ్బరి పాలు, పల్చటి కొబ్బరి పాలు పోయాలి. అంతా బాగా కలిపి మిశ్రమాన్ని ఒకసారి మరిగించాలి. మంటను పూర్తిగా తగ్గించి గిన్నెపై మూత పెట్టి బియ్యం మెత్తగా ఉడికి, ద్రవం పూర్తిగా ఆవిరైపోయే వరకు సుమారు 15-20 నిమిషాలు ఉడికించాలి.

-అన్నం ఉడికిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకుండా మరో 10 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయాలి. దీనివల్ల అన్నం మరింత పొడిగా, రుచిగా తయారవుతుంది. తర్వాత ఒక ఫోర్క్‌ తో మెల్లగా అన్నాన్ని కదిపితే, మెతుకులు విడివిడిగా వస్తాయి. అంతే వేడి వేడి యెల్లో రైస్ రెడీ.

-వేడి వేడి యెల్లో రైస్ ని ఒక సర్వింగ్ బౌల్‌ లోకి తీసుకుని పైన వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, వేయించిన ఉల్లిపాయలతో అలంకరించి నోట్లో పెట్టుకుంటే అమృతమే అంటారు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion