Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
రోటీ,చపాతీల్లోకి అమోఘం..ధాభా స్లైల్ లో లసూని పాలక్ కర్రీ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
లసూని పాలక్ కర్రీ అనేది భారతీయ వంటకాల్లో ఒక ప్రసిద్ధ వంటకం. ముఖ్యంగా నార్త్ ఇండయాలో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. లసూని అంటే వెల్లుల్లి అని అర్థం,పాలక్ అంటే పాలకూర అని అర్థం. ఈ కర్రీలో వెల్లుల్లి రుచి డామినేట్ చేస్తుంది. పాలకూరతో కలిపి ఇది చాలా రుచికరంగా, పోషకభరితంగా ఉంటుంది. ఇది సాధారణంగా రోటీ, నాన్, పరాఠా లేదా అన్నంతో కలిపి తింటారు. ధాభా స్టైల్ లో లసూని పాలక్ ని మీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
లసూని పాలక్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలకూర
-వెల్లుల్లి
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-నూనె/నెయ్యి
-జీలకర్ర
-ఇంగువ
-పసుపు
-కారం
-ధనియాల పొడి
-గరం మసాలా
-ఉప్పు
-వేయించిన జీలకర్ర పొడి

తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద గిన్నె లేదా పెద్ద బౌల్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి అందులోనే కొద్దిగా ఉప్పు, 1 టీస్పూన్ చక్కెర,చిటికెడు వంట సోడా వేసి మరిగించాలి.
-నీళ్లు మరిగిన తర్వాత అందులో రెండు కట్టల పాలకూరను కాడలతో సహా వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలను కట్ చేయకుండానే వేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
-తర్వాత స్టవ్ ఆపి పాలకూరను తీసి చల్ల నీళ్లల్లో వేసి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలో వేసి అందులోన కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పావు కప్పు ఆయిల్ పోసి వేడి చెయ్యాలి. ఆయిల్ వేడయ్యాక అందులో రెండు ఎండుమిర్చి ముక్కలు,అరటీస్పూన్ జీలకర్ర వేసి వేపండి.
-జీలకర్ర చిట్లిన తర్వాత అందులో రెండు చిటికెళ్ల ఇంగువ వేసి వేపండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు వేసి లేత బంగారు రంగువచ్చే దాకా వేపుకోవాలి.
-తర్వాత అందులో 1 ఉల్లిపాయ సన్నని తరుగు వేసి వేపుకోవాలి. ఉల్లి ఎరుపెక్కుతున్న సమయంలో అందులో 1 టేబుల్ స్పూన్ ప్రెష్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేపి వేపుకోవాలి.
-తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ శెనగపిండి వేసిఓ పొంగు రానివ్వాలి. తర్వాత ఇందులో అరటేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ ధనియా పొడి, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం వేసి వేయించుకోండి.
-తర్వాత అందులో గ్రైండ్ చేసకున్న పాలక్ పేస్ట్ ని వేసి కలపాలి.
-కావాలనుకుంటే ఇప్పుడు పాలక్ లో కొంచెం నీళ్లుపోసి అడ్జెస్ట్ చేసుకోవచ్చు.
-పాలక్ లో నుంచి ఆయిల్ పైకి తేలేదాకా మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
-ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ నలిపిన కసూరీ మేథ వేపి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 1 ఎండుమిర్చి ముక్కలు.1 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించి దీన్ని పాలక్ కర్రీలో వేసి కలపండి. అంతే లసూని పాలక్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
