Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
ఈ అలసంద వడల రుచికి ఫిదా అవ్వాల్సిందే..క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలంటే
అలసంద వడలను బొబ్బర్ల వడలు అని కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా పాపులర్ స్నాక్. ఇవి క్రిస్పీగా, రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిని స్నాక్ గా లేదా అల్పాహారంగా తీసుకోవచ్చు. అలసందలు ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఈ వడలు తయారు చేయడం చాలా సులభం. ముఖ్యంగా, పండుగలు, పబ్బాలు, లేదా ఇంట్లో ఏవైనా ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు ఈ వడలను తయారు చేయడం సంప్రదాయం. ఇవి వేడిగా, కారంగా, కొద్దిగా పుల్లగా ఉండే అల్లం చట్నీతో చాలా బాగా సరిపోతాయి. ఆరోగ్యకరమైన అలసంద వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి
అలసంద వడల తయారీకి కావలసిన పదార్థాలు
-అలసందలు (బొబ్బర్లు) - 1 కప్పు (200 గ్రాములు)
-ఉల్లిపాయలు - 1
-పచ్చిమిర్చి - 2-3
-అల్లం - 1 అంగుళం ముక్క
-వెల్లుల్లి - 4-5
-కరివేపాకు - కొన్ని రెబ్బలు
-కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
-బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర - 1 టీస్పూన్
-సోంపు - 1/2 టీస్పూన్
-ఉప్పు - రుచికి సరిపడా
-నూనె - వేయించడానికి సరిపడా
అలసంద వడల తయారీ విధానం
-ముందుగా అలసందలను శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో వేసి నీటితో నింపాలి. వాటిని కనీసం 4-6 గంటల పాటు నానబెట్టాలి. రాత్రంతా నానబెడితే మరీ మంచిది.
-నానిన అలసందల నుండి నీటిని పూర్తిగా తీసివేయాలి. వాటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. నీరు ఎక్కువగా ఉంటే వడలు సరిగ్గా రావు. మిక్సీ జార్ లో అలసందలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి, మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలాగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు అస్సలు నీరు పోయకూడదు. పిండి మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా కరకరలాడేలా ఉంటే వడలు చాలా రుచిగా ఉంటాయి.
-రుబ్బుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సోంపు, ఉప్పు వేసి బాగా కలపాలి. పిండిలో నీరు ఎక్కువగా ఉంటే గట్టిపడటానికి బియ్యప్పిండిని కలపాలి. ఇది వడలు క్రిస్పీగా రావడానికి కూడా సహాయపడుతుంది.
-చేతికి కొద్దిగా నూనె రాసుకుని, పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ ఉండలను అరచేతిలో పెట్టి వడల ఆకారంలో కాస్త పలుచగా వత్తుకోవాలి. మధ్యలో చిన్న రంధ్రం చేస్తే వడలు లోపల కూడా బాగా ఉడుకుతాయి.
-ఒక మందపాటి కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియంలోకి తగ్గించాలి. తయారు చేసుకున్న వడలను జాగ్రత్తగా నూనెలో వేసి, బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. ఒకవైపు వేగిన తర్వా, రెండో వైపు కూడా తిప్పి వేయించాలి.
-వడలు పూర్తిగా వేగిన తర్వాత వాటిని నూనె నుండి తీసి, టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేయాలి. ఇది అదనపు నూనెను పీల్చుకుంటుంది. వీటిని వేడివేడిగా ఏదైనా చట్నీతో లేదా సాంబార్ తో వడ్డించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










