Latest Updates
-
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
సాధారణంగా పరాఠా అనగానే మనందరి నోళ్లలో నీళ్లు ఊరుతాయి. కానీ, ఫిట్ నెస్ మీద శ్రద్ధ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు పరాఠాలకు దూరంగా ఉంటారు. అందులో వాడే నూనె, నెయ్యి లేదా పిండి పదార్థాలు బరువు పెంచుతాయని వారి భయం. అయితే మీరు డైట్‌లో ఉన్నప్పటికీ ఎలాంటి గిల్ట్ లేకుండా కడుపు నిండా తినదగినదే రాగి పనీర్ పరాఠా.

రాగి పిండి, ప్రోటీన్లతో నిండిన పనీర్ కలయికతో తయారయ్యే ఈ పరాఠా శరీరానికి కావాల్సిన పోషకాలను పూర్తిస్థాయిలో అందిస్తుంది. ఇందులో ఫైబర్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు , ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే, కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. తద్వారా పదే పదే ఆకలి వేయదు. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఇది నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్.
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
రాగి పనీర్ పరాఠా తయారీకి కావాల్సిన పదార్థాలు
రాగి పిండి: 1/8 కప్పు
గోధుమ పిండి: 1 టేబుల్ స్పూన్
తురుమిన పనీర్: 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన కొత్తిమీర: అర టీస్పూన్
అల్లం-వెల్లుల్లి పేస్ట్: పావు టీస్పూన్
ధనియాల పొడి: పావు టీస్పూన్
కారం: పావు టీస్పూన్
జీలకర్ర: పావు టీస్పూన్
పసుపు: పావు టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి: 2-3 టీస్పూన్లు (కాల్చడానికి)
నీరు: పిండి కలపడానికి తగినంత
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
రాగి పనీర్ పరాఠా తయారీ విధానం
-ముందుగా ఒక శుభ్రమైన పెద్ద గిన్నెలో రాగి పిండి, గోధుమ పిండి వేసి కలపండి. ఇప్పుడు కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోస్తూ, చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోండి. కలిపిన పిండిపై ఒక మూత పెట్టి, సెట్ అవ్వడానికి కనీసం 5 నిమిషాల పాటు పక్కన ఉంచండి.
-పిండి నానేలోపు, పరాఠా లోపల పెట్టుకునే పనీర్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి.ఇందుకోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు మెత్తగా తురిమిన పనీర్(బరువు తగ్గాలనుకునే వారు సాధారణ పనీర్ కు బదులుగా లో ఫ్యాట్ పనీర్ వాడటం ఉత్తమం), పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, స్టవ్ ఆపేసి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వండి.
-ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని చిన్న ఉండలుగా చేసుకోండి. ఒక ఉండను తీసుకుని తేలికగా చిన్న పూరీ సైజులో ఒత్తండి. అందులో పనీర్ మిశ్రమాన్ని ఉంచి, అంచులన్నీ మూసివేసి ముద్దలా చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా, స్టఫింగ్ బయటకు రాకుండా పరాఠాలా ఒత్తుకోండి.
-పెనం వేడి చేసి, కొద్దిగా నూనె రాసి, పరాఠాను రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు దోరగా కాల్చుకోండి. అంతే రాగి పనీర్ పరాఠా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications