Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నవరాత్రి 5వ రోజు స్పెషల్..దద్దోజనం ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రం గ్యారెంటీ!
నవరాత్రి ఉత్సవాలలో ప్రతి రోజు అమ్మవారిని ఒక్కో రూపంలో అలంకరించి, ఒక్కో ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. 5వ రోజు అమ్మవారిని శక్తి స్వరూపిణి అయిన స్కందమాత రూపంలో ఆరాధిస్తారు. స్కందమాత అంటే కుమారస్వామి (స్కందుడు లేదా కార్తికేయుడు)కి తల్లి. ఈ రూపంలో అమ్మవారు సింహంపై ఆసీనురాలై, నాలుగు చేతులతో, ఒడిలో కుమారస్వామితో దర్శనమిస్తుంది. నవరాత్రి 5వ రోజున అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పించడం ఒక ప్రత్యేక ఆచారం. స్కందమాత శాంత స్వరూపిణి కాబట్టి ఈ రోజున దద్దోజనం నైవేద్యంగా పెట్టడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు, ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తాయని నమ్మకం.
దద్దోజనం అనేది దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా దేవాలయాలలో ప్రసాదంగా ఇచ్చే ఒక పవిత్రమైన, రుచికరమైన వంటకం. దద్దోజనం..అన్నం, పెరుగు (ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్) కలయికతో కూడిన సమతుల్య ఆహారం. నవరాత్రి ఉపవాసాల సమయంలో లేదా తర్వాత ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. నవరాత్రి 5వ రోజు స్పెషల్ నైవేద్యం దద్దోజనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పెరుగు
-పాలు
-పచ్చి శెనగపప్పు
-ఇంగువ
-మినపప్పు
-ఆవాలు
-జీలకర్ర
-అల్లం
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-నూనె
-ఉప్పు
దద్దోజనం తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో 1 కప్పు బియ్యం వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసాక అందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నాననివ్వాలి.
-తర్వాత కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి మూతపెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
-ఉడికిన అన్నాన్ని వేడిమీద ఉన్నప్పుడే పప్పుగుత్తితో మెత్తగా మెదుపుకోవాలి.
-తర్వాత అందులో వేడి పాలు పోసి కలిపి కాస్త చల్లారనివ్వాలి.
-తర్వాత అందులో 2 కప్పుల కమ్మటి పెరుగు,రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి.
-తర్వాత తాలింపు రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో ఆయిల్ 1 గరిట నూనె వేసి అందులో 1 స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసిన 1 స్పూన్ అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయల ముక్కలు, కరివేపాకు వేసి వేయించాక స్టవ్ ఆపేసాక అందులో చిటికెడు ఇంగువ వేసి కలుపుకోవాలి.
-వేయించిన తాలింపుని రెడీ చేసి పక్కన పెట్టుకున్న పెరుగన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో కమ్మగా ఉండే దద్దోజనం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications