Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
రొటీన్ చట్నీలకు గుడ్ బై..రేగి పండు చట్నీ ట్రై చేయండి..రుచి చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
మీరు ప్రతిరోజూ ఇడ్లీ, దోసె లేదా చపాతీల్లోకి అవే పాత పల్లి, కొత్తిమీర, పుదీనా లేదా టమోటా చట్నీలను తిని విసిగిపోయారా? మీ నాలుక కొత్త రుచి కోసం తహతహలాడుతోందా? అయితే రేగి పండు చట్నీ ట్నై చేసి తీరాల్సిందే. రేగి పండ్లను సాధారణంగా మనం పండ్లుగానే తింటాం..కానీ ఈ పండ్లతో అద్భుతమైన చట్నీని తయారు చేయవచ్చు.
తీపి, పులుపు, కారంతో కూడిన రేగి పండు చట్నీ రుచి మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నం, రోటీ, పరాఠా లేదా సాయంత్రం స్నాక్స్ తో ఈ చట్నీని వడ్డించారంటే.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే, వేళ్లు నాకుతూ తినాల్సిందే. కేవలం నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్దీ అండ్ టేస్టీ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
రేగి పండ్లు: 300 గ్రాములు
వెల్లుల్లి: 1 పెద్ద రెబ్బ
నల్ల మిరియాలు: 10 గింజలు
పచ్చిమిరపకాయలు: 3
నల్ల ఉప్పు: రుచికి సరిపడా
ఆవాల నూనె: కొద్దిగా తాలింపు కోసం
ఎండు మిరపకాయలు: 2
తయారీ విధానం
-ముందుగా 300 గ్రాముల తాజా రేగి పండ్లను పండ్లను నీటిలో శుభ్రంగా కడగాలి.
-కడిగిన తర్వాత ఒక మెత్తటి కాటన్ వస్త్రంతో తడి లేకుండా బాగా తుడవండి. ఇప్పుడు, కత్తితో రేగి పండ్లను ముక్కలుగా కట్ చేసి, లోపల ఉన్న గట్టి విత్తనాలను తీసివేసి పక్కన పెట్టండి. కేవలం మెత్తటి గుజ్జు భాగాన్ని మాత్రమే ఉంచుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో కట్ చేసిన రేగి పండ్ల ముక్కలు, వెల్లుల్లి రెబ్బ, పచ్చిమిర్చి, రుచికి సరిపడా నల్ల ఉప్పును వేసి అవసరమైతే చాలా తక్కువ మోతాదులో నీరు పోసి, మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ లా రుబ్బుకోండి. మరీ నీళ్ళగా కాకుండా, చట్నీలా గట్టిగా ఉండేలా చూసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-చట్నీ రుచిని రెట్టింపు చేసేది అందులో వేసే తాలింపు. దీనికోసం స్టవ్ మీద చిన్న గరిటె పెట్టి, అందులో స్వచ్ఛమైన ఆవాల నూనె పోసి వేడి చేయండి. నూనె వేడయ్యాక నల్ల మిరియాలు, రెండు ఎండు మిరపకాయలు వేసి వేయించండి.
-ఈ వేడి వేడి తాలింపును గిన్నెలోని చట్నీ మీద పోసి బాగా కలపండి. అంతే ఎంతో రుచికరమైన రేగి పండు చట్నీ రెడీ. ఈ చట్నీ కేవలం నాలుకకే కాదు, శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












