హై ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్..ఉదయాన్నే ఈ మొలకల సలాడ్ తింటే.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!

Posted By:

ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. జిమ్ కసరత్తులతో పాటు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడే పెసల మొలకలు ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ లా పని చేస్తాయి.

ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే మొలకలు, ఆరోగ్యకరమైన అల్పాహారంగా మాత్రమే కాకుండా, బరువు తగ్గించే దివ్యౌషధంగా కూడా పరిగణించబడుతున్నాయి. మరి వీటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి? వీటితో రుచికరమైన వంటకాలను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి. బయట కొనుగోలు చేసే పనిలేకుండా, ఇంట్లోనే పరిశుభ్రంగా మొలకలను పెంచుకోవచ్చు.

High Protein Breakfast Recipe How to make Moong Dal Sprouts at home

ముందుగా పెసలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని పూర్తిగా వడకట్టేయాలి. ఇప్పుడు నానిన పెసలను ఒక తడి కాటన్ లేదా మస్లిన్ వస్త్రంలో వేసి, గట్టిగా మూట కట్టాలి. ఈ మూటను వెచ్చని ప్రదేశంలో ఉంచండి లేదా ఏదైనా గిన్నెతో కప్పి ఉంచండి. ఇలా 1-2 రోజులు ఉంచితే చాలు. మధ్యలో ఒకసారి తనిఖీ చేయండి. వస్త్రం లేదా పప్పు మరీ ఎండిపోయినట్లు అనిపిస్తే కాస్త నీళ్లు చల్లండి. కేవలం రెండు రోజుల్లోనే పొడవాటి, ఆరోగ్యకరమైన మొలకలు సిద్ధమవుతాయి.

ఈ మొలకలతో 3 రకాల రుచికరమైన బ్రేక్ పాస్ట్ లు

స్పైసీ వెజిటబుల్ మొలకల చాట్
మొలకలను పచ్చిగా తినడం వల్ల వాటిలోని పోషకాలు పూర్తిగా మన శరీరానికి అందుతాయి.
-ఒక గుప్పెడు మొలకలను బౌల్‌ లో తీసుకోండి.
-అందులో సన్నగా తరిగిన దోసకాయ, టమోటా, ముల్లంగి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కలపండి.
-ఉడికించిన మొక్కజొన్న, బీట్‌ రూట్ ముక్కలు, పన్నీర్ ముక్కలను జోడించండి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, చిటికెడు చాట్ మసాలా, నల్ల ఉప్పు,నిమ్మరసం పిండుకుని కలపండి. ఇది ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఫ్రూటీ స్ప్రౌట్స్ సలాడ్ (తీపి ప్రియుల కోసం)

-ఒక గుప్పెడు మొలకల్లో సన్నగా తరిగిన ఆపిల్ ముక్కలు, ద్రాక్ష, దానిమ్మ గింజలను కలపండి.

-అందులో బీట్‌ రూట్ ముక్కలు, పన్నీర్, దోసకాయలను కూడా వేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయలు, టమోటాలు లేదా పచ్చిమిర్చిని అస్సలు వేయవద్దు.

-చివరగా కొంచెం చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం జోడించి ఆస్వాదించండి. ఇది ఉదయం పూట మంచి ఎనర్జీ బూస్టర్‌ లా పనిచేస్తుంది.

తాలింపు మొలకలు

-కొంతమందికి పచ్చి మొలకలు తినడం ఇబ్బందిగా అనిపించవచ్చు. అటువంటి వారి కోసం ఈ మూడవ పద్ధతి బాగుంటుంది.

-ఒక పాన్‌ లో 1 టేబుల్ స్పూన్ వెన్న లేదా ఆవాల నూనె వేడి చేయండి.

-అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలను వేసి వేయించండి.

-తర్వాత మొలకలను వేసి, రుచికి సరిపడా ఉప్పు కలపండి.

-మూత పెట్టి సుమారు 10 నిమిషాలు సన్నని మంటపై మగ్గనివ్వండి.

-చివరగా చాట్ మసాలా, నిమ్మరసం జోడించండి.

-ఈ వేయించిన మొలకలు చాలా మృదువుగా, రుచిగా ఉంటాయి. జీర్ణక్రియకు కూడా ఇవి చాలా మంచివి.

[ of 5 - Users]
Story first published: Friday, February 13, 2026, 12:10 [IST]
Desktop Bottom Promotion