ఈ సీక్రెట్‌ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్‌ కర్రీ రెడీ.!

ఇటు వెజ్‌, అటు నాన్‌వెజ్‌ ప్రియులు కామన్‌గా ఇష్టపడే వంటకాల్లో ఒకటి పుట్టగొడుగులు కర్రీ. ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్‌, ప్రొటీన్‌, విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీంతో కండరాల నిర్మాణానికి దోహదపడుతుంది. అందుకే హెల్తీ డైట్‌లో మష్రూమ్‌ను కంపల్సరీ చేర్చుకోవాల్సిందే. అయితే ఈ కర్రీ చేయడం చాలా మందికి కుదరదు. కానీ ఇందులో ఈ ఒక్క సీక్రెట్‌ మసాలా వేశారంటే ప్లేట్‌లో మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. హరియాళీ మష్రూమ్‌ మసాలాను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Hariyali mushroom masala curry with these secret ingredients evergreen taste

హరీయాళీ మష్రూమ్‌ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు

పుదీనా ఆకులు- ఒకటి పావు కప్పు
కొత్తిమీర- ఒకటి పావు కప్పు
పెరుగు- మూడో వంతు కప్పు
నిమ్మకాయ- ఒకటి
జీడిపప్పు పలుకులు- 20
వెల్లుల్లి రెబ్బలు- పది
పచ్చిమిర్చి- 8
నల్ల ఉప్పు- పావు టీస్పూన్‌
అల్లం- చిన్న ముక్క
జీలకర్ర- అర టీస్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా
నూనె- 8 టేబుల్‌ స్పూన్లు
జీలకర్ర- పావు టీస్పూన్‌
ఎండు మిర్చి- రెండు
వెల్లుల్లి రెబ్బలు- టీస్పూన్‌
ఉల్లిపాయ- ఒకటి
మష్రూమ్‌(పుట్ట గొడుగులు)- 200 గ్రాములు
పసుపు- పావు టీస్పూన్‌
గరం మసాలా- పావు టీస్పూన్‌
కసూరి మెంతి- కొద్దిగా

హరియాళీ మష్రూమ్‌ మసాలా కర్రీ తయారీ విధానం

బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌.!

ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి నీళ్లలో ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన నీటిని తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

ఇప్పుడు సీక్రెట్‌ మసాలా కోసం మిక్సీ జార్‌లో పుదీనా, కొత్తిమీర, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు పలుకులు, నల్ల ఉప్పు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మకాయ రసం వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

Hariyali mushroom masala curry with these secret ingredients evergreen taste

స్టవ్‌పైన కడాయి లేదా పాన్‌ పెట్టుకుని నూనె పోసుకోవాలి. వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. తర్వాత చిన్నగా కట్‌ చేసిన ఉల్లిగడ్డ వేసి దోరగా వేయించుకోవాలి.

ఉల్లిగడ్డ రంగు మారి వేగిన తర్వాత ఉడికించి కట్‌ చేసిన పుట్టగొడుగులు వేసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు నూనెలో మగ్గించుకోవాలి.

ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి

మూత తీసి మరోసారి కలిపి గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసుకోవాలి. మసాలా మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి మరికాసేపు ఉడికించుకోవాలి.

తర్వాత కొన్ని నీళ్లు, పసుపు వేసి కలిపి నూనె పైకి తేలేవరకు ఉడికించుకోవాలి. చివర్లో కసూరిమెంతి, గరం మసాలా వేసి కలిపి ఉడికిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే. ఎవర్‌ గ్రీన్‌ టేస్ట్‌తో హరియాళీ మష్రూమ్‌ మసాలా కర్రీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 30, 2026, 12:13 [IST]
Desktop Bottom Promotion