Latest Updates
-
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి!
నోరూరించే చికెన్ తొక్కు..రోటీ నుండి బిర్యానీ వరకు అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే
వీకెండ్ వస్తే చాలామంది ఇళ్లల్లో తప్పనిసరిగా చికెన్ ఉంటుంది. ఇంట్లో చికెన్ తెచ్చారంటే ఎప్పుడూ అవే పులుసులు, అవే గ్రేవీలు, అవే రోస్టులతో విసిగిపోయారా? చికెన్ తో ఏదైనా కొత్తగా, కారంగా, మసాలా ఘాటుగా తినాలనిపిస్తోందా? అయితే ఈసారి ఈ అద్భుతమైన చికెన్ తొక్కును ప్రయత్నించండి. ఇది కేవలం అన్నంలోకే కాదు, చపాతీలు, పూరీలు, నాన్లతో తిన్నా భలే రుచిగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ప్లెయిన్ బిర్యానీ లేదా బగారా రైస్ చేసుకున్నప్పుడు, దీనిని సైడ్ డిష్‌గా పెట్టుకుంటే ఆ రుచి మరో స్థాయిలో ఉంటుంది. వంట కొత్తగా నేర్చుకునే వారు కూడా దీన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చికెన్ తొక్కు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
-నెయ్యి - 50 గ్రాములు
-బోన్ లెస్ చికెన్ - అర కిలో
-ఉల్లిపాయ - 1
-టమోటా - 1
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - ¾ టేబుల్ స్పూన్
-పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
-పచ్చిమిర్చి - 2
-మసాలా దినుసులు: యాలకులు - 2, లవంగాలు - 3, దాల్చిన చెక్క - 2
అంగుళాల ముక్క, అనాస పువ్వు - 1
-పొడి మసాలాలు: కారం - అర టేబుల్ స్పూన్, పసుపు - అర టేబుల్ స్పూన్,
ధనియాల పొడి - పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి - పావు టేబుల్
స్పూన్, గరం మసాలా - 2 చిటికెలు
-కొత్తిమీర, పుదీనా తరుగు - ఒక్కోటి 2 టేబుల్ స్పూన్లు ,
-కరివేపాకు - ఒక రెమ్మ
-ఉప్పు - రుచికి సరిపడా
-నీరు - 1 గ్లాసు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి.
-ఇప్పుడు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు చల్లితే ఉల్లిపాయలు మరింత మెత్తగా మగ్గుతాయి.
-ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక్క నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
-ఇప్పుడు టమోటా ముక్కలు వేసి అవి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మగ్గనివ్వాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత, పెరుగు వేసి ఉండలు కట్టకుండా వెంటనే కలపాలి.
-ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి, మసాలాలన్నీ బాగా వేగి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి.
-ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఒక గ్లాసు నీళ్లు పోసి, మంటను ఎక్కువగా పెట్టి ఒక పొంగు రానివ్వాలి.
-మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి, మూత పెట్టి సుమారు 15-20 నిమిషాల పాటు చికెన్ ను మెత్తగా ఉడికించాలి.
-చికెన్ ఉడికిన తర్వాత మూత తీసి, మంటను మళ్లీ ఎక్కువ చేసి, నీరంతా ఇగిరిపోయి తొక్కు దగ్గరపడే వరకు ఉడికించాలి. నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఘుమఘుమలాడే, రుచికరమైన చికెన్ తొక్కు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









