Latest Updates
-
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
నీళ్లు మరిగిస్తే చాలు..చిటికెలో ఉప్మా రెడీ.. ఇంట్లోనే ఉప్మా ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలంటే..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ప్రతి ఒక్కరికీ సమయం చాలా విలువైనది. ఉదయం లేచిన వెంటనే ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లే హడావిడిలో చాలా మంది టిఫిన్ తినడం మానేస్తుంటారు లేదా అనారోగ్యకరమైన బయట దొరికే ఆహారం వైపు మొగ్గు చూపుతుంటారు. ఇలాంటి సమయంలో మనకు ఎంతగానో ఉపయోగపడేది ఉప్మా ప్రీమిక్స్ (Upma Premix).
మార్కెట్లో దొరికే రెడీ టు ఈట్ ప్యాకెట్ల కంటే ఇంట్లో చేసుకునే ఈ మిక్స్ ఆరోగ్యకరమైనది, రుచికరమైనది, పొదుపైనది. మీ దగ్గర ఈ ప్రీమిక్స్ ఉంటే కేవలం నీళ్లు మరిగించడం ద్వారా 5 నిమిషాల్లో టిఫిన్ రెడీ అవుతుంది. ఉద్యోగస్తులకు, స్కూల్ పిల్లలకు, దూర ప్రయాణాలు చేసేవాళ్లకు, బ్యాచిలర్స్ కు ఇది వరం లాంటిది. ఉప్మా ప్రీమిక్స్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉప్మా రవ్వ
-పల్లీలు
-జీడిపప్పు
-నూనె
-పచ్చిమిరపకాయలు
-నల్ల మినపప్పు
-పచ్చి శెనగపప్పు
-ఆవాలు
-ఉల్లిపాయలు
-అల్లం
-కరివేపాకు
తయారీ విధానం
-ముందుగా పచ్చిమిర్చి, అల్లం మరియు కరివేపాకును శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి. వాటిని చాలా సన్నగా తరగాలి. ప్రీమిక్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిలో తడి అస్సలు ఉండకూడదు.
-స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి అందులో 1 కేజీ ఉప్మా రవ్వ(6 కప్పులు)వేసి తక్కువ మంట మీద మంచి సువాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి.
-తర్వాత కడాయిలో అర కప్పు నూనె వేసి వేడి చెయ్యండి. నూనె వేడెక్కాక అందులో ముప్పావు కప్పు పల్లీలు(వేరుశెనగపప్పు)వేసి దోరగా వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత కడాయిలో ఉన్న ఆయిల్ లో పావు కప్పు నల్ల మినపప్పు, పావు కప్పు పచ్చి శెనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి దోరగా వేయించి వీటిని కూడా ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయిలోని ఆయిల్ లో అరకప్పు జీడిపప్పు కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత కడాయిలోని నూనెలోనే 2 ఉల్లిపాయల పొడవాటి చీలికలు వేసి మంచి రంగు వచ్చేవరకు(గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ లా) వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత కడాయిలోని నూనెలోనే 4 అంగుళాల అల్లం సన్నని తరుగు వేసి వేయించి పక్కకు తీసి పెట్టుకోండి.
-తర్వాత అదే కడాయిలోని నూనెలో 7 పచ్చిమిరపకాయల ముక్కలు వేసి వేయించి పక్కకు తీసి పెట్టుకోండి.
-తర్వాత అదే కడాయిలోనే 7 రెబ్బల కరివేపాకు వేసి వేయించుకొని బాగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి.
-వేయించినవన్నీ చల్లారిన తర్వాత వేయించిన రవ్వలో వేసి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత, గాలి చొరబడని గాజు సీసాలో లేదా స్టీల్ డబ్బాలో భద్రపరచుకోవాలి.
ఉప్మా ప్రీమిక్స్తో ఉప్మా వండుకునే విధానం
మీకు ఆకలి వేసినప్పుడు కేవలం 5 నిమిషాల్లో ఉప్మా తయారు చేసుకోవచ్చు.
ఒక గిన్నెలో ప్రీమిక్స్ తీసుకుని అందులో మరుగుతున్న నీళ్లు పోసి మూత
పెట్టవచ్చు. మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. వేడివేడి ఉప్మా
రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












