దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే పెళ్లిళ్ల స్టైల్ మైసూర్ పాక్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Posted By:

స్వీట్ అనగానే చాలామంది దక్షిణ భారతీయుల మైండ్ లో ఫస్ట్ గుర్తుకొచ్చే చిత్రం మైసూర్ పాక్. దీని రంగు, రుచి, వాసన అన్నీ అద్భుతమే. మైసూర్ లో పుట్టి ప్రంచమంతటికి విస్తరించిన ఈ స్వీట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పెళ్లిళ్లల్లో వడ్డించే మైసూర్ పాక్ లు భలే రుచిగా ఉంటాయి. పండుగల సమయంలో ఈ స్వీట్ ని షాపుల్లో కొనే బదులు ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోండి.

మరికొద్దిరోజుల్లో దీపావళి రానుంది. ఈ క్రమంలో ఈ దీపావళి మరింత తీయ్యగా, సంతోషంగా మార్చుకునేందుకు ఖచ్చితమైన కొలతలు, కొన్ని టిప్స్ పాటిస్తూ మ్యారేజ్ స్టైల్ మైసూర్ పాక్ ను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Diwali 2026 Special Sweet How to Make Perfect Marriage Style Mysore Pak at Home Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు

-1 కప్పు శనగ పిండి
-1 కప్పు చక్కెర
-పావు కప్పు నీళ్లు
-సమాన పరిమాణంలో నెయ్యి, నూనె

మాంసాహారాన్ని మించే రుచితో స్పైసీ సోయా చుక్కా..రైస్, చపాతీ, దోశలోకి బెస్ట్ సైడ్ డిష్

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె, నెయ్యి వేసి తక్కువ మంట మీద వేడి చెయ్యాలి.

-మరోవైపు, స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి, చక్కెర వేసి మరిగించాలి. చక్కెర కరిగి జిగటగా ఉండే చిక్కదనం వచ్చిన తర్వాత అందులో కొంచెం కొంచెగా నెమ్మదిగా శనగపిండి వేస్తూ ఉండలు లేకుండా కలుపుకుంటూ మీడియం మంట మీద 2-3 నిమిషాలు ఉడికించాలి.

-3 నిమిషాల తర్వాత అందులో వేడి చేసిన నూనె, నెయ్యిని నెమ్మదిగా పోసి కలుపుకోవాలి. మిశ్రమం కావాల్సిన స్థితికి వచ్చేదాకా కలుపుతూ ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆపేయండి.

-ఇప్పడు ఈ మిశ్రమం మొత్తన్ని నూనె లేదా నెయ్యి రాసిన ప్లేట్ లోకి సర్దుకోండి. అదనంగా ఉన్న నెయ్యిని కావాలనుకుంటే అందులో నుంచి తీసేయండి.

-మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే నచ్చిన సైజలో ముక్కలుగా చాకుతో కట్ చేసుకోండి.

-కట్ చేశాక 1-2 గంటలు అలాగే వదిలేయండి.

-తర్వాత నోరూరించే మైసూర్ పాక్ తినడానికి రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, October 28, 2026, 11:47 [IST]
Desktop Bottom Promotion