Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
తిరుమల ప్రసాదం వడ..ఇంట్లోనే ఇలా చేస్తే అదే కమ్మని టేస్ట్
తిరుమల వెళ్లే వెంకన్న దర్శనం తర్వాత అందరికీ గుర్తుకొచ్చేది లడ్డూ,వడనే. తిరుమలలో ప్రసాదంగా అందించే వడ నోట్లో పెట్టుకుంటే అమృతమా అన్నట్లు ఉంటుంది. తిరుమల ప్రసాదం వడ అంటే కేవలం ఒక పిండి వంటకం కాదు, అది భక్తితో కూడుకున్న ఒక పవిత్రమైన అనుభూతి. శ్రీవారికి నివేదించిన తర్వాత భక్తులకు అందించే ఈ వడ ఎన్నో ఏళ్ల చరిత్రను, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. తిరుమలలో గతంలో లడ్డూ కంటే ముందు వడ ప్రసాదమే భక్తులకు అందించేవారని చరిత్ర చెబుతోంది.
తిరుమల వడ తయారీ విధానం వెనుక ఉన్న సంప్రదాయం, అందులో వాడే పదార్థాల నాణ్యత, దానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఈ ప్రసాదాన్ని మరింత విశిష్టంగా చేస్తాయి. ఇంట్లో తయారు చేసుకున్నప్పటికీ ఆ పవిత్ర భావనతో స్వీకరించినప్పుడు తిరుమల వడ అందించే ఆధ్యాత్మిక, శారీరక ప్రయోజనాలను పొందవచ్చు. తిరుమల వడ అచ్చం గుడిలో ఇచ్చిన రుచి రావాలంటే ఇంట్లో చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తిరుమల వడ రుచికి దగ్గరగా ఇంట్లో తయారు చేసుకునే విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినుములు
-జీలకర్ర
-ఉప్పు
-మిరియాలు
-ఇంగువ
-ఆయిల్
తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ లో అరకేజీ పోట్టు ఉండే మినుములు వేసి నీళ్లు పోసి కనీసం 8 గంటలు నానబెట్టాలి.
-తర్వాత నీళ్లు పారబోసి నానిన మినుములు మిక్సీ జార్ లో వేసి నీళ్లు పోయకుండానే గ్రైండ్ చేసుకోండి. మిశ్రమం గట్టిగా ఉండాలి.
-తర్వాత రోట్లో లేదా మిక్సీలో అయినా 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు, కావాలనుకుంటే కొంచెం ఇంగువ వేసి మెత్తగా దంచుకోవాలి.
-ఇఫ్పుడు దంచిన పొడిని గ్రైండ్ చేసిన పిండిలో వేసి కలుపుకోండి.
-తర్వాత పిండిని ఓ ముద్దలా తీసుకొని తడి గుడ్డమీద పెట్టి మధ్య మధ్యలో చేతులు తడుపుకుంటూ వత్తుకోండి. పప్పు చక్కల కన్నా కాస్త మందంగా ఉంటే చాలు. మరీ మందంగా ఉండకూడదు,మరీ పల్చగా ఉండకూడదు.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసి వేడి చేసి అందులో వత్తుకున్న వడను వేసి సన్నని సెగమీద వేయించుకోవాలి. దీనికి 10 నిమిషాల సమయం పడుతుంది.
-తర్వాత బాండీలో నుంచి తీసి ప్లేట్ లో ఓ ట్విష్యూ పేపర్ ఉంచి దానిమీద వడను పెట్టండి. తద్వారా అదనపు నూనెను టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
