పాలకోవా రుచితో ఉల్లిపాయ పాయసం..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

Posted By:

సాధారణంగా మనం పాయసం అంటే సేమియా, సగ్గుబియ్యం, లేదా బియ్యంతో చేస్తాం. కానీ ఉల్లిపాయతో పాయసం అంటే చాలామంది ఆశ్చర్యపోతారు. ఉల్లిపాయ ఘాటుగా ఉంటుంది కదా దానితో తీపి వంటకం ఎలా చేస్తారు అన్న సందేహం రావడం సహజం. కానీ ఉల్లిపాయను సరైన పద్ధతిలో శుద్ధి చేసి వండితే, అది అద్భుతమైన రుచిని ఇస్తుంది.

దీనిని ఇంగ్లీష్‌లో ఆనియన్ ఖీర్ అని పిలుస్తారు. పాత కాలం నాటి ఈ వంటకం కేవలం రుచి కోసమే కాకుండా శరీరానికి చలువ చేయడానికి కూడా ప్రసిద్ధి. ఉల్లిపాయ పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Creamy Rich and Delicious Onion Kheer Recipe in Telugu

కావలసిన పదార్థాలు
తెల్ల ఉల్లిపాయలు: 2-3
ఫుల్ క్రీమ్ పాలు: 1 లీటరు
చక్కెర: 1 కప్పు
నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: అర టీస్పూన్
డ్రై ఫ్రూట్స్: జీడిపప్పు, బాదం, కిస్మిస్

తయారీ విధానం

-ముందుగా తెల్ల ఉల్లిపాయల పై పొర తీసివేసి వాటిని సన్నని ముక్కలుగా తరగాలి.

-స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలను అందులో వేసి 5-10 నిమిషాలు ఉల్లిపాయ పారదర్శకంగా మారేదాకా ఉడికించిన తర్వాత, ఆ నీటిని పూర్తిగా వంపేయాలి. మళ్ళీ చల్లని నీటితో ఉల్లిపాయలను కడగాలి.

-ఇప్పుడు ఒక మందపాటి పాన్ స్టవ్ మీద పెట్టండి. అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేశాక అందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లోని నెయ్యిలోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి సన్నని మంటపై వేయించాలి.

-ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేగిన తర్వాత అందులో చిక్కటి పాలను పోయాలి. మంటను సిమ్‌ లో పెట్టి పాలను బాగా మరిగించాలి.

-పాలు చిక్కబడే వరకు (సుమారు 15-20 నిమిషాలు) కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు పాలతో కలిసిపోయి పాల కోవా లాంటి టెక్స్చర్ వచ్చే వరకు మరిగించాలి.

-పాలు చిక్కబడ్డాక, రుచికి సరిపడా చక్కెరను వేసి కలపాలి. చక్కెర కరిగే వరకు మరొక 5 నిమిషాలు ఉడికించాలి.

-చివరగా యాలకుల పొడిని వేసి కలపాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను పాయసం పైన చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఉల్లిపాయ పాయసం రెడీ.

-ఈ పాయసాన్ని వేడిగా లేదా ఫ్రిజ్‌ లో ఉంచి చల్లగా కూడా తినవచ్చు. చల్లగా తింటే ఇది ఐస్‌ క్రీమ్ రుచిని తలపిస్తుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, December 24, 2025, 21:37 [IST]
Desktop Bottom Promotion