Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పొద్దున్నే ఈ పూరీ తింటే రోగాలన్నీ పరార్..షుగర్ పేషెంట్లు కూడా హాయిగా తినొచ్చు..ఎలా చేయాలంటే
సాధారణంగా మన తెలుగువాళ్లు పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి తీసుకునే ప్రధాన ఆహారాల్లో పూరీ ఒకటి. కొంతమంది అయితే పూరీకి సైడ్ డిష్ గా తయారుచేసే కర్రీ కోసం అయినా పూరీ తింటుంటారు. అయితే మీరెప్పుడైనా రాగి పూరీ తిన్నారా? దీనిని రాగి పిండితో తయారుచేస్తారు. ఇది చాలా రుచికరమైన వంటకమే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా. రాగి పూరీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
రాగి పూరీ తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి - 2 కప్పులు
గోధుమ పిండి - 1/2 కప్పు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
నీరు - పిండి కలపడానికి సరిపడా
రాగి పూరీ తయారీ విధానం
ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ లో రాగి పిండి వేయండి. ఇందులో కావాలి అనుకుంటే గోధుమ పిండి కూడా వేయండి.
అందులో రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి.
కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తని పిండి ముద్దలా కలుపుకోండి. పిండి మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. చపాతీ పిండిలా ఉండాలి.
పిండిని తడి గుడ్డతో కప్పి 15-20 నిమిషాలు నాననివ్వండి.
నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి.
ఒక్కో ఉండను తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చిన్న పూరీల్లాగా ఒత్తుకోండి. మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఒత్తుకుంటే పూరీలు బాగా పొంగుతాయి.
-స్టవ్ మీద డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టి ఒక్కొక్క పూరీని వేడి నూనెలో వేయండి.
-పూరీ నూనెలో వేసిన వెంటనే పైకి తేలుతుంది. గరిటెతో మెల్లగా నొక్కడం వల్ల అది బాగా పొంగుతుంది.
-రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
-వేయించిన పూరీలను ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అదనపు నూనెను పీల్చుకోవడానికి టిష్యూ పేపర్ ఉపయోగించవచ్చు.
-వేడి వేడి రాగి పూరీలను కూరలు, చట్నీలు లేదా సాంబార్ తో తింటే నోట్లో బ్లాస్టే.
వంకాయతో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? మన పూర్వీకులు ఇలానే చేసేవాళ్లు..రుచి కేక అంతే,ఎలా చేయాలంటే
రాగి పూరి ప్రయోజనాలివే
రాగి పూరి తినడం వల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో
చక్కెర స్థాయిలు త్వరగా పెరగకుండా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఇది
చాలా మంచి ఆహారం. రాగిలోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది..
ఫలితంగా చక్కెర విడుదల నెమ్మదిగా జరుగుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు
నిండినట్లు ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది,బరువు
తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే రాగిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
రాగిలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే
ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్
(HDL) స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది, తద్వారా గుండె సంబంధిత
సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
రాగిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా
సహాయపడుతుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












