Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
కరకరలాడే క్రిస్పీ లూస్ ప్రాన్స్..రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
నాన్ వెజ్ ప్రియుల్లో చాలామందికి రొయ్యలతో చేసే వంటకాలు అంటే మహా ఇష్టంగా తింటారు. ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు నాన్ వెజ్ స్టార్టర్ ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే చాలామంది ఫస్ట్ ఆప్షన్ గా లూస్ ప్రాన్స్ ఉంటుంది. రెస్టారెంట్లలో స్పెషల్ స్టార్టర్ గా నిలిచే క్రిస్పీ లూస్ ప్రాన్స్ చాలామందికి ఇష్టమైన వంటకం. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా, జ్యుసీగా ఉండే ఈ రొయ్యల వంటకం నోరూరిస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా రెస్టారెంట్ కి మించిన టేస్ట్ తో ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
క్రిస్పీ లూస్ ప్రాన్స్ తయారీకి కావలసిన పదార్థాలు
-రొయ్యలు: 500 గ్రాములు
-అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
-కారం: సరిపడా
-పసుపు: 1/4 టీస్పూన్
-మిరియాల పొడి: 1/2 టీస్పూన్
-సోయా సాస్: 1 టేబుల్ స్పూన్
-నిమ్మరసం: 1 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-మైదా: 2 టేబుల్ స్పూన్లు
-కార్న్ ఫ్లోర్: 2 టేబుల్ స్పూన్లు
-బియ్యప్పిండి : 1 టేబుల్ స్పూన్
-గుడ్డు: 1
-నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
-వెల్లుల్లి: 10-12 రెబ్బలు
-పచ్చిమిర్చి: 2-3
-కరివేపాకు: గుప్పెడు
-ఉల్లిపాయ: 1 చిన్నది
-కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
క్రిస్పీ లూస్ ప్రాన్స్ తయారీ విధానం
-ముందుగా రొయ్యలను తొక్క తీసి..తోక ఉంచి శుభ్రం చేయండి. వీపు భాగంలో ఉండే నల్లటి నరాన్ని (డీవీన్) తీసివేయండి. రొయ్యలను చల్లటి నీటితో శుభ్రంగా కడిగి టిష్యూ పేపర్ తో లేదా శుభ్రమైన వస్త్రంతో పూర్తిగా తుడిచి తేమ లేకుండా చూసుకోండి. తేమ ఉంటే క్రిస్పీగా రావు.
-పెద్ద బౌల్ లో శుభ్రం చేసిన రొయ్యలను తీసుకోండి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, మిరియాల పొడి, సోయా సాస్, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. రొయ్యలకు మసాలాలు బాగా పట్టేలా చూడండి.
-ఇప్పుడు ఈ రొయ్యల మిశ్రమానికి మైదా, మొక్క జొన్న పిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపండి. ఒక గుడ్డును బాగా గిలకొట్టి ఈ మిశ్రమానికి కలపండి. గుడ్డు వేయడం వల్ల రొయ్యలకు బ్యాటర్ బాగా పట్టి, క్రిస్పీగా వస్తాయి. అవసరమైతే ఒక టీస్పూన్ నీటిని మాత్రమే కలపండి. మిశ్రమం మరీ పల్చగా ఉండకూడదు, రొయ్యలకు అంటుకునేలా ఉండాలి.
-ఈ మిశ్రమాన్ని కనీసం 15-20 నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచండి. ఇలా చేయడం వల్ల రొయ్యలకు మసాలాలు బాగా పట్టి, రుచి వస్తాయి.
-తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేడి చేయండి. నూనె వేడైన తర్వాత మ్యారినేట్ చేసిన రొయ్యలను ఒక్కొక్కటిగా విడివిడిగా వేయండి. ఒకేసారి ఎక్కువ రొయ్యలను వేయవద్దు, అలా చేస్తే నూనె చల్లబడి రొయ్యలు క్రిస్పీగా రావు. బ్యాచ్ లుగా వేయండి.
-రొయ్యలు బంగారు గోధుమ రంగులోకి మారే వరకు మరియు క్రిస్పీగా అయ్యే వరకు మీడియం నుండి హై ఫ్లేమ్ లో ఫ్రై చేయండి. రొయ్యలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. సుమారు 2-3 నిమిషాలు సరిపోతుంది. ఎక్కువసేపు వేయిస్తే రొయ్యలు గట్టిగా రబ్బరులా అవుతాయి.
-వేగిన రొయ్యలను నూనెలోంచి తీసి అదనపు నూనె పీల్చుకోవడానికి టిష్యూ పేపర్ పై వేయండి.
-వేరే ఒక పాన్ లేదా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేయండి. నూనె వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి వేసి అవి బంగారు రంగులోకి మారి సువాసన వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు కరివేపాకు వేసి, అది క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి.
-ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. చిల్లీ ఫ్లేక్స్ వాడుతుంటే చివరగా వేసి ఒక్క నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేయండి.
-వేయించి పెట్టుకున్న క్రిస్పీ రొయ్యలను పోపులోకి వేసి నెమ్మదిగా కలపండి. రొయ్యలకు పోపులోని మసాలాలు బాగా పట్టేలా టాస్ చేయండి.
-చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. ఇది స్టార్టర్ గా లేదా స్నాక్ గా చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






