Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
గోదావరి జిల్లాల స్పెషల్ పచ్చడి.. తింటే జన్మకి ఇంకేదీ అక్కర్లుదు అంటారు,ఎలా చేయాలంటే
ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలు అంటే మర్యాదలతో పాటుగా ఫుడ్ కి కూడా పెట్టింది పేరు. ఇక్కడ చాలా రకాల ప్రత్యేక వంటకాలను తయారుచేస్తుంటారు. పాతకాలం పద్దతిలో ఇప్పటికీ అక్కడ తయారుచేస్తుండే కొన్ని వంటలు చూస్తేనే చాలామందికి నోట్లో లాలాజలాన్ని ఊరేస్తుంటాయి. రుచితో పాటు ఆరోగ్యపరంగా కూడా అనే ప్రయోజనాలను అందించే గోదావరి జిల్లాల వంటకాల్లో చింతకాయ కొబ్బరి పచ్చడి చాలా ఫేమస్. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ పచ్చడి తింటే చాలా హాయిగా ఉంటుంది.
రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే గోదావరి జిల్లాల స్పెషల్ చింతకాయ కొబ్బరి పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనిని సులభంగా తయారుచేసుకోవడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

చింతకాయ కొబ్బరి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
చింతకాయలు: 1 కప్పు
కొబ్బరి తురుము: 1 కప్పు
పచ్చిమిర్చి: 6-8
అల్లం: 1 అంగుళం ముక్క
వెల్లుల్లి: 4-5 రెబ్బలు
జీలకర్ర: 1 టీ స్పూన్
ఆవాలు: 1/2 టీ స్పూన్
మెంతులు: 1/4 టీ స్పూన్
కరివేపాకు: కొద్దిగా
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడినంత
చింతకాయ కొబ్బరి పచ్చడి తయారీ విధానం
-ముందుగా చింతకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
-తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి.
-తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి కొద్దిసేపు వేయించాలి.
-ఇప్పుడు చింతకాయ ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు వేయించాలి.
-చింతకాయ ముక్కలు మెత్తబడిన తర్వాత కొబ్బరి తురుము,ఉప్పు వేసి బాగా కలపాలి.
-కొద్దిసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-అంతే రుచికరమైన చింతకాయ కొబ్బరి పచ్చడి రెడీ. ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని దోస, ఇడ్లీ, చపాతీలతో కూడా తినవచ్చు.
-పచ్చడిని నిల్వ చేసుకోవాలనుకుంటే నూనె కొంచెం ఎక్కువ వేసి బాగా వేయించి చల్లారిన తర్వాత డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. మీరు కావాలనుకుంటే, ఈ పచ్చడిలో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు.
ఎండాకాలంలో తప్పక తాగాల్సిన డ్రింక్ ఇదే..ఒరిస్సా ఫేమస్ 'టంకా టొరానీ',ఎలా చేయాలంటే..
చింతకాయ కొబ్బరి పచ్చడి ప్రయోజనాలు
చింతకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కొబ్బరిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి,గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చిమిర్చిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరానికి మేలు చేస్తాయి. అల్లం జీర్ణక్రియకు మంచిది, వాపును తగ్గిస్తుంది. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది. ఈ పచ్చడి తయారీలో ఉపయోగించే ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. వేసవిలో ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications