For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీరకాయ బజ్జీ రెసిపి ; బీరకాయ బజ్జీ ఎలా తయారుచేయాలి: వీడియో

బీరకాయ బజ్జీ ప్రసిద్ధ దక్షిణాది వంటకం. దీన్ని సాయంకాలం చిరుతిండిగా తింటారు. వీడియో, చిత్రాల సాయంతో స్టెప్ బై స్టెప్ విధానాన్ని ఫాలో అయి మీరూ చేయండి.

Posted By: Lekhaka
|

బీరకాయ బజ్జీ ప్రసిద్ధ దక్షిణాది వంటకం. దీన్ని సాయంకాలం చిరుతిండిగా తింటారు. దీన్ని బీరకాయను సెనగపిండితో కలిపి వేయించి చేస్తారు. ఇది వర్షాకాలపు సాయంత్రం టీ తాగుతూ తినడానికి ఎంతో బావుంటుంది. పైన కరకరలాడుతూ, లోపల మెత్తని బీరకాయతో ఈ బజ్జీలు చాలా నోరూరిస్తాయి.

దక్షిణాదిలో ప్రసిద్ధమైన ఈ వంటకం అన్ని పండగలకి, పార్టీలకు వండతారు. ఇదే తరహాలో బంగాళదుంపల బజ్జీ, మిర్చి బజ్జీలను కూడా తయారుచేయవచ్చు.

అతిథులు అనూహ్యంగా వస్తే అప్పటికప్పుడు చేసుకోడానికి బీరకాయ బజ్జీ త్వరగా అవుతుంది. అందుకని ఏదన్నా కొత్తగా ప్రయత్నించాలనుకుంటే, వీడియో చిత్రాలతో కూడిన స్టెప్ బై స్టెప్ విధానాన్ని చూడండి.

బీరకాయ బజ్జీ వీడియో రెసిపి

బీరకాయ బజ్జీ రెసిపి | బీరకాయ బజ్జీ ఎలా తయారుచేయాలి | బీరకాయ బజ్జీ రెసిపి | హీరకాయ బజ్జీ రెసిపి
బీరకాయ బజ్జీ రెసిపి | బీరకాయ బజ్జీ ఎలా తయారుచేయాలి | బీరకాయ బజ్జీ రెసిపి | హీరకాయ బజ్జీ రెసిపి
Prep Time
10 Mins
Cook Time
10M
Total Time
20 Mins

Recipe By: Kavyashree S

Recipe Type: Snacks

Serves: 4

Ingredients
  • బీరకాయ - ½

    సెనగపిండి -1/2 గిన్నె

    పసుపు -అర చెంచా

    ఇంగువ -పావు చెంచా

    ఎర్రకారం -1 చెంచా

    జీలకర్ర - అరచెంచా

    ఉప్పు రుచికి తగినంత

    నూనె- 2చెంచాలు + వేయించడానికి

    నీరు -1 కప్పు

How to Prepare
  • 1.బీరకాయను సగానికి కోసి,ఒకవైపున పైన చెక్కుతీయండి.

    2. చిన్నముక్కలు గుండ్రంగా కోసి పక్కనపెట్టుకోండి.

    3. సెనగపిండిని గిన్నెలో వేయండి.

    4. పసుపు, ఇంగువను వేయండి.

    5. ఎర్రకారం, జీలకర్రను కూడా వేయండి.

    6. ఉప్పును కూడా వేసి బాగా కలపండి.

    7.వేడిచేసిన పెనంలో 2 చెంచాల నూనెను వేయండి.

    8. నూనెను రెండునిమిషాలు కాగనివ్వండి.

    9. దాన్ని మిశ్రమానికి కలపండి.

    10. కొంచెం కొంచెం నీరు పోస్తూ పిండిని జారుడుగా కలపండి.

    11. వేయించడానికి బాండీలో నూనెను మరగనివ్వండి.

    12. బీరకాయ ముక్కలను పిండిలో వేసి బాగా పిండి పట్టేట్లా చూడండి.

    13. ఒక్కొక్క పిండిలో ముంచిన ముక్కను నూనెలో వేసి మధ్యమంగా మంటపై వేయించండి.

    14.ఒకవైపు వేగాక, తిప్పి మరోవైపు వేయించండి.

    15. గోధుమరంగులోకి వచ్చేవరకూ వేయించండి.

    16. నూనె నుంచి తీసి , వేడివేడిగా వడ్డించండి.

Instructions
  • 1 చెంచా బియ్యపు పిండిని కూడా కలిపితే కరకరమంటూ రుచిగా ఉంటాయి.
Nutritional Information
  • సరిపోయేది - 2బజ్జీలు
  • క్యాలరీలు - 156.2 క్యాలరీలు
  • కొవ్వు - 6.3 గ్రాములు
  • ప్రొటీన్ - 4.1 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 22.5 గ్రాములు
  • చక్కెర - 1.1 గ్రాములు
  • ఫైబర్ - 3.2 గ్రాములు

స్టెప్ బై స్టెప్ - బీరకాయ బజ్జీ ఎలా తయారుచేయాలి

1.బీరకాయను సగానికి కోసి,ఒకవైపున పైన చెక్కుతీయండి.

2. చిన్నముక్కలు గుండ్రంగా కోసి పక్కనపెట్టుకోండి.

3. సెనగపిండిని గిన్నెలో వేయండి.

4. పసుపు, ఇంగువను వేయండి.

5. ఎర్రకారం, జీలకర్రను కూడా వేయండి.

6. ఉప్పును కూడా వేసి బాగా కలపండి.

7.వేడిచేసిన పెనంలో 2 చెంచాల నూనెను వేయండి.

8. నూనెను రెండునిమిషాలు కాగనివ్వండి.

9. దాన్ని మిశ్రమానికి కలపండి.

10. కొంచెం కొంచెం నీరు పోస్తూ పిండిని జారుడుగా కలపండి.

11. వేయించడానికి బాండీలో నూనెను మరగనివ్వండి.

12. బీరకాయ ముక్కలను పిండిలో వేసి బాగా పిండి పట్టేట్లా చూడండి.

13. ఒక్కొక్క పిండిలో ముంచిన ముక్కను నూనెలో వేసి మధ్యమంగా మంటపై వేయించండి.

14.ఒకవైపు వేగాక, తిప్పి మరోవైపు వేయించండి.

15. గోధుమరంగులోకి వచ్చేవరకూ వేయించండి.

16. నూనె నుంచి తీసి , వేడివేడిగా వడ్డించండి.

[ 4 of 5 - 86 Users]
English summary

Heerekai Bajji Recipe | How To Make Ridge Gourd Bajji | Heerekayi Bajji Recipe | Beerekaya Bajji Recipe। బీరకాయ బజ్జీ తయారుచేయటం ఎలా । బీరెకాయ బజ్జీ రెసిపి

Heerekai bajji is a popular South Indian snack that is prepared during evening tea time. Watch the video recipe and follow the step-by-step procedure with
Desktop Bottom Promotion