Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఆయుధ పూజ స్పెషల్.. సూపర్ హెల్దీ మసాలా శెెనగలు..ఎలా చేసుకోవాలంటే..
పండుగ వచ్చిందంటే చాలు మన ఇళ్లన్నీ పూజలు, పిండివంటలతో కళకళలాడిపోతాయి. ముఖ్యంగా ఆయుధ పూజ, సరస్వతీ పూజ సమయంలో అమ్మవారికి శనగలతో చేసిన వంటకం నైవేద్యంగా పెట్టడం మన సంప్రదాయం. అయితే దేవుడికి పెట్టే ప్రసాదంలో ఉల్లి, వెల్లుల్లి వేయం కాబట్టి చాలామంది శనగలను కేవలం ఉడకబెట్టి నైవేద్యం పెట్టి తర్వాత తినేటప్పుడు తాలింపు వేసుకుంటారు. కానీ దేవుడికి నివేదించిన ప్రసాదాన్నే అందరూ ఎంతో ఇష్టంగా తినేలా, అద్భుతమైన రుచితో చేస్తే ఎలా ఉంటుంది?
ఒకే వంటకంతో పూజ, ప్రసాదం రెండూ పూర్తయితే ఎంత బాగుంటుంది. అలాంటి ఒక అద్భుతమైన రెసిపీనే ఈ మసాలా శెనగలు. దీని రహస్యమంతా మనం ఇంట్లో అప్పటికప్పుడు తయారుచేసుకునే ఒక ప్రత్యేకమైన మసాలా పొడిలోనే ఉంది. ఈ పొడి శuనగల ప్రసాదంకు అనిర్వచనీయమైన సువాసనను, రుచిని అందిస్తుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో శెనగలను చేశారంటే ప్రతి పండుగకూ ఇలాగే చేయమని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు. ఈ ఘుమఘుమలాడే మసాలా శెనగల ప్రసాదం ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
తెల్ల శెనగలు - పావు కిలో (1/4 kg)
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - అవసరమైనన్ని
పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
ధనియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఎండు మిర్చి - 3
కరివేపాకు - ఒక రెమ్మ
తాళింపు కోసం:
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
ఎండు మిర్చి - 2 (తుంచి పెట్టుకోవాలి)
పసుపు - పావు టీస్పూన్
కొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - ఒక రెమ్మ
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా శెనగలను శుభ్రంగా కడిగి కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టాలి.
-నానిన శెనగలలోని నీటిని వంపేసి, కుక్కర్ లో వేయండి. శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి. ఆవిరి పోయాక, నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మసాలా పొడి కోసం ఒక పాన్ లో పచ్చి శెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి, చిన్న మంటపై మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
-అదే పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక శెనగపప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
-ఇప్పుడు పసుపు, తాజా కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం పాటు వేయించి వెంటనే ఉడికించి పెట్టుకున్న శెనగలను కలపండి.
-శెనగలపై మనం సిద్ధం చేసుకున్న మసాలా పొడిని, రుచికి మరికొంత ఉప్పు అవసరమైతే చల్లి మసాలా బాగా పట్టేలా రెండు నిమిషాల పాటు కలపాలి.
-శెనగలు పొడిగా అనిపిస్తే మనం పక్కన పెట్టుకున్న శనగలు ఉడికించిన నీటిని రెండు చెంచాలు చల్లితే మసాలా చక్కగా పట్టుకొని, రుచి పెరుగుతుంది. పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే మసాలా శెనగల ప్రసాదం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







