Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ ఒక్క పొడి ఉంటే ఎప్పుడంటే అప్పుడు నిమిషాల్లో పెసరట్టు..ఎలా తయారుచేసుకోవాలంటే
పెసరట్టు అనేది ఆంధ్ర వంటకాల్లో చాలా ముఖ్యమైన అల్పాహారం. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ లో మొదటి ప్లేస్ లో పెసరట్టు ఉంటుంది. ఇది చాలా రుచికరంగా కూడా ఉంటుంది. అయితే దీన్ని తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. ముందుగా పెసలు నానబెట్టి, వాటిని రుబ్బి, రాత్రంతా పులియబెట్టాలి. కానీ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ ఉంటే, ఈ పని చాలా సులభం అవుతుంది. ఈ పొడిని తయారుచేసుకుని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కేవలం పది నిమిషాల్లో వేడివేడిగా పెసరట్టు చేసుకోవచ్చు. పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-బియ్యం
-కరివేపాకు
-అల్లం
-జీలకర్ర
-పచ్చిమిర్చి
-ఇంగువ
-ఉప్పు

పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ తయారీ విధానం
-ఈ ఒక్క పొడి ఉంటే ఎప్పుడంటే అప్పుడు నిమిషాల్లో పెసరట్టు..ఎలా తయారుచేసుకోవాలంటే
-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో పొట్టుతో ఉన్న పెపరపప్పు 2 కప్పులు, పావు కప్పు బియ్యం వేసి నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగాలి.
-తర్వాత వాటిని పొడి గుడ్డపై వేసి బాగా పరిచి ఫ్యాన్ కింద పెట్టి తడి అనేది లేకుండా ఆరనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో బాగా ఆరిన మినపప్పు,బియ్యంను వేసి తక్కవ మంటమీద 3-4 నిమిషాలు వేయించుకోవాలి. లైట్ గా వేగిన తర్వాత వాటన్నింటిని ఓ బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద అదే పాన్ లో 1 ఇంచు అల్లం(కట్ చేసి ముక్కలు),3 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 రెబ్బ కరివేపాకు కూడా వేపి తక్కువ మంట మీద ఆయిల్ లేకుండానే వేయించాలి. అల్లం,పచ్చిమిర్చి లోని చెమ్మ పోయేదాకా వేగనివ్వాలి.
-తర్వాత అందులో 1 టీస్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి.
-ఇప్పుడు వేయించిన వీటన్నింటిని ముందుగా వేయించి పక్కనపెట్టుకున్న పెసరపప్పు మిశ్రమంలో వేసి కలుపుకొని బాగా చల్లారనివ్వండి.
-బాగా చల్లారిన తర్వాత 1 టీస్పూన్ ఉప్పు, కొద్దిగా ఇంగువ కూడా వేసి కలిపి మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్ లోకి వేసుకొని పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి.
-మిక్సీ వేసిన వెంటనే పౌడర్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి దీనిని కొద్దిసేపు పక్కన ఉంచి బాగా చల్లారాకా అప్పుడు గాలి చొరబడని డబ్బాలో వేసుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది.
-పెసరట్టు వేసుకోవాలనుకున్నప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో అర కప్పు పెసరట్టు పౌడర్, అరకప్పు నీళ్లు పోసి బాగా కలిపాక కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత పెసరట్టు వేసుకొని ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications