Latest Updates
-
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
వంకాయ ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తినే కర్ణాటక ఫేమస్ వాంగీ బాత్..ఇంట్లోనే చేసుకోండిలా! -
భర్తలకు తెలియకుండా..సీక్రెట్ డేటింగ్ యాప్ లోకి క్యూ కడుతున్న మహిళలు..హైదరాబాద్ లోనే..
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే!
దక్షిణ భారతదేశంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీకి ఉన్న స్థానం మరే ఇతర వంటకానికీ లేదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు వంటకాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కారానికి, రుచికి గుంటూరు పెట్టింది పేరు.
సాధారణ ఇడ్లీల కంటే భిన్నంగా, చిన్న పరిమాణంలో ఉండే చిట్టి ఇడ్లీలను కమ్మటి నెయ్యి, ఘాటైన గుంటూరు కారం పొడిలో దొర్లించి, పల్లీ చట్నీతో కలిపి తింటే ఆ రుచే వేరు. గుంటూరు స్పెషల్ చిట్టి ఇడ్లీ, కారం పొడి, పల్లీ చట్నీ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
చిట్టి ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
మినపగుండ్లు- 1 కప్పు
ఇడ్లీ రవ్వ - 2.5 నుండి 3 కప్పులు
మెంతులు - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని
గుంటూరు స్పెషల్ కారం పొడి తయారీకి కావాల్సినవి
గుంటూరు ఎండుమిర్చి - 15 నుండి 20
శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
మినపప్పు - 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 10 నుండి 12
చింతపండు - చిన్న గోలీ పరిమాణంలో
కరివేపాకు - ఒక గుప్పెడు
నూనె - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
చిట్టి ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా మినపగుండ్లను, మెంతులను శుభ్రంగా కడిగి కనీసం 4-5 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
-నానిన మినపప్పును గ్రైండర్ లేదా మిక్సీలో వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ వెన్నలాగా, చాలా మృదువుగా రుబ్బుకోవాలి.
-మరో గిన్నెలో ఇడ్లీ రవ్వను కడిగి, నీళ్లన్నీ గట్టిగా పిండేసి, రుబ్బుకున్న మినప పిండిలో కలపాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి, పిండిని చేతితో బాగా కలపాలి. ఈ పిండిని రాత్రంతా (సుమారు 8-10 గంటలు) వెచ్చని ప్రదేశంలో పులియబెట్టాలి. ఉదయానికి పిండి ఉబ్బి, గుల్లగా మారుతుంది.
-చిట్టి ఇడ్లీలు వేయడానికి ప్రత్యేకమైన మినీ ఇడ్లీ ప్లేట్లు మార్కెట్లో దొరుకుతాయి. ఆ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, పులిసిన ఇడ్లీ పిండిని చిన్న చిన్న ముద్దలుగా వేయాలి.
-ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి పిండి వేసిన ప్లేట్లను అందులో ఉంచి ఆవిరి మీద 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చిట్టి ఇడ్లీ రెడీ.
-గుంటూరు కారం పొడి తయారీ కోసం..స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి, అర టీస్పూన్ నూనె వేసి ముందుగా ఎండుమిర్చిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
-అదే కడాయిలో శనగపప్పు, మినపప్పు వేసి సన్నని మంట మీద ఎర్రగా వేయించాలి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి సువాసన వచ్చే వరకు వేయించి స్టవ్ ఆపేయాలి.
-వేయించిన దినుసులన్నీ చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లో ముందుగా ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు వేసి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన పప్పుల మిశ్రమాన్ని వేసి కాస్త బరకగా (Coarse) మిక్సీ పట్టుకోవాలి. చివరగా పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్కసారి అలా తిప్పి ఆపేయాలి. గుమగుమలాడే గుంటూరు ఇడ్లీ కారం పొడి రెడీ.
-ఉడికిన వేడి వేడి చిట్టి ఇడ్లీలను ఒక వెడల్పాటి గిన్నెలో వేయాలి. వాటి పైన నెయ్యిని పోయాలి. ఆ వెంటనే మనం తయారు చేసుకున్న గుంటూరు కారం పొడిని చల్లాలి. ఇడ్లీలకు నెయ్యి, కారం పొడి అంటుకునేలా గిన్నెను పైకి కిందకి ఎగరేస్తూ కలపాలి. కారం, నెయ్యి పట్టిన ఈ ఎర్రటి చిట్టి ఇడ్లీలను పల్లీ చట్నీతో కలిపి తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













