Latest Updates
-
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే!
క్రిస్మస్ సందర్భంగా ఏ వంటలు తయారు చేయాలనుకుంటున్నారు? ఇక్కడ 7 ఫేమస్ వంటలు ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆనందించే పండుగలలో క్రిస్మస్ ఒకటి. ఇది యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవడానికి కుటుంబాలు ఒకచోట చేరే సమయం. క్రిస్మస్ ట్రీని అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం నుండి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి భోజనం చేయడం వరకు ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు.
ఇతర పండుగల మాదిరిగానే క్రిస్మస్ కూడా రుచికరమైన వంటకాలతో జరుపుకుంటారు. రోస్ట్ టర్కీ, ప్లం కేక్, ఎగ్నాగ్ వంటి వంటకాలతో క్రిస్మస్ జరుపుకుంటారు.
దేశవ్యాప్తంగా 9 ప్రసిద్ధ క్రిస్మస్ వంటకాలు ఇక్కడ ఉన్నాయి:
1. చంద్రకళ/ సూర్యకళ స్వీట్
ఇది ఆంధ్రాలో క్రిస్మస్ సందర్భంగా చేసే తీపి వంటకం. పేరు
సూచించినట్లుగా, దాని ఆకారం సూర్యుడిలా గుండ్రంగా ఉంటుంది లేదా
చంద్రుడిలా సగం ఆకారంలో ఉంటుంది. ఇది మైదా పిండితో తయారు చేస్తారు.
మైదా పిండిని చపాతీ పిండిలో బాగా కలిపి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి.
తరువాత పొరలుగా చేసి, ప్రతి పొర మధ్యలో వెన్నను వేయండి. కాబట్టి
పొరలుగా మరియు చంద్రుడు లేదా సూర్యుని ఆకారంలో ముడుచుకుంటే, అది
క్రంచీగా మారుతుంది. తర్వాత షుగర్ సిరప్ లో వేసి పైన డ్రై ఫ్రూట్స్
వేస్తే రుచికరమైన సూర్యకళ స్వీట్ రెడీ.
2. కలకలాలు
కలకలాలు అంటే చాలా మందికి తెలియదు. ఇది ఇంట్లో రెండు విధాలుగా
తయారుచేసుకుంటారు. ఒకటి స్వీట మరొకటి రుచికరమైన కారంగా ఉండే కలకలాలు.
ఇవి చేసే విధానం కూడా చాలా సులభం. గోధుమ పిండిలో మైదా పిండి
కలుపుతుండగా పంచదార, అరటి పండు, గుడ్డు (ఉపయోగించకపోవచ్చు) వేసి బాగా
కలిపి బిస్కెట్ ఆకారంలో కట్ చేసి నూనెలో వేయించుకుంటే రుచికరమైన
స్వీట్ కలకలాలు రెడీ. ఇందులో పంచదారకు బదులు ఉప్పు కారం వేస్తే
తయారుచేస్తే కారం కలకలాలు తయారు అవుతాయి. ఇది చాలా రుచిగా కూడా
ఉంటుంది.
3. రోజ్ కుకీలు
గోవా యొక్క మరొక ప్రసిద్ధ సాంప్రదాయ డెజర్ట్ రోజ్ కుకీలు (అచప్పం).
వీటని ఎక్కువగా క్రిస్మస్ సమయంసుకుంటారు. ఇది బియ్యప్పిండి, గుడ్డు,
నువ్వులు మరియు పంచదారతో చేసిన పిండితో తయారు చేసులో తయారు చేకుంటారు.
ఈ భారతీయ స్టైల్ కుకీలు ఎక్కువగా పండుగ సీజన్లో తయారు చేస్తారు.
4. ప్లం కేక్
క్రిస్మస్ సందర్భంగా ఇంట్లోనే కేక్‌లను తయారు చేయడం ప్రత్యేకం. పండుగల
సమయంలో ఎక్కువగా ప్లం కేక్‌లను ఇంట్లోనే తయారుచేస్తారు. దీనికి ఎక్కువ
సమయం పట్టదు. తక్కువ సమయంలో కుక్కర్లో కేక్‌ను తయారు చేసుకోవచ్చు.
కాబట్టి క్రిస్మస్ జరుపుకునే ప్రతి ఒక్కరూ ప్లం కేక్ కూడా
చేస్తారు.
5. పాలప్పం
పాలప్పాన్ని అప్పం అని కూడా అంటారు. ఇది కేరళ వంటకాలలో ఒక రకమైన
పాన్కేక్. క్రిస్మస్ వేడుకలకు ఇది ప్రధానమైన అల్పాహారం. ఇది
పులియబెట్టిన బియ్యం పిండి మరియు కొబ్బరి పాలతో తయారు చేస్తారు.
6. నాన్‌వెజ్
క్రిస్మస్ సందర్భంగా చాలా మంది ఇళ్లలో మాంసం వండుకోవడం సర్వసాధారణం.
పండగలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, చికెన్ ప్రై,
మటన్ కబాబ్ అన్నీ చాలా స్పెషల్.
7. డక్ మోయిల్
ఈ వంటకం మహారాష్ట్రలోని ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ నుండి వచ్చింది. ఈ
వంటకం బాతు మాంసంతో తయారు చేయబడింది. ఇది బ్రెడ్, రైస్, ఫుజియాస్
మరియు సలాడ్లతో వడ్డిస్తారు. మహారాష్ట్రలో, ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ
బాటిల్ మసాలాతో ఈ వంటకాన్ని తయారుచేస్తారు మరియు ఈ వంటకం లేకుండా
క్రిస్మస్ వేడుకలు పూర్తికావు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
















